భవిష్యత్తు తరాల కోసం ఏర్పడిన ఎన్టర్ప్రైజ్ మైండ్స్ ఇన్ కార్పరేటెడ్ బ్రాంచి సోమవారం తిరుపతిలో ప్రారంభమైంది. ఈ కంపెనీ బ్రాంచి ఇప్పుడు తిరుపతిలో కూడా ప్రారంభం కావడం వల్ల స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. మరికొన్నేళ్ళలో 500 మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలనే ధ్యేయంతో ఇది పనిచేస్తోంది. ఫలితంగా స్థానికులు ప్రపంచ స్థాయి నిపుణులతో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది.
అమెరికా సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్నత స్థానానికిచేరుకున్న తిరుపతికి చెందిన ముండ్లపూడి భరత్ సీఈవోగా 2017లో అమెరికాలో ఈ కంపెనీ ఏర్పడింది. మరికొందరు సాఫ్ట్వేర్ నిపుణులతో కలిసి ఏర్పాటు చేసిన ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలో ఉన్న శాన్రామొన్లో ఉంది.ఈ సాఫ్ట్వేర్రంగనిపుణులు తమ మూలాలను వెతుక్కుంటూ తిరుపతిలో ఏర్పాటు చేసిన ఎన్టర్ప్రైజ్ మైండ్స్, ఐఎన్‌సీ తిరుపతి బ్రాంచిని రాయలసీమ అధ్యయనాలసంస్థ అధ్యక్షుడు భూమన్ సోమవారం ఉదయం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చాన్స్‌లర్ ఆచార్య పి. కుసుమకుమారి, శ్రీసిటీ జీఎం. పి. రామచంద్రా రెడ్డి, డాక్టర్ మాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇది డిజిటల్ టెక్నాలజీ, డేటా, క్లౌడ్, అల్గోరిథమ్స్, AI/ML లలో మంచిఫలితాలను సాధించడానికి ఏర్పడింది. దీంతో పాటు అన్నిఇంజినీరింగ్ ఉత్పత్తులు, వాస్తునిర్మాణ , యాజమాన్యసేవలను డిజైన్ చేసి, అభివృద్ధి, పరీక్ష, విస్తరణ, సహాయం ద్వారా అందివ్వనుంది. చిన్న యాంత్రికీకరణతోపాటు, వాటి ఉన్నతీకరణకు కూడా పనిచేస్తుంది. ఆర్థిక సేవలకు, సీపీజీ, రిటైల్‌కు, సాఫ్ట్వేర్, హై టెక్, వ్యాపార సమాచారానికి మీడియాకు, జీవ శాస్త్రాలకు, ఆరోగ్య పరిరక్షణకు, ఇతర పరిశ్రమలకు కూడా సేవలందిస్తుంది.