* తెలంగాణలో కరీంనగర్ మాడల్ సిటీ కాబోతుంది. . అందమైన లోయర్ మానేరు డాం నెలవైన ఉమ్మడి జిల్లా ఒకప్పుడు దక్షిణ కాశీ వంటి రాజన్న ఆలయం, కాళేశ్వరం, కోల్ బెల్ట్ ఇలా ఎన్నో హంగులతో కూడి ఉండేది.
జిల్లాల పునర్విభజన తర్వాత మళ్లీ ఆ పూర్వ వైభవానికి అభివ్రుద్ది చేస్తున్నారు. మానేరు రివర్ ప్రంట్తో పర్యాటక రాజదానిగా, మెడికల్ కాలేజీతో , వైద్య హబ్ గా అత్యద్భుత భవనంతో బీసీ స్టడీ సర్కిల్, ఐటీ విస్తరణతో టెక్ సిటీగా, రేకుర్తి, టీటీడీ ఆలయాలతో పుణ్యతీర్థంగా కరీంనగర్ని సర్వహంగులతో రూపుదిద్దుతున్నారు.
ఈ మేరకు గురువారం రోజున రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మానేరు రివర్ ఫ్రంట్ పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు.
నాలుగు వందల కోట్ల పైచీలుకు రూపాయలతో రూపుదిద్దుకోనున్న మానేరు రివర్‌ఫ్రంట్ మొదటి దశ పనులకు అధికార యంత్రాంగం సర్వం సిద్దం చేసింది. ఇప్పటికే రూ. 148 కోట్ల వ్యయంతో తీగల వంతెన నిర్మాణపనులు పూర్తయ్యాయి. డిజిటల్ లైటింగ్అనుసంధాన రహదారులు పనుల కోసం మరో రూ. 76 కోట్లు వెచ్చించనున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో కరీంనగర్ లో పర్యటించిన సందర్భంగా దిగువ మానేరు సుందరీకరణపై ప్రకటన చేసారు.
దానికి ఆచరణరూపం ఇచ్చేందుకు దాదాపు రూ.650 కోట్లతోవివిధపనులకునిధులతో పనులు జరుగుతున్నాయి. ఆ క్రమంలోనే తీగల వంతెన మానేరు రివర్ ఫ్రంట్లు వచ్చాయి.
సివిల్, టూరిజం డిపార్మెంట్లు చేసే పలు డిజైన్లతో కూడిన ఫౌంటెయిన్లు, నాలుగు నుంచి ఆరు వరకు పడవలు లేజర్ షో, నైట్ గార్డెన్, వాటర్ క్లాక్, థీమ్ వర్క్,వాటర్ స్పోర్ట్స్, డిజిటల్ లైటింగ్ సిస్టమ్, మ్యూజికల్ ఫౌంటెయిన్లు హోటళ్లు నిర్మిస్తారు.
అత్యంత.సుందరంగా పర్యాటకులను ఆకట్టుకునేలా నిర్మించబోతున్నారు. 10 కిలో మీటర్ల పొడవునా నీరు నిలిచి ఉండే విదంగా సరికొత తరహాలోచెక్ డ్యామ్, నాలుగు గేట్లతో బ్యారేజిని నిర్మిస్తారు.ఇరువైపులా గోడలు, మెట్లు కూడా నిర్మిస్తారు.ఆహ్లాదం కలిగించేలా పచ్చదనం పెంచుతారు. ఇరవై నాలుగు నెలల్లోనే ఇదంతా సాకారం కాబోతుంది.