హైద్రాబాదుకు చెందిన Megha Engineering & Infrastructures Limited (MEIL) కంపెనీ తరపున టి. అశోక్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ లీగల్ & కాంట్రాక్టు మానేజ్మెంట్స్ ఖమ్మం జిల్లా కోర్టు లో అనేక మీడియా సంస్థల మీద పరువు నష్టం దావా (O.S. No. 8 of 2022) కేసు వేశారు. కేసు వేసేందుకు కారణం ఒక వార్త. తెలంగాణ ప్రభుత్వంలో ఒక కీలకమయిన పదవిలో ఉన్న ఐఎఎస్ అధికారి ఒకరు బిడ్డ పెళ్లిని ఫైవ్ స్ఠార్ హోటల్ స్థాయిలో చేశారని, దానికి సంబంధించిన బిల్లులను తెలంగాణా లో భారీప్రాజక్టుల కాంట్రాక్టులు దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ కు చెందిన అనుబంధ సంస్థలు అని బెంగుళూరుకు చెందిన డిజిటల్ న్యూస్ ప్లాట్ ఫాం ఆ మధ్య Exclusive: Top Telangana bureaucrat’s daughter’s wedding gala sponsored by mystery company? అనే పేరు ఒక వార్త రాసి సంచలనం సృష్టిచింది. ఈ వార్త ని కొన్ని తెలుగు పత్రికలతో పాటు అనేక ప్రాంతీయ జాతీయ డిజిటల్ ఫ్లామ్స్ వాడి వైరల్ చేశాయి. దీని వల్లే తమ కంపెనీ పరువుపోయిందని MEIL పరువు నష్టం కేసును వేసింది.
కేసులో ఉన్న ప్రతివాదులు మొత్తం 30.
ప్రతివాదులు వివరాలు:
1 నుండి 9 – బెంగుళూరు కి చెందిన The News Minute (TNN)
10 నుండి 12 – మహబూబ్ నగర్ కి చెందిన తోలివెలుగు
13 నుండి 17 – హైదరాబాదుకి చెందిన V6 ఛానల్
18 మరియు 19 – హైదరాబాద్ చెందిన దిశా న్యూస్ పేపర్
20 మరియు 21 – ముంబైకి చెందిన ఆసియానెట్
22 మరియు 23 – న్యూ ఢిల్లీకి చెందిన హిందూస్తాన్ టైమ్స్
24 మరియు 25 – న్యూ ఢిల్లీకి చెందిన ఇండియా టుడే
26 మరియు 27 – హైదరాబద్ , బెంగళూరుకి చెందిన గూగుల్ సంస్త
28 – హైదరాబద్ కి చెందిన ఫేస్ బుక్ సంస్త
29 మరియు 30 – బెంగళూరు, ముంబైకి చెందిన ట్విట్టర్ సమస్త
దావా ప్రకారం 30 మంది ప్రతివాదులలో ఒక్కరు కూడా ఖమ్మంలో నివసించుట లేదు. అందరు హైదరాబాద్, బెంగళూరు, ముంబై, న్యూ ఢిల్లీ, మహబూబ్ నగర్ లో నివసించే వాళ్ళే.
ఈ కేసులో A అంటే TNN, తోలివేలుగు, V6 తదితర వెబ్సైట్, B అంటే MEIL. ఈ కేసులో ప్రచురించిన కథనాలు అన్నీ హైదరాబాద్, బెంగళూరు, ముంబై, న్యూ ఢిల్లీ, మహబూబ్ నగర్ నుండి వచ్చినవి.
కేసు ఏంటంటే: మేఘ కంపెనీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కాంట్రాక్టర్, ఆ ప్రాజెక్ట్ కి ఫండ్స్ రిలీజ్ చేసే అధికారి రజత్ కుమార్. రజత్ కుమార్ కూతురు పెళ్ళికి మేఘ కృష్ణ రెడ్డి కంపెనీ అధికారులే దగ్గర ఉండి పెళ్లి పనులు చూసుకున్నారు ఈ అధికారులే 5 స్టార్ హోటల్ బుక్ చేసారు, తాజ్ ఫలకనామ లో ప్రతి మనిషికి 16,000 రూపాయల డిన్నర్ ఆరంజ్ చేసారు, ఇలా ఐదు రోజులు అంగ రంగ వైభవంగా ఈ అధికారులు దగ్గర ఉండి మరి వైభవంగా పెళ్లి చేసారు. ఇది మేఘ కృష్ణ రెడ్డి కంపెనీ కి రజత్ కుమార్ కి మధ్య క్విడ్ ప్రో కో…అని ‘ది న్యూస్ మినిట్ ‘ ఒక కథనం రాసింది. దానిని మిగతా పేపర్లు, వెబ్ సైట్స్ మళ్ళీ ముద్రించాయి.
ఖమ్మంలో కేసు ఎందుకు వేశారు: ఖమ్మంలో ఫైల్ చేయడానికి గల కారణాలు దావాలో ఈ విధంగా వివరించారు. మేఘ కంపెనీకి చెందిన DGM, AGMలు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పరిశీలించడానికి వెళ్ళినప్పుడు, స్థానికులు మరియు కాంట్రాక్టర్ లతో మాట్లాడినప్పుడు, వారికి తమరి కంపెనీ ఒక్క IAS ఆఫీసర్ కూతురి కోసం విధులు అందించింది అనే ఆరోపణలు గురించి తెలిపారు. వెంటనే వారు వెబ్సైట్ లు చూడగా, బిగ్ వేవ్ అనే మరో కంపెనీ ద్వారా MEIL కంపెనీ పరోక్షంగా IAS ఆఫీసర్ కూతురు పెళ్ళికి నిధులు అందించింది అన్న విషయం వారికీ తెలిసింది అంట. (PARA 11 of Plaint).
అంటే, ఈ పర్యటన వారు ఖమ్మం జిల్లాలో కాకుండా ఎక్కడో జమ్మూ కాశ్మీర్ లో హిమాలయ ప్రాంతం టన్నెల్ లో చేసిఉంటే, అక్కడ కేసు వేయ వచ్చా? అని జర్నలిస్టులు ఆశ్చర్య పోతున్నారు.
జర్నలిస్టుల కర్మకాలి మేఘ కృష్ణ రెడ్డి గారి కంపెనీ మనుషులు ఏ అంతర్జాలంలోనో మన పబ్లికేషన్ మీద వార్త వచ్చిందని తెలుసుకుని ఉంటే, అంతర్జాతీయ కోర్టులో కేసు వేసే వారేమో అని వారు ఆశ్చర్యపోతున్నారు.