బిలం గుహ యాత్ర… మరొక అనుభవం

(కుందాసి ప్రభాకర్)

ఇది శేషాచల సాహసికుల నల్లమల యాత్ర…
రాయలసీమలో పరిచయం అక్కరలేని పేరు, సీనియర్ ట్రెక్కర్ భూమన్ సర్ . ఆయన నాయకత్వంలో తిరుపతి నుండి FRO  ప్రభాకర్ రెడ్డి గారు, FRO రమణా రెడ్డి గారితో పాటు మొత్తం  పదముగ్గురి మిత్రుల  నల్లమల యాత్ర కథనం ఇది.

వివేక్ లంకమల ఈ బిలం గుహ గురించి చెప్పినపుడే కచ్చితంగా వెళ్ళాలి అనుకున్నా.. కానీ ఒక్కరోజు కార్యక్రమం అవడం వల్ల ఆలోచనలో పడ్డా ..చాలా దూరం., వెళ్లాలా వద్దా అని.

కానీ భూమన్ సర్  ఈ యాత్రను  రెండు రోజుల కార్యక్రమంగా మార్చడంతో ఇక చెప్పేదేముంది.  భూమన్ సర్  అందరినీ ఒక త్రాటిపైకి వచ్చేలా చేసి మాకు మధుర జ్ఞాపకాలను అందించారు.  ముఖ్యంగా  ఆయన  వ్రాసిన ‘రాయలసీమ ముఖ చిత్రం’ పుస్తకాన్ని  బహుమతిగా ఇచ్చి నన్ను అభినందించి
నాలో కొత్త ఉత్సహాన్ని నింపారు.  వారి పెద్ద మనసుకు నమస్సులు…

ముందుగా అనుకున్న ప్రకారం అందరం కుక్కలదొడ్డి వద్దకు చేరుకున్నాం. అక్కడ టిఫిన్ పూర్తి చేసుకుని  మా నల్లమల యాత్రను మొదలుపెట్టాం.

మొదట ఎంతో చారిత్రక ప్రాధాన్యత గలా ‘సిద్దవటం కోట’ ను సందర్శించాము.  తర్వాత బద్వేల్ దగ్గర నందిపల్లిలో ఉన్న ఈ ట్రెక్ కు సూత్రధారి వివేక్ లంకమల వాళ్ళ ఇంటికి వెళ్ళాం.

ఆయన మా అందరికి సాదర స్వాగతం పలికారు.  అందరికీ వాళ్ళ ఇంటిలోనే రాయలసీమ ఆతిధ్యం ఇచ్చారు స్పెషల్ సంగటి (ముద్ద), ఊరిబిండి (చెనిగి గింజల పచ్చడి) నాటు కోడి ఫ్రై లతో భోజనాలు ఏర్పాటు చేశాడు.

చివర అందించిన  నన్నారి షర్బత్ హైలైట్.  యువ రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాల అయిన వివేక్ లంకమలకు భూమన్ గారి చేతుల మీదుగా సత్కారం జరిగింది.వివేక్ తో పాటూ మా అందరికి కూడా చిరు సత్కారాలు కూడా ఉండినాయి. తర్వాత  కాసేపు సేదతీరి లంకమలకు బయలుదేరాం

అడవిలో చాలా దూరం ప్రయాణం.

మరుసటి రోజు ఉదయాన్నే మొదలైంది బిలం గుహ యాత్ర.  దారిలో బ్రహ్మంగారి మఠం, బ్రహ్మం సాగర్ వెళ్ళాం.ఎక్కడెక్కడి నుండో వచ్చిన వాళ్లంతా కలసి మొత్తం ఇలా ఎనభై మంది అయ్యాం.

.

ముందుగా సూచించిన ప్రకారం మల్లెపల్లి వద్దకు చేరుకున్నాం.  అక్కడి నుండి  ట్రాక్టర్లు కార్లు, స్కూటర్ల మీద అడవిలో 15 కీ. మీ. ప్రయాణించి రామన్న బావి వద్దకు చేరుకున్నాం.

దారిపొడుగునా   ఇలాంటి వింతలే…

అక్కడినుండి ఒక పది నిముషాల నడక దూరంలో ఉంటుంది ‘బిలం’ గుహ. అందరూ అక్కడికి చేరేలోపు మేము మరొక  పని పూర్తి చేశాం. నేను ,వివేక్, అరణ్య శేఖర్, సునీల్ అన్న కలసి  అక్కడికి నుండి అడవిలో  మరొక 5 కి.మీ నడచి,  ‘బుగ్గ’ ను చేరకుని  అక్కడి  ‘మొండి భైరవ స్వామి’ శిలలను చూసొచ్చాం. ఈ యాత్రంలో ఇదొక హైలైట్.

అడవిలో ఉన్నాాం. చుట్టూరనే కాదు, కనుచూపు మేర అడవే వ్యాపించి ఉంది.  చాలా అందమైన ప్రదేశం. వర్షాలు తగ్గి  ఎండలు కాస్తూ ఉన్న వాతావరణంలో  అడవి బంగారపు రంగులో మెరిసి పోతోంది. అక్కడినుండి తిరిగొచ్చాకమేము వంట మొదలు పెట్టాం. అప్పటికే కొంత మంది గుహ చూసి వచ్చేసారు.  ఆపైన  వెళ్ళాం నేను, శ్రీనాధ్ గుహను చూడడానికి. ఇదే గుహ

 

మొదట చూడడానికి చిన్నగానే కనిపిస్తుంది కానీ లోపల చాలా చాలా దూరం విస్తరించి ఉంది.  లోన చిమ్మ చీకటి (కింది ఫోటో), అదొక  గబ్బిలాలప్రపంచం. ఘాటైన  వాటి పెంటికల, వాసన.  అపుడు గుహలో ఎవ్వరూ లేరు- నేను , శ్రీనాధ్ అంతే.

టార్చ్ లైట్ వెలుతురులో ముందుకు వెళుతుంటే ఒకవైపు మనిషి పుర్రె ఆకారంలో భారీ శిల, మరో వైపు ఒక ఋషి కూర్చున్న ఆకారంలో ఇంకో శిల. విఠలాచార్య సినిమాలోలాగా. దానికి తోడు గబ్బిలాల అరుపుతు.నిజంగా అంతా హర్రర్ సినిమా చూస్తున్నట్లు ఉంది మాకు.

టార్చిలైట్ వెళుతురులోనే లోపలికి వెళ్లి అంతా కలియతిరిగి గాలించి బయటకు వచ్చాము. టన్నుల కొద్ది అనుభం, అనుభూతి మోసుకుని తిరిగొచ్చాం.  భోజనాలు అయ్యాక ‘జ్యోతి’ చూసుకొని తిరుగు ప్రయాణం అయ్యాం.

ఎన్ని విశేషాలున్నాయో.  ఇంకా చాలా చాలా ఉంది చెప్పడానికి.

 

కొసమెరుపు ఎంటంటే… ఈ యాత్రలో ‘కొండపొలం’ రచయిత  సన్నపురెడ్డి వెంకట్రామి రెడ్డి గారిని కలవడం చాలాఆనందాన్ని ఇచ్చింది. ఎక్కడో మారుమూల అడవిలో ఉన్న ఇలాంటి ప్రకృతి అందాలను మాకు పరిచయంచేసి అద్భుతమైన జ్ఞాపకాలను ఇచ్చిన. వివేక్ లంకమలకు, అరణ్య శేఖర్ మరియు మొత్తం టీంకు ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *