తిరుమలలో ఆహారం విక్రయించకుండా భక్తులందరికి ఉచితంగా అందించేందుకు టిటిడి చర్యలు తీసుకుంటున్నది. టీటీడీనే భక్తులందరికీ ఉచితంగా అన్నప్రసాదాలు అందించాలని బోర్డు నిర్ణయించింది.ఈ మేరకు గురువారం బోర్డ్ మీటింగ్ లో ఒక తీర్మానం చేసినట్లు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. అన్నారు.
ఈ ఏర్పాట్ల కోసమే పాత అన్నదానం కాంప్లెక్స్ ను ఆయన ఈ రోజు పరిశీలించారు. అదే విధంగా తిరుమల లోని రావి చెట్టు సెంటర్లోను, చుట్టుపక్కల ఉన్న హోటళ్ళను ఆయన పరిశీలించారు. అధికారులతో చర్చించి తొందరగా ఏర్పాట్లపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
పాత అన్నదానం కాంప్లెక్స్ లోని లగేజీ కౌంటర్ నిర్వహణ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ఈ భవనంలో అన్న ప్రసాదం ఎలా వడ్డించే వారు, భక్తులను ఏ మార్గంలో లోనికి అనుమతించారు, ఏ మార్గంలో బయటకు పంపేవారనే వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రావి మాను సర్కిల్ లోని హోటళ్ళను పరిశీలించారు. అక్కడ ఉన్న భక్తులతో వసతి, సర్వదర్శనం ఎలా జరిగిందనే వివరాలు తెలుసుకున్నారు.