అమరావతి : జంగారెడ్డిగూడెం కల్తీ సారా మరణాలు ఏపీ అసెంబ్లీని కుదిపేస్తున్నాయి. ఈ మరణాలు ప్రభుత్వా హత్యలంటూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభలోపల, సభ వెలపల ఆందోళన చేస్తూ ఉంది. బుధవారం నాడు కూడా అసెంబ్లీలో ఆందోళన చేపట్టింది. జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రత్యేక చర్చచేపట్టాలని తెలుగుదేశంపార్టీ డిమాండ్ చేస్తున్నది. చర్చు అంగీకిరంచాలని టీడీపీ ఎమ్మెల్యే పట్టుపడటంతో సభ కార్యకలాపాలు స్తంభించాయి. దీని తో 10 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.
ఉదయం సభ మొదలైనప్పటి నుంచి టీడీపీ సభ్యులు తమ నిరసనన కొనసాగించారు. సభను అడ్డ కోవండం పట్ల స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత ఆయన సభను 15నిమిషాల పాటు వాయిదా వేశారు….
వాయిదా అనంతరం కూడా టీడీపీ సభ్యులు చర్చకు అంగీకరించాలని ఆందోళన కొనసాగించారు. అదే సీన్ రిపీట్ ఈ సారి 10 మంది టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన రూలింగ్ ఇచ్చారు. సస్పెండయిన ఎమ్మెల్యేలు వీరే: ఎమ్మెల్యేలు అశోక్ బెందాలం, భవాని ఆదిరెడ్డి, చినరాజప్ప, జోగేశ్వరరావు, గద్దే రామ్మెహన్, రామకృష్ణబాబు, ఏలూరి సంభశివరావు, మంతెన రామరాజు, గోట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ సభ