సిటీలో రెండు కొత్త రోడ్లు ప్రారంభం…

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (SRDP) కింద చేపట్టిన మరో రెండు కీలక ప్రాజెక్టులు పూర్తయ్యాయి.

ఎల్బీ నగర్ చౌరస్తాలో ₹40 కోట్లతో నిర్మించిన కుడి వైపు అండర్ పాస్ మరియు ₹29 కోట్లతో నిర్మించిన బైరామల్ గూడ ఎడమ వైపు ఫ్లైఓవర్ ను మంత్రులు  కేటీఆర్, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.

ఎల్ బినగర్ రోడ్డులో ఈ రోడ్డు ప్రారంభంతో  ఉప్పల్   ఎయిర్ పోర్ట్  మార్గంలో ట్రాఫిక్ సమస్య కొంతవరకు తగ్గుతుంది. దీనితో ఈ రోడ్డు మీద వేగంగా వెళ్లి తొందరగా గమ్యస్థానం చేరుకునేందుకు వీలవుతుంది. ఈమధ్య కాలంలో ఉప్ప ల్ – ఎల్ బినగర్ రోడ్డు కు అటు ఇటు కొత్త కాలనీలు రావడంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మేయర్ శ్రీమతి గద్వాల్ విజయ లక్ష్మీ, డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలత రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ ఎగ్గే మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *