“గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ‘మరుగుదొడ్లు డ్యూటీ’ ఉత్తర్వులు తక్షణమే ఉపసంహరించుకోవాలి అలాగే భవిష్యత్ లో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి”
ఈ వివాదం మీద ఉద్యోగ సంఘాల ప్రకటన:
గుంటూరు నగరం లొవివిధ ప్రాంతాలలో నిర్వహించబడుతున్న మరుగుదొడ్లు నిర్వహనా భాద్యతలు తీసుకున్న DANISH ECONOMICALLY POOR PEOPLE SEVA SAMITI వారి యొక్క కాంట్రాక్టు 27-02-2022 వ తేదీన ముగీయడంతో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులైన మున్సిపల్ అదనపు కమిషనర్ గారు సోమవారం నాడు 14 మంది సచివాలయ ఉద్యోగులైన వార్డు అడ్మిన్ లకు వాటి నిర్వహణ భాద్యతలు అప్పగిస్తూ ఒక సర్కులర్ ను విడుదల చేసారు.
మూడు సిఫ్టులుగా ఇక్కడ పనిచేయాలని అదనపు కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇలా గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులకు ఇలాంటి విధులు ఇవ్వడంపై AP JAC అమరావతి చైర్మన్ బొప్పరాజు , AP VSWS JAC ప్రతినిధులు సాయినాథ రెడ్డి, శివకృష్ణరావు శ్రీపతి, శమీర్ హుస్సేన్ కృపజ్యోతి, సల్మాన్ బాష క్రిస్టోఫర్ తదితరులు తీవ్రంగా ఖండించారు.
అంతేగాక ఒక్కో వార్డు కార్యదర్శి ఎంత రుసుము వసూలు చేయాలో లక్ష్యాలు విధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఇంతలోనే గుంటూరు అదనపు కమిషనర్ ఇచ్చిన వుత్తర్వులు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు తీవ్ర ఆందోళనకు గురి చేసింది.
ఇప్పటికే గత సంవత్సరం అక్టోబర్ 2 వ తేదీ నుండి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ చేయవలసి ఉన్నప్పటికి, ప్రభుత్వం ఇంకా కాలయాపన చేస్తూ ఉండటం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇప్పటికే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇప్పుడు మరుగుదొడ్లు దగ్గర కలెక్షన్ బాధ్యతను అప్పజెప్పడం వారిని మరింత మానసిక వేదనకు గురి చేయడమేనని AP JAC అమరావతి మరియు రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
●గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరికి AP JAC అమరావతి బాసటగా నిలబడి జేఏసీ పక్షాన ప్రభుత్వంతో మాట్లాడి ఇచ్చిన ఆదేశాలు రద్దు చేయటానికి కృషి చేస్తామని తెలియ చేస్తున్నాము.
● లక్షా 25 వేల మంది గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులను ఉన్నతాధికారులు ఇంత చిన్న చూపు చూస్తునందుకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మానసిక మనోవేదనకు గురవుతున్నారు.
ప్రభుత్వం భవిష్యత్తులో ఇలాంటివి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఈ సందర్బంగా బొప్పరాజు, వైవీ రావు, సాయినాథ్ రెడ్డి తదితరులు కోరుతున్నారు.