-డేవిడ్ గోల్డ్‌మాన్
అనువాదం : రాఘవ శర్మ
“ఉక్రెయిన్ సంక్షోభ నివారణకు ఉన్నత స్థాయి దౌత్యం నిర్వహించి శాంతి స్థాపక దేశంగా చైనా మధ్యవర్తిత్వం నెరపాలి.”
ఫ్రాన్స్ అధినేత మాక్రోన్, జర్మన్ ఛాన్స్‌లర్ ఓలాఫ్ సోహాల్జ్, చైనా అధ్యక్షుడు షి జింపింగ్ ఈనెల 8వ తేదీన జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ ప్రతిపాదన వచ్చింది.
ఒక వారం క్రితమైతే ఈ ప్రతిపాదన ఊహకు కూడా అందనిది.
గడచిన దశాబ్దంలో దక్షిణ చైనా సముద్రంలో భౌగోళిక ఆకాంక్ష, హాంకాంగ్ లో జోక్యం, భారత దేశంతో సరిహద్దు ఘర్షణలతో చైనా దౌత్యపరంగా ఒంటరిగా మిగిలింది.
కానీ, ఉక్రెయిన్ సంక్షోభనివారణకు దౌత్యంతో శాంతి దూతగా దేశంగా చైనా గుర్తింపు పొందడానికి ఒక మంచి అవకాశం లభించింది.
అమెరికా దుందుడుకు తనం , రష్యా అతిగా వ్యవహరించడం వంటి ఒక విషాద స్థితిలో ప్రపంచానికి ఒక దౌత్య విప్లవం తీసుకు రావాల్సిన అవసరం ఏర్పడింది. ఉక్రెయిన్ లో రష్యా సరిహద్దుల వరకు నాటోను విస్తరించి రష్యాని చుట్టుముట్టాలన్నది అమెరికా ఎత్తుగడ. అది బెడిసి కొట్టింది.
ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌లో యుద్ధాన్ని ముగించడం కోసం చేసుకున్న మిన్స్క్ 2 (Minsk 2) ఒప్పందాన్ని ఉల్లంఘించడం ద్వారా ఉక్రెయిన్ అమెరికా చంకలో పిల్లిలా తయారైంది. మిన్ స్కు బెలారషియన్ రాజధాని . 2014 తర్వాత యుక్రెయిన్, తిరుగుబాటుచేస్తున్న రిపబ్లిక్ లకు మధ్య నడుస్తున్న యుద్ధాన్ని నివారించేందుకు కూడా జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు ముందుకు వచ్చాయి. యుద్దం చేస్తున్న ఇరువర్గాలను మిన్ స్కు లో సమావేశపరిచి యుద్దవిరమణకు ఒక అంగీకారం కుదిరించాయి (2015). ఇదే మిన్ స్కు 2 ఒప్పందం.
జర్మనీ, ఫ్రాన్స్ లు అమె రికాకు వ్యతిరేకంగా ఆ ఒప్పందానికి కట్టుబడి ఉండలేకపోయాయి. యూరప్ చేసిన తప్పులను వెనక్కు తీసుకోలేకపోవడమే మొదటి ప్రపపంచ యుద్ధానికి దారితీసిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మిన్స్ స్కు ఇపుడు జర్మనీ ఫ్రాన్స్ లు యుద్ధం ప్రభావం యూరో ప్ మీద తీవ్రంగా ఉంటాయని భావించాయోమే యుద్ధ విమరణ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి. వాటికి తక్షణ కనిపించిన దేశం చైనా. ఇలా చైనా మధ్యవర్తిత్వం నెరిపేందుకు ఒక అవకాశం వచ్చింది.
ఎందుకంటే ఈ సంక్షోభం రావడానికి దారి తీసిన పొరపాట్లతో చైనా కు సంబంధం లేదు. దానికి ఇద్దరు పరస్పర విరోధులతో సత్పంబంధాలు, యూరప్ దేశాలతో కలసి పనిచేసే సంబంధాలున్నాయి.
తురుపుముక్క ఇక పనికి రాదు, బహుశా అది అమెరికా కావచ్చు.
ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి డ్మిట్రో కులెబ, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈతో మార్చి 1వ తేదీన మాట్లాడుతూ యుద్ధనివారణకు మధ్యవర్తిత్వం వహించాలని కోరారు.
ఎందుకంటే ఈ విషయంలో చైనా ఒక నిర్మాణాత్మక పాత్రను నిర్వహించింది కనుక, సత్సంబంధాలకు ఉక్రెయిన్ చైనా వైపు అడుగులు వేయడానికి సిద్ధంగా ఉంది కనుక.
యుద్ధ విరమణకు చైనా మధ్యవర్తిత్వం వహించాలని ఆయన భావిస్తున్నారు.
