అమ్మదేవతలయిన సమ్మక్క, సారక్కల మీద చిన్న జీయర్ స్వామీ చేసిన వ్యాఖ్యల పై తెలంగాణలో నిరసన మొదలయింది.
సమ్మక సారక్కలు ఎక్కడో అడవి దేవతలు, ఆకాశం నుంచి దిగిరాలేదు. అంతా ఈ దేవతల జాతర కు వెళ్లి ప్రాచుర్యం లోకి తెస్తున్నారు. అంతా వ్యాపారం అయిందని జీయర్ స్వామీ అన్నారు. దీని మీద తెలంగాణలో నిరసన మొదలయింది. ఈ ఆంధ్రా స్వామిని తెలంగాణ నుంచి పంపించేయాలని ఉస్మానియా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఆయనకు తెలంగాణలో అండ ఎవరో అందరికీ తెలిసిందే. స్వామీజీ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా చాలా బలవంతుడు. ఈ నిరసన ప్రభుత్వానికి చేరుతుందా?
మరిన్ని నిరసనలు
ఆంధ్ర చిన్న జీయర్ స్వామి మా తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలైన సమ్మక్క సారలమ్మ మీద ఎందుకు ఈ అహంకారపూరితమైన మాటలు మా తల్లులది వ్యాపారమా? మా దేవతల దర్శనానికి ఒక్క రూపాయి కూడా టికెట్ లేదు కానీ మీరు పెట్టిన 120 కిలోల బంగారం గల సమతా మూర్తి విగ్రహం చూస్తానికి మాత్రం 150 రూపాయలు pic.twitter.com/SB3O06HUg3
— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) March 16, 2022
“సారక్క,సమ్మక్క ఏమయిన దేవతలా? బ్రహ్మ లోకం నుంచి దిగివచ్చినరా?” అని శూద్ర-అతిశూద్ర-ఆదివాసి దేవతలను బ్రాహ్మణ చిన్న జీయర్ కించపరచిండు.
ప్రజలు విశ్వసించే తెలంగాణ దేవతలను అవమానించిన జీయర్ను టిఆర్ఎస్, బిజెపిలు ఎందుకు ఖండించడం లేదు?
తెలంగాణ మనోభావాలను పట్టించుకోని పార్టీలను నిలదీయాలి.
— Prof.S.Simhadri (@SimhadriProf) March 17, 2022
చిన జీయర్ గారూ, మీరు హద్దులు మీరి మాట్లాడుతున్నారు. సమతామూర్తి ఇలాగే కించపరుస్తూ మాట్లాడమని చెప్పిండ్రా? బహుజన ఆదివాసి వీర వనితలను, దేవతలను, మా ఆహారపు అలవాట్లను అడుగడుగునా అవమానిస్తున్నారు. మీరు ఒక్కసారి ముచ్చింతల్ వదలి మేడారంకు రండి మా సమ్మక్క-సారక్కల ప్రాశస్త్యం తెలుస్తది. pic.twitter.com/95u3gzzrBn
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) March 16, 2022