ఆంధ్రాలో జాబ్స్ లేవు, జాబ్స్ కేలండర్ లేదు, అంతా జగన్మాయ. నియామకాలకు జాబ్ క్యాలెండర్ ఇస్తానున్న హామీని గాలికి వదిలేసారంటూ ముఖ్యమంత్రి జగన్ కు బీజేపీ సోము వీర్రాజు అగ్రహ లేఖ
-సోము వీర్రాజు
నిరుద్యోగ యువతకు అవకాశలు కల్పిస్తాన్న ప్రభుత్వం నిరుద్యోగులకు నిద్రలేని రాత్రులను మిగులుస్తోంది. జాబ్ క్యాలండర్ ను ప్రతి జనవరి లోప్రకటిస్తానని ఇచ్చిన హామీ ఏమైందని సూటిగా ప్రశ్నిస్తున్నాను .వైసిపి ప్రభుత్వం హామీని నమ్మిన నిరుద్యోగ యువత కోచింగ్ సెంటర్లలో రాత్రింబవళ్లు శిక్షణ తీసుకుంటూ, అప్పులు చేసి మరి ఫీజు కడుతున్నారు. నోటిఫికేషన్ జాడ ఉంటుందో లేదో తెలియదు గాని వైసిపి ప్రభుత్వం ఇచ్చిన హామి ఒకరోజు కాకపోతే మరొక రోజుయినా నేరవేరుతుందన్న ఆశతో డిగ్రీ పట్టాను చేతితో పట్టుకొని కోచింగ్ సెంటర్లో కాలం వెళ్లదీస్తున్నారు.
వివిధ ప్రభుత్వశాఖల్లో సుమారుగా 3 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నప్పటికీ,.ప్రభుత్వ నియమకాలు జరపకుండా మీరు అధికారంలో వచ్చినప్పటి నుండి నేటి వరకు కాలం వెళ్లదీస్తూనే ఉన్నారు!
ఇరిగేషన్ వ్యవస్థలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకపోవటంవల్ల త్రాగునీటి ప్రాజెక్టు అన్నీ నత్తనడకన జరుగుతున్నాయి. మరొక వైపు, 3 వేలకు పైగా లస్కర్ పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల రైతులకు సకాలంలో త్రాగునీరు అందటంలేదు. రెవెన్యూశాఖలో ఖాళీగా వున్న పోస్టులు భర్తీ చేయకపోటం వల్ల పౌరసంబంధ సేవలు ప్రజలకు అందటంలేదు. సమాచార శాఖలో ఉద్యోగ నియమకాలు జరపకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో ఆయా శాఖాలో పారదర్శకత లోపిస్తోంది. వ్యవసాయశాఖలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా ఎందుకు కాలయపన చేస్తున్నారు? ఎపి ట్రాన్స్‌కో, జెన్కో వంటి సంస్థల్లో డిగ్రీ పట్టా ఉన్న యువతకు అవకాశం కల్పించే విధంగా నిబంధనలను సరళీకృతం ఎందుకు చేయటం లేదు?
ఇప్పటికే డిగ్రీ పట్టా సాధించినవారు కోట్ల సంఖ్యలో చేరుతున్న అర్హత వున్నప్పటికీ ప్రభుత్వం ఉపాధి కల్పించటంలో, ఉద్యోగ అవకాశాలు కల్పించటంలోను ఆలసత్వం వహించటం వలన యువత తీవ్ర నిరాశతో ఉన్నారు. జాబ్ క్యాలండర్ క్రియాశీలకంగా అమలుపరిచి వుంటే యువతకు సకాలంలో ఇప్పటికే ఉద్యోగాలు వచ్చేవి.
ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవటం వల్ల,.కాలపరిమితి వల్ల ఉద్యోగార్ద్ధులైన యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెగా డిఎస్సీ తెస్తారని బిఎడ్ చేసిన విద్యార్థులు నోటిఫికేషన్ కోసం కళ్ళుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. పోలీస్ రిక్రూట్మెంట్ చేయని కారణంగా శాంతి-భద్రతలు కాపాడే పోలీస్ శాఖ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. పౌరరక్షణలో పోలీసు వర్గాలు ఒక ఉన్నత పాత్ర వహిస్తాయి. అయితే ఉన్న ఖాళీలు భర్తీ చేయకపోతే శాంతి భద్రతలను ఆ శాఖ నిర్వహించలేని ని ర్వీర్యదశకు చేరుతుంది. ఇప్పటికే, ఎపి ట్రాన్స్‌కో, ఎపి జెన్కో ఉద్యోగ అవకాశాల కోసం ఇంజనీరింగ్ పట్టాలు పోందిన పలు ఉద్యోగార్ధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పదోన్నతులు ద్వారా కాకుండా నూతన రిక్రూట్ మెంట్ ద్వారా విద్యుత్ శాఖ లో నియామకాలు జరపాలని నిరిద్యోగులు చేసుకున్న విన్నపాలు పై మీ వైఖరి స్పష్టం చేయాలి
నిబంధనలననుసరించి, తాజాగా గ్రాడ్యుయేట్లకు అవకాశాలు కల్పించాలని ఈ లేఖ ద్వారా డిమాండ్ చేస్తున్నాను.
అదే విధంగా సోషల్ వెల్పేర్ డిపార్ట్మెంట్లో చాలా ఖాళీలు ఏర్పడ్డాయి. దాదాపుగా ముఖ్యమైన ప్రభుత్వ శాఖల్లో అవుట్ సోర్సింగ్ వ్యవస్థపై ఆధారపడే పరిస్థితులను ప్రభుత్వం పరోక్షంగా కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. జాబ్ క్యాలెండర్ ఇస్తానున్న హామీని గాలికి వదిలేసి,.నిరుద్యోగలను తీవ్ర నిరాశపరుస్తోన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ లేఖ ద్వారా ప్రశ్నిస్తున్నాను.
జాబ్ క్యాలెండర్ ప్రకటన లకే పరిమితం చేశారు నాప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి
రాష్ట్ర ప్రభుత్వం జూన్ లో విడుదల చేసిన ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ లో గ్రూప్ 1,2 కలిపి కేవలం 36 పోస్ట్ పేర్కొన్నారు. వేలల్లో ఖాళీగా ఉన్న వాటిని పేర్కొనలేదు. గ్రూప్ 3,4 పోస్టులు ప్రస్తావన అసలే లేదు, పోలీస్ శాఖకు సంబంధించి 400 పోస్ట్‌లకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశారు.
•గ్రూప్ -1 ఖాళీ పోస్టులు 93 ఉండగా క్యాలెండర్ లో కేవలం 16 పోస్ట్ లే చూపించారు. •గ్రూపు-2 లో 814 ఖాళీల భర్తీకి అవకాశం ఉంది కానీ 20 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
•రెవెన్యూ డిపార్ట్మెంట్ లో 1148 పోస్టులు ఖాళీ ఉన్నాయి వీటిని భర్తీ చేయాలని ఆ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. ఇందులో 17 డిప్యూటీ కలెక్టర్ (గ్రూప్-1), 67 డిప్యూటీ తాసిల్దార్ (గ్రూప్-2) పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటిని అత్యంత ప్రాధాన్యత భావించాలని రెవెన్యూ శాఖ కోరింది కానీ 84 పోస్టులలో ఏడు మాత్రమే జాబ్ క్యాలెండర్ లో చూపించారు.
•339 గ్రూప్-3 పోస్టులు, గ్రూప్-4 లో 639 గ్రూప్-4 పోస్టులు దాచేశారు. •ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే 768 ఇంజనీరింగ్ సర్వీసెస్ పోస్టులు ఖాళీగా ఉండగా ఒకటీ క్యాలెండర్లో చూపించలేదు అని వాటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశంలో ఈ రాష్ట్రంలో 2.30 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. ఈ రెండున్నర సంవత్సరాల్లో కేవలం సచివాలయ పోస్టులు మరియు వాలంటీర్లు మాత్రమే నియమించారు.
కరోనా సమయంలో మాత్రమే వైద్యరంగంలో తాత్కాలిక నియామకాలు జరిపింది మినహా ఇతర నియామకాలు జరగలేదు. అలాగే పాదయాత్ర చేస్తున్న సమయంలో ప్రతి సంవత్సరం జనవరి 1న నూతన జాబ్ క్యాలెండర్ ని విడుదల చేస్తానన్నారు. 2022 జనవరి 1న నూతన జాబ్ క్యాలెండర్ ను ఖచ్చితంగా విడుదల చేయాలి
జాబ్ క్యాలెండర్లో టీచర్ పోస్టులు 25వేలు, కానిస్టేబుల్ పోస్టులు 16వేలు, లైబ్రరీసైన్స్ 6 వేల పోస్టులు, సచివాలయంలో 8 వేల పోస్టులు, విశ్వవిద్యాలయాల్లో టీచింగ్ & నాన్ టీచింగ్ స్టాఫ్ ను, అలాగే రాష్ట్రప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేసే లాగా జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని ఈ లేఖ ద్వారా డిమాండ్ చేస్తున్నాను .
గ్రూప్ ఒన్ 93పోస్టులు ,గ్రూప్2.పోస్టులు 814,రెవెన్యూ లో 1148 ,ఎపిపిఎస్ ద్వారా 768 ఇంజనీరింగ్ సర్వీసెస్ పోస్ట్ లు గ్రూప్ 3పోస్ట్ లు 339,గ్రూప్4పోస్ట్ లు 639 ఎప్పుడు తీస్తారో ప్రకటించాలని బహిరంగ లేదా ద్వారా డిమాండ్ చేస్తున్నాను.
(*శ్రీ సోమువీర్రాజు,అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ
ఆంధ్రప్రదేశ్)