-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
*నెల్లిమర్ల జూట్ కార్మికోద్యమంపై 1994 జనవరి 29న పోలీసు కాల్పులు జరిగాయి. ఐదుగురు కార్మికులు అమరత్వం పొందారు. వారిలో ఒకరు కోల అచ్చప్పుడు గారు! ఆయన తల్లి పేరు అప్పయ్యమ్మ గారు. ఆమె 90 ఏళ్ల పైబడ్డ వృద్ధురాలు. నిన్న రాత్రి మృతి చెందారు. భౌతిక కాయానికి ఈ ఉదయం అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. కోల అప్పయ్యమ్మ గార్కి జోహార్లు!
*కోల అచ్చప్పుడు గారి భార్య పేరు లక్ష్మి గారు. ఇద్దరు కొడుకులు రాము, సత్యరావు, కోడళ్ళు కలిసి మెలిసి వుంటున్నారు. (ఒక కొడుకు గతంలో మృతి చెందాడు.)
*ఈరోజు ఉదయం నెల్లిమర్ల ఇఫ్టూ కామ్రేడ్స్ ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు.
*అచ్చప్పడి కుటుంబ సభ్యులు నాటి నెల్లిమర్ల జూట్ కార్మికోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. కాల్పులు జరిగి 28 ఏళ్లు గడిచింది. నేటికీ అదే నిబద్దతతో ఉన్నారు.
*వారి అమరత్వానికి పాతికేళ్లు నిండిన సందర్భంగా నెల్లిమర్లలో 29-1-2019న ప్రదర్శన, సభల్ని ఇఫ్టూ రాష్ట్ర కమిటీ నిర్వహించింది. ఆ సందర్భంగా అమరజీవి అచ్చప్పుడు గారి కుటుంబాన్ని పరామర్శ చేసాను (పై ఫోటో). అప్పయ్యమ్మ గారిని పరామర్శించే సమయంలో స్థానిక కార్మిక మిత్రులు ఫోన్ ద్వారా ఒకఫోటో తీశారు. ఆమె మృతి సందర్భంగా ఆ ఫోటోను వెలుగులోకి తేవడం సందర్భోచితంగా భావించి మిత్రులకు పంపిస్తున్నాను
*కోల అప్పయ్యమ్మ గార్కి జోహార్లు తెలియ జేద్దాం.
*అప్పయ్యమ్మ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేద్దాం.