సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లు కాంగ్రెస్ నాయకత్వం నుంచి తప్పుకోవాలని కొందరు సూచనలు చేస్తున్న నేపథ్యములో తెలంగాణ సీఎల్పీ వారి నాయకత్వానికి మద్దతు ప్రకటించింది.
దేశానికి, కాంగ్రెస్ పార్టీకి సోనియా, రాహుల్ నాయకత్వమే శ్రీరామరక్ష అని పేర్కొంది. ఈ రోజు
సీఎల్పీ సమావేశం జరిపి సోనియా గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ ఎమ్మెల్యేలు తీర్మానం చేశారు.
అనంతరం CLP నేత భట్టి విక్రమార్క విలేకరుల సమావేశంలో ఈ విషయం ప్రకటించారు.
వివరాలు
రాజ్యంగ స్పూర్తిని, దేశాన్ని రక్షించడం కోసం ఏఐసీసీ బాధ్యతలను యువనేత రాహుల్‌గాంధి స్వీకారించాలని సీఎల్పీ ఏకగ్రీవంగా తీర్మాణం చేసింది.
గాంధి, నెహ్రు కుటుంభం మాత్రమే కాంగ్రెస్ పార్టీని కాపాడుతుంది. వీరి నాయకత్వమే ఇప్పడు దేశానికి అవసరం ఉంది.
మత చాంధసవాదులు జాతిని విచ్ఛిన్నం చేసేందుకు దేశంలో పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్న నేపత్యంలో లౌకికవాదంతో దేశాన్ని, రాజ్యంగ స్పూర్తిని పరిరక్షించడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది.
దేశంలో అనేక రకాల విధ్వంస చర్యలు, మత పరమైన హింసలు జరుగుతున్న నేపత్యంలో దేశాన్ని కాపాడలంటే రాహుల్ పార్టీ పగ్గాలు చేపట్టాలని సీఎల్పీ ఏకాగ్రీవంగా తీర్మాణం చేసింది.
పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం. రాహుల్ గాంధి వెంటనే ఎఐసిసి బాధ్యతలు స్వీకరించాలని తెలంగాణ సీఎల్పీ గా కోరుతున్నాము.
ప్రధాని అవ్వ డానికి అవకాశం వచ్చిన ఏ పదవులు ఆశించకుండా రాహుల్ దేశం కోసం ఇంతకాలం పనిచేశారు.
కపిల్ సిబాల్ వంటి నాయకులు మేధావులుగా పనిచేసినప్పటికీ గాంధీ కుటుంబం కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడం వల్లే వాళ్ళు కేంద్ర మంత్రులయ్యారు. గాంధి కుటుంబం త్యాగలతో పదవులు అనుభవించి ఇప్పడు వారిపైన విమర్శలు చేయడం సరికాదు.
పంజాబ్ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో ఉండవు, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.
\
1970లో కాంగ్రెస్ అధికారం కోల్పోయి 1980లో తిరిగి పూర్వవైభవం సంతరించుకున్నట్టు 2023లో దేశంలో కాంగ్రెస్ హావా వస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల్లో పీసీసీ అధ్యక్షులను రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి ఇచ్చిన ఆదేశాలను ఆహ్వనిస్తున్నాము.
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బలంగా వుంది. 2023-24 లో రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.
ప్రెస్‌మీట్ లో ఎమ్మేల్యేలు శ్రీధర్‌బాబు, జయప్రకాశ్‌రెడ్డి( జగ్గారెడ్డి) సీతక్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలు ఉన్నారు.