చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్ దాయాది

చైనాలో 3 కోట్ల మంది లాక్‌డౌన్‌ లో ఉంటున్నట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. దీనికి కారణం ఇపుడు చైనా లో వేగంగా వ్యాపిస్తున్న కొత్త రకం వైరస్.  దీనిని  స్టెల్త్ ఒమిక్రాన్ అని పిలస్తున్నారు.  దీనిని శాస్త్రవేత్తలు BA 2 అంటున్నారు.  ఇపుడు ప్రపంచం మంతా కోవిడ్ కారణమయిన ఒమిక్రాన్ వైరస్ BA 1. పేర్లు ఒకలాగేఉన్నా బిఎ 2 అనేది బిఎ 1 నుంచి పుట్టింది కాదు. బిఎ వన్ లో మ్యూటేషన్ జరిగి వచ్చింది. కాదు. ఇది ఒరిజినల్ ఒమిక్రాన్ కు దాయాది. అంటే ఈ రెండింటికి మాతృక ఒకటే నని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్ని యూరోప్ , ఏసియా దేశాలలో ఇది బిఎ 1 ను అధిగమించే పరిస్థితికనబడుతూఉంది. భారతదేశంలో కూడా అక్కడడక్కడా కనిపిస్తూ ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతూ ఉంది.

ఇపుడు ప్రపంచంలోని  కోవిడ్ కేసులలో బిఎ 1 వాటా 98.8 శాతం. ఇది వైరస్ వ్యాప్తిని పసిగట్టే అంతర్జాతీయ సంస్థ  జనవరి 15న GISAID లెక్క. అయితే మెల్లిమెల్లిగా అనేక దేశాల నుంచి బిఎ 2 వార్తలు వస్తున్నాయిని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నది. మరికొన్ని ఒమిక్రాన్ వారసులను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. వాటిపేర్తు  BA.1.1 .529,  BA .3 .  ఈ రెండు రకాలు ముందు ముందు ఎలా ప్రవర్తిస్తాయో నని ప్రపంచ వ్యాపితంగా అనేక దేశాలు ఆత్రంగా గమనిస్తున్నాయి.

అమెరికా కు చెందిన  ఫ్రెడ్ హచిన్సన్ క్యాన్సర్ సెంటర్ చెందిన నిపుణుడు ట్రెవర్ బెడ్ ఫోర్డ్  బిఎ 2 కదలికలను గమినిస్తూ వస్తున్నారు. ఆయన దీనికి సంబంధించిన విలువయిన సమాచరం రోజూ ట్వీట్ చేస్తున్నారు.   డెన్మార్క్ కోవిడ్  కేేసులలో  బిఎ 2 కేసులు 82 శాతం ఉన్నాయి. ఇంగ్లండులో  9 శాతం, అమెరికా 8 శాతం ఉన్నాయి ఇవి పెరిగే అవకాశం బాగా ఉందని ఆయన హెచ్చరించారు కూడా.

 

 

 

బిఎ 1, బిఎ 2 జన్యు సీక్వెన్సీ లలో ఉంటుంది. దీని వల్ల  ఇమ్యూనిటీ తప్పించుకునే శక్తి దీనికి ఎక్కువయింది. బిఎ 1 కంటే బిఎ 2 కు కనీసం 33 శాతం  ఈ శక్తి ఎక్కువ గా ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇమ్యూనిటీనికి  తప్పించుకునేశక్తి ఎక్కువగా ఉన్నందునే దీనిని  స్టెల్త్ ఒమిక్రాన్ అని పిలుస్తున్నారు.

 

ఇక చైనా విషయానికి వస్తే, గతంలో వూహాన్ కోవిడ్ సెంటర్ అయినట్లు ఈ సారి ఈశాన్య చైనాలోని జిలిన్ ప్రావిన్స్ కోవిడ్ ఎపిసెంటర్ అయిందని సౌత్ చౌనా మార్నింగ్ పోస్టు రాసింది. ఇక్కడ బయటపెడిన సంప్టమాటిక్ కేసులలో 60 శాతం  స్టెల్త్ వేరస్ వే.

మొత్తంగా 13 నగరాల్లో  ఇపుడు చైనా ప్రభుత్వం  కఠిన కోవిడ్  ఆంక్షలు విధించింది బిఎ 2 వైరస్ వేగంగా విస్తరిస్తూ ఉండటమే. అయితే చైనాలో ఇంకా మరణాలు మొదలు కాలేదు. అందుకే  పరిస్థితి విషమించకుండా చైనా కఠిన చర్యలు తీసుకుంటూ ఉంది.  రెండేళ్ల తర్వాత తొలిసారి.  చైనాలో మంగళవారం అత్యధికంగా 5,280 కొత్త కేసులు నమోదయ్యాయి.   వరుసగా ఆరో రోజు వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి .  చైనాలో 2020 ఫిబ్రవరి 12న అత్యధికంగా దాదాపు 15 వేల కేసులు బయటపడ్డాయి . ఆ తర్వాత  మంగళవారం నాడు  5,100 ల కంటే ఎక్కువ కేసులు  నమోదయ్యానట్లు సిఎన్ ఎన్ (CNN) రాసింది. 5100 విశేషం ఏమిటంటే 2020 ఫిబ్రవరిలో వూహన్ లో నమోదయిన కేసులు . అంటే స్పష్టంగా ఇపుడు 2020  సంక్షోభం కంటే  ఎక్కువ కేసులు వస్తున్నాయనేది ఆందోళక రమయిన విషయం.

ఒక్కసారిగా కేసులు పెరుగుతుండటంతో చైనా 13 పెద్ద నగరాలను లాక్ డౌన్ లోకి తీసుకువచ్చింది. చాలామేరకు పరిశ్రమలు మూతపడ్డాయి. వాణాను నిలిపివేశారు. బీజింగ్‌లోనూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ నగరంతో పాటు, షాంఘైకి రాకపోకలు సాగించే విమానాలను రద్దు చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *