“చట్టసభల సాంప్రదాయాలను విస్మరించరాదు.”
-వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డిP
చట్టసభలకు ఎన్నికై మరణించిన వారికి సంతాపం తెలపటం మన సాంప్రదాయంగా కొనసాగుతుంది. నేడు అలాంటి సాంప్రదాయాలకు తిలోదకాలిచ్చి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా,ఎంపీగా,మంత్రిగా, ముఖ్యమంత్రిగా,గవర్నర్ గా పలు ఉన్నత పదవులు అధిరోహించి ఆ పదవులకే వన్నె తెచ్చిన మహనీయులు,గొప్ప రాజనీతిజ్ఞులు కొణిజేటి రోశయ్యకు అసెంబ్లీలో సంతాపం తెలియజేయకపోవటం ఘోరమైన తప్పిదంగా భావిస్తున్నాను.
అదే విధంగా రాజకీయ కురువృద్ధులు, వ్యవసాయ శాఖా మాత్యులు గా,మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా,జిల్లా పరిషత్ చైర్మన్ గా అవిరళకృషి జరిపి తన 104 వ ఏట మరణించిన యడ్లపాటి వెంకట్రావు ను విస్మరించడం అన్యాయం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుండి చట్టసభల సభ్యుల మరణాంతరం చట్టసభలలో సంతాపం తెలిపే సాంప్రదాయాన్ని కొనసాగించాలని కోరుచున్నాము. రాజకీయాలకు అతీతంగా ప్రతి సభ్యున్ని గౌరవించుకోవాలి.
సౌమ్యుడు,నిజాయితీపరుడు
కీ.శే మేకపాటి గౌతమ్ రెడ్డి కి ఘనంగా సంతాపం తెలపడం జరిగింది. వారి పేరుతో ఉదయగిరిలోని మెరిట్స్ కళాశాలను వ్యవసాయ,ఉద్యాన కళాశాల ఏర్పాటు చేయడం,సంగం బ్యారేజీ ప్రాజెక్టును ఆరు వారాల లోపు పూర్తి చేసి గౌతమ్ సంగం బ్యారేజ్ ప్రాజెక్ట్ గా నామకరణం చేయాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నాం.
వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను త్వరగా పూర్తిచేసి ఉదయగిరి ప్రాంతానికి నీరు అందిస్తామని పేర్కొనడాన్ని హర్షిస్తున్నాం.మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కోరిన విధంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రకాశం,నెల్లూరు జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాల వారి ప్రయోజనాలు నెరవేరుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను.
(వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు, జన చైతన్య వేదిక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ 9949930670)