టెక్స్ట్ బుక్ ను డిక్షనరీ లాగా వాడాను: రఘు IPS
వై. రఘువంశీ పశ్చిమబెంగాల్ క్యాడర్ కు చెందిన 2013 బ్యాచ్ ఐపిఎస్ అధికారి. ఇపుడాయన అలీపూర్ దువార్ లో ఎస్ పి గా ఉంటున్నారు. ఆయన తెలంగాణ సంగారెడ్డి నుంచి వచ్చారు. స్కూల్ చదువంతా అక్కడే జరిగింది. ఇంటర్ కు హైదరాబాద్ ‘నలందా’ వచ్చారు. ఆ పైన ఖరగ్ పూర్ ఐఐటి లో సివిల్స్ పూర్తి చేశారు. మూడేళ్ల ఉద్యోగం తర్వాత ఆయన సివిల్స్ రాసి, ఐపిఎస్ కు ఎంపికయ్యారు.
తన సివిల్స్ ప్రిపరేషన్ మెలకువల గురించి పశ్చిమబెంగాల్ కే చెందిన సీనియర్ ఐఎఎస్ అధికారి డాక్టర్ ఎంవి రావుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
డాక్టర్ రావు ఈ మధ్య ఆసక్తికరమయిన ఇంటర్యూలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రేక్షకుల్లో ఆత్మస్థయిర్యాన్ని నింపేవే. ఆయన చేస్తున్న ఇంటర్వూలు రెండు. రకాలు, ఇందులో మొదటి నిత్యజీవన సమర సక్సెస్ స్టోరీలు. ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుని వివిధ గ్రామీణ ఉత్పత్తుల ద్వారా చిరు వ్యాపారాలు చేసి జీవనప్రమాణాలు పెంచుకుంటున్న మహిళల కథనాలు. ఇటీవల సుందర్ బన్ తేనే వ్యాపారంలో మహిళలు ఎలా విజయవంతమయింది చెప్పారు. ఇలా ఎన్నోొ సాధారణ మహిళల అసాధారణ విజయాల గురించి చెబుతూ ఆత్మస్థయిర్యాన్ని నింపుతున్నారు.
రెండో రకం ఇంటర్వ్యూలు యంగ్ సివిల్స్ సర్వెంట్ల విజయగాథలు. చాలా మంది కుర్ర ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు జిల్లాలలో పని చేస్తున్నపుడు ఆదర్శవంతంగా, అంకిత భావంతో బాధ్యతలు నిర్వర్తించి జనాదరణ పొందుతూ ఉంటారు. ఇలాంటి కలెక్టర్లను ఒక్కొక్కసారి బదిలీ చేయడాన్ని కూడా ప్రజలు వ్యతిరేకించి ధర్నాలు చేసిన సందర్బాలున్నాయి. చాలా మంది సీనియర్ ఐఎఎస్ అధికారులను ఫలానా జిల్లా కలెక్టర్ గానే గుర్తు పెట్టుకుంటారు ప్రజలు. వారు కూడా ఆ జిల్లాల అనుభవాన్ని గొప్పగా చెప్పుకుంటూంటారు. సివిల్ సర్వెంట్లకు ప్రజలకు దగ్గిరగా ఉంటూ పనిచేసే అవకాశం జిల్లా బాధ్యతలే కల్పిస్తాయి.
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో, వాటిని అమలు చేయడంలో, అలాగే ప్రజలకు భద్రత కల్పించడంలో ఈ కుర్ర అధికారులు కొత్త పుంతలు తొక్కుతూ ఉంటారు. అసలు వాళ్లు సివిల్స్ పరీక్షలు ఎందుకు రాయాలనుకున్నారు. ఎలా ఉత్తీర్థులయ్యారు, ఉద్యోగ బాధ్యతలు చేపట్టాక ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటి అనేవిషయాల గురించి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇలాంటి ఇంటర్వ్యూలు గతంలో ఎవరూ చేసినట్లు లేరు. పత్రికల వాళ్లో, కోచింగ్ సెంటర్ల వాళ్లో సివిల్స్ రిజల్ట్స్ వచ్చినపుడు చేయడం వేరు. ఒక సీనియర్ అధికారి ఈ దారి పట్టడం వేరు. ఈ సారి డాక్టర్ రావు సివిల్స్ ప్రిపేరేషర్ గురించి వై. రఘువంశీ నుంచి సమాచారం సేకరించారు.
రఘువంశీ చాలా ఉత్తేజకరమయిన సమాచారం అందించారు. ఇందులో మూడు ముఖ్యమయిన అంశాలున్నాయి.
1. ఎవరి నుంచి ఉత్తేజం పొందినా ప్రతి అభ్యర్థి తనదైన ఒక మార్గం ఏర్పరుచుకోవలసిందే.
2. టెక్స్ట్ బుక్ ప్రాముఖ్యం.
3. విశ్లేషణా శక్తి.
రఘువంశీ సూచనలేవీ ఖరీదయినవి కావు. సులభంగా ఆచరించదగ్గవి, ఎక్కడి నుంచైనా ఆచరించవచ్చు. పట్టణాల్లోనే ఉండనవసరం లేదు. సూదూర గ్రామాల్లో ఉండి కూడా వాటిని ఫాలో కావచ్చు.
ఇందులో మొదటి అంశం గురించి చూద్దాం. ఒక్కొక్కరి పెరుగదల (Upbringing)ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందువల్ల ఎవరు ఎవరిని కాపికొట్టడానికి వీల్లేదు. ఎవరి బలాలు, బలహీనతలు వారి సొంతం. మరొక విజేతను అనుకరించడం సబబు కాదు. తమ బలహీనతలు, బలాలు గుర్తించి వాటికి అనుగుణమయిన వ్యూహం తయారు చేసుకుని ముందుకు సాగాాలి. క్లుప్తంగా ఆయన చెబుతున్నది ‘మీ మార్గం మీరు ఎంచుకోండి’ అని.
ఇక రెండో విషయానికి వస్తే… ఆయన టెక్స్ట్స్ బుక్ మీద ఎక్కు వ అధార పడ్డారు. ఎంతగా అంటే, దానిని ఆయన డిక్షనరీలాగ, రెపరెన్స్ పుస్తకంగా లాగా వాడారు. ఆయన పుస్తకంలో టెక్స్ట్ బుక్స్ కి అత్యధిక ప్రాధాన్యం ఉంది. న్యూస్ పేపరల్లో కరెంట్ ఎఫైర్స్ చదువుతున్నా బ్యాక్ గ్రౌండ్ కోసం వెంటనే ఆయన టెక్స్ట్ బుక్స్ రెఫర్ చేసేవారు. జ్ఞాపక శక్తి ఎవరికైనా పరిమితమే. అందువల్ల రివిజన్ తప్పని సరి అవుతుందని చెబుతూ అపుడు కూడా ఆయన టెక్స్ట్ బుక్స్ గురించే చెప్పారు. టెక్స్ బుక్స్ ని తన విజయానికి సోపానంగా వాడుకున్నారు.
మూడో అంశం విశ్లేషణాశక్తి. ఇది చాలా ముఖ్యమయింది. ఇది మేధస్సుకు సంబంధించిన విషయం. ఇది బాగా చదవడం, పరిశీలించడం వల్ల అబ్బే విద్య. ప్రతివిషయానికి ఒక నేపథ్యం ఉంటుంది. ప్రతివిషయానికి భవిషత్తు పరిణామాలు ఉంటాయి. వీటిని విశ్లేషించగలిగే సామర్థ్యం అలవర్చుకోవాలి. ఇది అభ్యాసం నుంచి వస్తుంది. ఆర్టిస్టిక్ గా రాయడం కంటే విశ్లేషణాత్మకంగా రాయడం ప్రయోజనకరమని రఘువంశి విలువయిన సూచన చేశారు. ఇది క్లుప్తంగా చేసిన పరిచయం మాత్రమే. సివిల్స్ ఔత్సాహికులకు రఘువంశి చేస్తున్న సూచనలు ఆయన మాటల్లోనే వినండి.
సివిల్స్ రాసే వాళ్లకు పశ్చిమబెంగాల్ కు చెందిన తెలుగు ఐపిఎస్ అధికారి వై రఘువంశీ సూచనలు