ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భేటీ అయ్యారు. ముంబైలోని పవార్ నివాసంలో వీరు సమావేశమయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ ని ఓడించే లక్ష్యంతో ఆయన ఇతర ముఖ్యమంత్రులను, జాతీయ నేతలను కలుస్తున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ ఈ రోజు ముంబై వెళ్ళి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ని, ఎన్ సిపి అధినేత శరద్ పవార్ ను కలిశారు. పవార్ ను కలసిన ఫోటోలు.
సమావేశం అనంతరం శరద్ పవార్ నివాసం బయట మీడియాలో ఇరువురు మాట్లాడారు.
కేసీఆర్: ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శరద్ పవార్ ఇచ్చిన మద్దతును మర్వలేం. 1969 నుంచి తెలంగాణ పవార్ మద్దతుగా ఉన్నారు. దేశ అభివృద్ధికి కొత్త ఎజెండా అవసరం. దేశం సరైన రీతిలో ముందుకు పోవడం లేదు. త్వరలో భావసారుప్యం గల పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నాం. అందరం కలిసి ఈ ఎజెండాపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రజల ముందుంచుతాం. దేశంలో విశేష అనుభవం ఉన్న నేత శరద్ పవార్. మోడీ సర్కారుపై చేపట్టిన తమ పోరాటానికి శరద్ పవార్ మద్దతుగా నిలిచి ఆశీర్వదించారు.
శరద్ పవార్: ‘ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం, ఇంధన ధరలు వంటి అనేక సమస్యలున్నాయి. మోడీ సర్కారు అన్ని రంగాల్లో విఫలమైంది. తెలంగాణ అనేక సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు అవుతున్నాయి. దేశ అభివృద్ధికి కలిసి పనిచేస్తాం