చైనా మధ్యవర్తిత్వం వహించాలనే ఆలోచన యూరప్‌లో పెరుగుతోంది.
రష్యాకు వ్యూహాత్మక భాగస్వామిగా, ఉక్రెయిన్‌కు వ్యాపార భాగస్వామిగా ఒక ప్రపంచశక్తిగా ఉన్న చైనా మాత్రమే ఘర్షణపడుతున్న ఇరు దేశాలతో సత్సబంధాలు కలిగి ఉంది.
“పుతిన్‌ను చైనా ఎప్పుడు ఆపుతుంది?” అని ప్రశ్నిస్తూ, ఉక్రెయిన్‌తో చైనాకు మంచి సంబంధాలున్నాయని మార్చి 8వ తేదీన జర్మనీలోని వామపక్షేతర డై వెల్ట్ అనే వార్తాపత్రికలో ఎడూర్డ్ స్టీనర్ విశ్లేషించారు.
అమెరికా దౌత్యం పక్కకు ఒరిగిపోయింది.
ఉక్రెయిన్‌లో రష్యాను ఓడించడానికి , రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి ఉక్రెయిన్ రక్షణ దళాలకు అత్యున్నతమైన ఆయుధాలను అమెరికా సరఫరా చేసింది. అణు నిషేధాన్ని విధించడమేకాకుండా, 630 బిలియన్ డాలర్ల రష్యా విదేశీ మారక నిల్వలను నిలుపుదల చేసింది. ప్రచ్ఛన్నయుద్ధకాలంలో సోవియట్ యూనియన్ పైన అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలను ఇవి మించిపోయాయి.
ఇది శాంతియుతకాలపు స్థితి కాదు. అమెరికా తీసుకునే వైఖరిఎటూ తీసుకెళ్ళదు.
శిక్షించేలా ఉన్న కఠినమైన నిషేధాలు, ఆయుధ విధానాలు రష్యా ధ్యేయాన్ని దెబ్బతీయలేకపోతే, ఉద్రిక్తత కొనసాగుతుంది.
అమెరికా స్పందిస్తున్న తీరు యూరప్ దృష్టిలో పూర్తిగా మోసపూరితమయినది గా కనిపిస్తూ ఉంది.
రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపి వేస్తూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించాడు. యూరప్ అమెరికా మాట వినలేదు. యూరోప్ కు రష్యా హైడ్రోకార్బన్ అమ్మడాన్ని నిషేధించలేమని జర్మన్ ఛాన్స్‌లర్ సోహాల్జ్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మార్చి 7వ తేదీన ప్రకటించారు. జోబైడెన్ చర్యల వల్ల అమెరికాలో పెట్రోల్ ధర బ్యారల్‌కు 8 డాలర్ల వరకు పెరిగిపోయింది. అంటే 8 శాతం పెరిగింది. యూరప్‌లో ఇప్పటికే పదిరెట్లు చెల్లిస్తున్నారు.
ఉక్రెయిన్ లో యుద్ధ నివారణకు మధ్యవర్తిత్వం నెరపమని జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు కోరడాన్ని తాను స్వాగతిస్తున్నట్టు జర్మనీ, ఫ్రాన్స్ దేశాధినేతలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో చైనా అధినేత షి జింగ్‌పింగ్ చెప్పారు.
ఆ రెండు దేశాలతో పాటుయూరప్‌తో కూడా సంబంధాలు కొనసాగిస్తామని, అందరి అవసరాలకు అనుగుణంగా అంతర్జాతీయంగా కీలకంగా వ్యవహరిస్తామని తెలిపారు.
ఈ విషయాన్ని చైనాకు చెందిన guanvha.cn లనే వెబ్‌సైట్లో వచ్చింది.
రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలకు తాము సంయుక్తంగా మద్దతు ఇస్తామని, ఇరువురి పరిస్థితులను అదుపు చేయడానికి సహాయం చేస్తామని, సంప్రదింపులు జరిపి, ఇబ్బందులను అధిగమించడానికి, శాంతి స్థాపనకు చర్యలను కొనసాగిస్తామని షి జింగ్‌పింగ్ స్పష్టం చేశారు.
అతిపెద్ద మానవ సంక్షోభాన్ని ఆపడానికి సాధ్యమైనంత ఎక్కవసంయమనం పాటించాలని ఆయన కోరారు.
ఈ సంక్షోభ వ్యతిరేక ఫలితాల ప్రభావం పడకుండా ఉండడానికి కలసి పనిచేస్తాం అన్నారు.
ఇప్పుడు విధించిన నిషేధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, రవాణా, ఇంధన, సరఫరా రంగాల పైన ప్రభావం పడి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని హెచ్చరించారు.
