ఉద్యోగాల మీద కెసిఆర్ ప్రకటన

తెలంగాణలో ఉద్యోగార్థుల గరిష్ఠ వయోపరిమితి ముఖ్యమంత్రి కెసిఆర్ పెంచారు.  ఈ మేరకు ఆయన ప్రకటన చేశారు. ఆయన ప్రకటన ప్రకారం,

*ఓసీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు

*ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల వయోపరిమితి 49 ఏళ్లు

*దివ్యాంగ అభ్యర్థుల వయోపరిమితి 54 ఏళ్లు

*ఎక్స్‌ సర్వీస్‌మెన్లకు వయోపరిమితి 47 ఏళ్లు

*హోంశాఖలో వయోపరిమితి మినహాయింపు లేదు.

 


నిరుద్యోగ యువకుల ఊరట నిచ్చే ప్రకటన చేస్తానని, దానికోసం ఈ రోజు టివి చూస్తూ ఉండాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్న ప్రకటించినసంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి ఈ రోజు ప్రకటన చేయడంతో టిఆర్ ఎస్ పార్టీ రాష్ట్రమంతా సంబురాలకు సమాయత్తమవుతూ ఉంది. సిద్దిపేట సిద్దిపేట క్రికెట్ స్టేడియం లో నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్ , మంత్రి హరీష్ రావుకి కృతజ్ఞతలు తెలుపుతు సంబరాలు జరుపుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో 80,039 ఖాళీలు ఉన్నాయని, వాటిని నేరుగా భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. నియామక ప్రక్రియ నేటినుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. శాఖల వారీగా ఖాళీల వివరాలు..
హోం శాఖ- 18,334
సెకండరీ ఎడ్యుకేషన్- 13,086
హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్- 12,755
హయ్యర్ ఎడ్యుకేషన్- 7,878
బీసీల సంక్షేమం- 4,311
రెవెన్యూ శాఖ- 3,560
ఎస్సీ వెల్ఫేర్‌ శాఖ- 2,879
నీటిపారుదల శాఖ- 2,692
ఎస్టీ వెల్ఫేర్- 2,399
మైనారిటీస్ వెల్ఫేర్- 1,825
ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ మరియు టెక్నాలజీ- 1,598
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ- 1,455
లేబర్, ఎంప్లాయీమెంట్- 1,221
ఆర్థిక శాఖ- 1,146
మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్- 895
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్- 859
అగ్రికల్చర్, కో-ఆపరేషన్- 801
రవాణా, రోడ్లు, భవనాల శాఖ- 563
న్యాయశాఖ- 386
పశుపోషణ, మత్స్య విభాగం- 353
జనరల్ అడ్మినిస్ట్రేషన్- 343
ఇండస్ట్రీస్, కామర్స్- 233
యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం, కల్చర్- 184
ప్లానింగ్- 136
ఫుడ్, సివిల్ సప్లయిస్- 106
లెజిస్లేచర్- 25
ఎనర్జీ- 16

 

ఎంపి సంతోష్ హర్షం

ఇప్పటికే ఇచ్చిన 1 లక్షకు పైగా ఉద్యోగాలు కాకుండా, ఇప్పుడు మరో 91,142 పోస్టుల నోటిఫికేషన్‌ను ప్రకటించి ముఖ్యమంత్రి కేసిఆర్  మరో బహుమతి నిరుద్యోగులకు అందించారని  టిఆర్ ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ అన్నారు.  “నీళ్లు- నిదులు- నియామ‌కాల,నినాదాలు నిజ‌మయ్యాయని, దేశం అబ్బుర‌ప‌డే స్థాయిలో ఉద్యోగ నియామ‌కాల ప్ర‌క‌ట‌న వ‌చ్చిందని,” ఆయన అ న్నారు.

ఇది గౌరవ కేసీఆర్ గారి కార్య‌ద‌క్ష‌త‌కు నిద‌ర్శ‌నమని అంటూ  ‘2022 ఉద్యోగ నామ సంవ‌త్స‌రం’ అని ఆయన  అభివర్ణించారు.

అయితే, ప్రతిపక్షాలు మాత్రం అసంతృప్తితోనే ఉన్నాయి.  కాంగ్రెస్ ఎమ్మెల్సీ  టి జీవన్ రెడ్డి  అనేక ప్రశ్నలు సంధిస్తూ కెసిఆర్ ప్రకటన మోసపూరితం అన్నారు. నిరుద్యోగ భృతి ఎక్కడ అని ప్రశ్నించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *