-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
*భారత దేశం పై మార్క్స్ వైఖరి మొదట ఎలా ఉండేది? చివరి జీవితంలో ఏ వైఖరికి వచ్చాడు? ఒకవేళ వస్తే కారణమేమిటి*
*రష్యా సామాజిక విప్లవంపై మార్క్స్ తొలి అంచనా ఎలా ఉండేది? చివరలో వైఖరిలో ఏ మార్పు చేసుకున్నాడు? కారణమేమిటి?*
*మార్క్సిజం యూరోప్ కేంద్రక విప్లవ సిద్ధాంతం అనే మార్క్స్ ప్రత్యర్థుల విమర్శల్లో వాస్తవం ఉందా? వాటికి మార్క్స్ ఆఖరి రచనలు ఇచ్చే జవాబు ఏమిటి?*
*ఇవి తెలుసుకునే ఆసక్తిపరులకు ఒక సదవకాశం వచ్చింది. DVVS వర్మ గారి సంపాదకత్వంలో “మార్క్స్ మెగా-2” పై ప్రత్యేక సంచిక వస్తోంది. (వర్మ గారు గతంలో “జాతీయ స్ఫూర్తి” మాస పత్రిక నడిపించారు) మార్క్స్ అలభ్య రచనల పట్ల ఆసక్తిపరులకు వర్మ గారు పరిచయం చేయ సంకల్పించారు.*
*14-3-202 2 న మార్క్స్ 139వ వర్దంతి సందర్భంగా పై సంచిక విడుదల కానుంది. నేటి వరకు ఆంగ్ల భాషలో వాటిని అధ్యయనం చేసిన వారు అతికొద్ది మంది వుండొచ్చునేమో! అట్టి అరుదైన వాళ్ళు తప్ప ఇప్పటి వరకు తెలుగు మార్క్సిస్టు సిద్ధాంత పాఠకలోకానికి అవి అందుబాటులో లేవనే చెప్పాలి. అట్టి ఆఖరి రచనల్ని పరిచయం చేసే వర్మ గారి ప్రయత్నాన్ని స్వాగతిద్దాం.*
పై కాపీల కోసం ఆసక్తి ఉన్న మిత్రులు DVVS వర్మ గారిని కాంటాక్ట్ చేయవచ్చు. ఫోన్ నెంబర్-8500678977