శ్రీలంకలో చికెన్ దొరకడం లేదు. పాలు, పాలపొడి దుకాణాల్లో కనిపించడం లేదు. పెట్రోల్ డీజిల్ బంగారమయ్యాయి. దేశమంతా పవర్ కట్. పరిశ్రమలు మూతపడుతున్నాయి. పేపర్ లేక పరీక్షలు నిరవధికంగా వాయిదా వేశారు. అంతర్జాతీయ అప్పులు చెల్లించేందుకు డబ్బు లేదు. డాలర్లు కురిపించే టూరిజం మూత పడింది….
శ్రీలంకకు 1948లో స్వాతంత్య్రం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఇలాంటి ఆర్థిక సంక్షోభాన్ని దేశ ప్రజలు ఎదుర్కోలేదు. ఎల్ టిటిఇ తో తీవ్రంగా యుద్ధం జరుగుతున్నపుడు కూడా ప్రజలకు ఆహార పదార్థాలకు, ఇంధనానికి తిప్పలు పడలేదు. కాని ఇపుడు శ్రీలంక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంది.
ఇంగ్లండ్ కు చెందిన ‘ది గార్డియన్’ కథనం ప్రకారం, శ్రీలంకలోచికెన్ దొరకడం లేదు. మొన్నటి మొన్నటి దాకా చికెన్ శ్రీలంకలో సాధారణ ఆహారం. ఇపుడు అది విలాసపు సరుకు అయి కూచుంది. ఇక పాలు పాలపడి గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎపుడు అంగట్లోకి వస్తాయో, ఎపుడు మాయమవుతాయో తెలియడం లేదు. పాలరాకకోసం మహిళలు రాత్రంగా కాపలా కాస్తున్నారని గార్డియన్ రాసింది. మాకుబుంటాని భోజనం ఎలా పెట్టాలోతెలియడం లేదని ఇల్లాళ్లు వాపోతున్నారు.
ఆహార సరకుల కొరత తీవ్రమయింది.దీనితో ధరలు ఆశాన్నంటాయి. దేశంలో పవర్ కట్ తీవ్రమయింది. ఇపుడు దేశమంతా ఐదుగంటల పవర్ కట్ విధించారు అంతేకాదు, పవర్ ఎపుడైనా బంద్ కావచ్చనే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దేశంలో ప్రింటింగ్ పేపర్ లేకపోవడంతో దేశమంతా పరీక్షలు రద్దు చేశారు. సోమవారం నుంచి ఈ పరీక్షలు మొదలుకావలసి ఉండింది. పేపర్ కొరత తీవ్రంగా ఉండటంతో, దిగుమతి చేసుకునేందుకు డాలర్లు లేకపోవడంతో ఈ పరీక్షలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు శ్రీలంక విద్యా శాఖ శనివారం నాడు ప్రకటించింది. దేశాన్ని అదుకోండని గత బుధవారం నాడు దేశాధ్యక్షడు గోటబయ రాజపక్ష అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ను కోరారు. శ్రీలంక మీద అప్పుల భారం తీవ్రంగా ఉంది. ఈ ఏడాది సుమారు 6.9 బిలియన్ డాలర్ల రుణం చెల్లించాలి. అయితే, ఖజానా లో అందుబాటులో ఉండేది కేవలం 2.3 బిలియన్ డాలర్లే. అప్పు లు కూడా చెల్లించలేనిపరిస్థితి వచ్చింది.
దీంతో 45 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయారు. పవర్ కట్ , ఆహారధాన్యాల కరువు, ధరలు పెరగడంతో దాదాపు 90 శాతం హోటళ్లు శ్రీలంకలో మూతపడ్డాయి. ప్రస్తుతం అక్కడ లీటర్ పెట్రోల్ శ్రీలంక రూ. 283 గా ఉంది. లీటర్ డీజిల్ రూ. 220 ఉంది. 1990 సంక్షోభం కంటే మరింత దారుణంగా పరిస్థితులు ఉన్నాయి. కిలో చికెన్ కొనాలంటే ఏకంగా రూ. 1000 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక ఒక్క కోడిగుడ్డు ధర రూ. 35 పలుకుతుంది. లీటర్ కొబ్బరి నూనె 900 రూపాయలు, కిలో పాలపొడి 2 వేలుగా ఉంది.. ఇక గ్లాసు పాలకు రూ. 100 ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం డాలర్ తో శ్రీలంక కరెన్సీ విలువ రూ. 270 కి చేరింది.
శీలంక ఆర్థిక సంక్షోభం పరిశ్రమలను తాకింది. చాలా పరిశ్రమలు మూతబడుతున్నాయి. దేశంలో పరిస్థితి ఎలా దో Daily Mirror అనే పత్రిక Empty Treasury, Power Cuts, Fuel Shortages and Nonsense అనే హెడ్డింగ్ చూపించింది. గతంలో రెండు వేల శ్రీలంక రుపాయల ఖర్చయ్యే సరుకులు ఇపుడు రు.5వేలఅవుతున్నాయి.
ఈ కష్టాలనుంచి బయటపడేందుకు ఇండియా, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ల నుంచి సాయం అందుతుందేమోనని శ్రీలంక ఎదురుచూస్తున్నదని Daily Mirror రాసింది.
A majority of our citizens today live below the poverty line (below US$ 3 per day). The government of our country like these unfortunate folk is living from one day to the next. It is waiting for bailouts from India, China, Bangladesh, Pakistan or from goodness knows where which will provide the country with a life-line for tomorrow.
శ్రీలంకకు ఇలా దివాళా తీసేందుకు ఒక ప్రధాన కారణం కోవిడ్ 19 కూడాను. ఎందుకంటే, పాండెమిక్ వల్ల శ్రీలంక టూరిజం మూతపడింది. ఫలితంగా దేశానికి రావాలసిన 4 బిలియన్ డాలర్ల రాబడి మాయమయింది.
ఈ సంక్షోభం మీద నిరసన తెలుపుతూ మార్చి 15 రాజధాని కొలంబోలో వేల సంఖ్యలో ప్రజలు ప్రదర్శన లు జరిపారు. వీరంతా అధ్యక్ష భవనం వెలపల జమకుడి ధర్నా జరిపారు. యునైటెడ్ పీపుల్స్ ఫోర్స్ అధ్వర్యంలో ఈ ప్రదర్శనలు జరిగాయి.