కెసిఆర్ కు జీవన్ రెడ్డి 10 ప్రశ్నలు

కెసిఆర్ నిరుద్యోగుల అసంతృప్తి చల్లార్చేందుకు చేసిన ఉద్యోగాల ప్రకటన మీద టిఆర్ ఎస్ పార్టీ ఒక వైపు భారీ సంబురాలుచేసుకునేందుకు జనాన్ని సమీకరిస్తూ ఉంది. అపుడే సిద్ధిపేట టిఆర్ ఎస్ కార్యకర్తలు ‘ఉద్యోగ ప్రకటన ‘ చేసినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కు,  ఆర్థిక మంత్రి హరీష్ రావు కు ధన్యవాదాలు చెబుతూ క్రికెట్ స్టేడియంలో టపాసులు పేల్చి పండగ చేసుకునేందుకు పిలుపు నిచ్చారు. ఉస్మానియా క్యాంపస్ ‘కెసిఆర్ దేశ్ కీ నేత ’ అంటూ టిఆర్ ఎస్ మద్దతుదారులు నినాదాలు చేశారు.

Osmania Campus
Osmania Campus

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 11వేల 103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరిస్తూ,80వేల 39 ఉద్యోగుల భర్తీకి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ విధాన ప్రకటన చేయడం హర్షణీయని మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యానించారు.

అయితే, ప్రతిపక్షాలు మాత్రం ఇది దగా మోసం అంటున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి జీవిన్ రెడ్డి ఈ సందర్భంగా అనేక ప్రశ్నలు సంధించారు.  తెలంగాణలో  కనీసం టీచర్ ఎలిజిబులిటి టెస్ట్ నిర్వహించుకునే పరిస్థితి లేదని అంటూ పది ప్రశ్నలు సంధించారు.

జీవన్ రెడ్డి ఏమన్నారంటే…

1. నిరుద్యోగ భృతి ఏమైనది?

2.గ్రూప్ వన్ పోస్టుకు జోనల్ వ్యవస్థ ఎందుకు అడ్డు వచ్చింది?

3. 80వేల ఉద్యోగాలు ఆర్భాటం కాదు.

4. 1లక్ష 91ఉద్యోగాలు ఖాళీలు ఏడాది క్రితమే ఉన్నవి.

5. ఇప్పుడు 2లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయి.

6. నిర్ణిత కాలం కాలెండర్ ప్రభుత్వం విడుదల చేయాలి.

7. మన ఊరు మన బడి ఎలా కొనసాగిస్తారు?

8. ప్రతి పాఠశాలలో ఉర్పరులను నియామకం చేసుకునే పరిస్థితి లేదు.

9.  సీఎం కేసీఆర్ కు శిత్తశుద్ధి ఉంటే బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం పోస్టుల భర్తీ చేయాలి.

10. అన్ని శాఖల్లో ఖాళీలు భర్తీ చేయాలి.

ఇదే విధంగా అసెంబ్లీ లో మిత్రపక్షమయిన ఎంఐఎం నేత అక్బరద్దీన్ కూడా అసమ్మతి వ్యక్తం చేశారు. అయితే, బంగారు తెలంగాణ నిర్మాణంకోసం టిఆర్ ఎస్ తో కలసి  ముందుకు పోతామన్నారు. ఇదొక రాజకీయం. అక్బరుద్దీన్ ఏమన్నారంటే…

*మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి మూడేళ్ళ నుంచి ఇవ్వడం లేదు.

*ఆరోగ్యశాఖలో ప్రభుత్వం చెప్తునంత పనితీరు లేదు.

* టీమ్స్ హాస్పిటల్ ఘనంగా ఓపెన్ చేసి ఎందుకు మూసివేశారో తెలీదు.

* మెడికల్ కాలేజీల అంశంలో ప్రభుత్వం లెక్కలు తప్పు చెప్తోంది.

* ప్రభుత్వం మంచి చేస్తోంది- కానీ ఇంకా చేయాల్సి ఉంది…. అని అంటూనే

వచ్చే ప్రభుత్వం టీఆరెస్ దే నని ప్రకటించారు. దీనికోసం తాము టిఆర్ ఎస్ తో  కలిసి పనిచేస్తామని, బంగారు తెలంగాణ అభివృద్ధిలో టీఆరెస్ తో ఎంఐఎం కలిసి ముందుకు వెళతామని అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *