అమరావతి రాజధాని మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో శాసనసభ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వహక వ్యవస్థల పరిధి, బాధ్యతలు, అధికారాల పై చర్చ జరగాలి అంటూ దీనికోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని శ్రీకాకుళం వైసిపి ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. లేఖ పాఠం ఇదే.
(ధర్మాన ప్రసాదరావు)
అమరావతి రాజధాని విషయమై గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు పాఠం మనందరికీ తెలిసిందే.
ఈ తీర్పును వెలువరిస్తూ అనేక ఇతర విషయాలతో పాటు “the Legislature has no legislative competence to pass any resolution/law for change of capital or bifurcating or trifurcating the capital city” and also opined that “change of Government is not a ground to change the policy”అని పేర్కొన్నారు.
అమరావతి రాజధానిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పు పై నేను ఎటువంటి వ్యాఖ్య చేయదలుచుకోలేదు. కానీ గౌరవ హైకోర్టు వారు శాసన సభకు రాజధాని మార్చడానికి గాని లేదా రెండు మూడు రాజధానులుగా విభజించుటకు గాని శాసన అధికారము లేదనే వ్యాఖ్య నన్ను తీవ్రంగా ఆలోచింపజేస్తున్నది. ఎందుకంటే మన రాజ్యాంగ మౌలిక సూత్రాలలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పరిపాలనకు సంబంధించి శాసన నిర్మాణం, కార్య నిర్వాహక మరియు న్యాయ వ్యవస్థల పరుధులను స్పష్టముగా నిర్ణయించి నిర్వహించడం జరిగింది. దీనినే ప్రజాస్వామ్య వ్యవస్థలో “Doctrine of Separation of powers” గా పేర్కొంటూ రాజ్యాంగము ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. దీని వల్ల శాసన సభ, కార్య నిర్వాహక వర్గము, న్యాయ వ్యవస్థ వాటి వాటి పరుధులకు లోబడి ఒక దానిని ఒకటి అతిక్రమించకుండా, ఒక దానిలో ఇంకొకటి జోక్యం చేసుకోకుండా ప్రజలకు సుపరిపాలన అందించటం లక్ష్యంగా రాజ్యాంగ నిర్మాతలు ఒక మహత్తరమైన లక్ష్యం తో చేసిన ఏర్పాటు ఇది.
శాసనాలు తయారు చేయటం, విధివిధానాలు రూపొందించటం, ప్రజా సంక్షేమానికి,భద్రతకు రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి అవసరమైన చట్టాలు రూపొందించటం రాజ్యాంగం ద్వారా రాష్ట్ర శాసన సభకు సంక్రమించిన హక్కు మరియు బాధ్యత. ఈ హక్కును వినియోగించుకోకపోతే రాష్ట్ర శాసన సభ తన బాధ్యతను విస్మరించినట్టే కదా. ఇటువంటి హక్కును, బాధ్యతను కాదనడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని నేను భావిస్తున్నాను.
గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వెలిబుచ్చిన పై తీర్పులో భాగమైన “the Legislature has no legislative competence to pass any resolution/law for change of capital or bifurcating or trifurcating the capital city” and also opined that “change of Government is not a ground to change the policy” శాసనసభ అధికారాలలోను బాధ్యత నిర్వహణలోను న్యాయ వ్యవస్థ జోక్యం కలిగించుకునట్లు ఎవరికైనా స్ఫురించక మానదు.
కాబట్టి శాసనసభ,న్యాయ వ్యవస్థ, కార్యనిర్వహక వర్గం వాటి వాటి పరిధి, బాధ్యతలు, అధికారాలు పై చర్చ జరగాల్సిన అవసరం కనిపిస్తుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ మూడు విభాగాల మధ్య రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా “Speration of
Powers” పై చర్చించటానికి వీలుగా శాసన సభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను.
(ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం శాసన సభ్యుడు, వైసిపి, ఆంధ్రప్రదేశ్ )
ధర్మాన ప్రసాదరావు గారు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ని పార్లమెంట్ లో కూడా నోటిఫికేషన్ విడుదలైంది . దీని జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో ఒపూకున్నారు. కానీ తరువాత రాజకీయ కారణాలతో 3 రాజధానులు అంశం తీసుకొచ్చారు. రైతు ప్రయోజనాలు విస్మరింవహిన్నారు. అందువల్ల కోర్టు ఆదేశించింది.