ప్రయోజనాల కోసం వారి తరపున వ్యవహరించే జర్మనీ, ప్రాన్స్‌లకు తాము మద్దతు ఇస్తామని తెలిపారు.
యూరప్ దేశాలతో, రష్యాతో, అమెరికాతో, నాటో దేశాల మధ్య చర్చలు జరగం పట్ల చైనా సంతోషాన్ని వెలిబుచ్చింది.
వీటి మధ్య సంబంధాలను నెరపడం వెనుక అసలు కారణం ఏమిటి?
యూరప్‌కు చైనా నూతన వంతెన నిర్మాణంకోసం రష్యాతోను, ఉక్రెయిన్‌తోను చైనా సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకున్నదనేది ఒక వాస్తవం.
చైనా 2017లో చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్డు నిర్మాణానికి సంతకంచేసిన మొదటి దేశం ఉక్రెయిన్.
చైనా మదుపు దారులు ఉక్రెయిన్‌లో ఏడాదికి రెండు బిలియన్ డాలర్లను పెట్టుబడి పెడుతున్నారు.
ఉక్రెయిన్ నుంచి చైనా దిగుమతులు 2019లో 4 బిలియన్ డాలర్లుండగా, 2010 నాటికి అవి రెంట్టింపై,8 బిలియన్ డాలర్లకు పెరిగింది.
రష్యాని అభిశంసిస్తూ గత వారం జరిగిన ఐక్యరాజ్య సమితి భద్రతా కౌన్సిల్ సమావేశంలో పుతిన్‌కు వ్యతిరేకంగా విజయం సాధించినట్టు పశ్చిమ దేశాల దౌత్యవర్గాల లో ఒక ప్రచారం జరిగింది.
ఈసమావేశానికి చైనా గైర్హాజరవడం ఆశ్చర్యపరచిందని జర్మనీపత్రిక డైవెల్ట్ రాసింది.
తూర్పు, పశ్చిమదేశాల మధ్య ఉక్రెయిన్ అనుసంధాన వంతెనలా ఉండాలే కానీ, రెండు శక్తుల మధ్యవైరానికి పావులా ముందుండకూడదని ఐక్యరాజ్యసమితిలో చైనా ప్రతినిధి జాన్ జుగ్స్ చేసిన ప్రకటనను ఆపత్రిక ఉటంకించింది.
అసలు వాస్తవం ఏమిటంటే, రష్యా, యూరప్ మధ్య జరిగే ప్రతి ఘర్షణను చైనా లాభదాయకంగా మార్చుకుందని డై వెల్ట్రా (Die Welt)సింది.
అంతే కాకుండా రష్యాతో విదేశీ వ్యాపారం 2013-2020 మధ్య 13.5 శాతం నుంచి 16 శాతానికి పెంచుకుంది.
ముడిసరుకులు, ముఖ్యంగా పెట్రోల్ , గ్యాస్ వంటి వాటిధరలు పెరిగాయి.
చైనానుంచి యూరప్‌కు వెళ్ళాల్సిన రైళ్ళు రష్యా మీదుగా వెళ్ళాలి.
యుద్ధం వల్ల సరుకులను చైనాలోనే రైళ్ళకు ఎక్కించడం లేదు.
చైనా మధ్యవర్తిత్వం అనేది యూరప్‌కు అనివార్యమైంది.
మిన్స్క్ 2 ఒప్పందానికి రాజీపడాలనే ఆలోచన తప్పడం లేదు.
రష్యా చొరవ తీసుకున్న ఈ ఒప్పందానికి జర్మనీ, ఫ్రాన్స్ మద్దతు తెలుపగా అమెరికా తిరస్కరించింది.
నాటో కూటమిలో చేరాలన్న ఆలోచనను ఉక్రెయిన్ విడిచిపెట్టి, రష్యాకు ఆనుకుని ఉన్న రుస్సోఫోన్‌డొనెట్స్, లుహాన్స్ ప్రాంతాలకు పరిమితమైన స్వాతంత్ర్యం ఇవ్వడానికి అంగీకరించాలి.
క్రిమియా రష్యాకే ఉండాలి.
తగిన పునర్నిర్మాణానికి చైనా నుంచి,యూరప్ దేశాల నుంచి సహాయం అవసరం.
రష్యా పైన యూరప్ విధించిన ఆంక్షలను ఎత్తివేయాలి.
ఉక్రెయిన్, రష్యా రాజీపడడంలో దాతృత్వాన్ని, ఉదాత్తతను ప్రదర్శించడం ద్వారా విజయాన్ని సాధించాలి.
(ఇది ఏసియా టైమ్స్ ( Asiatimes)లో Could China Mediate the Unkraine War? శీర్షికతో వచ్చిన వ్యాసానికి అనువాదం)
(ఆలూరు రాఘవశర్మ సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)