అసెంబ్లీ ఎన్నికలు ఇంకా చాలా దూరం ఉండగానే తెలంగాణలో ఎన్నికల మంటలు లేచాయి. తెలంగాణకు ఎవరు శత్రవు? దేశానికి, రాజ్యానికి ఎవరు శత్రువు అనే ప్రశ్నలు ఈ సారి ఎన్నికలను వెడెక్కించేలా ఉన్నాయి.
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలంగాణకు మోదీ శత్రవు అని చూపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. #ModiEnemyOfTelangana బాగా ట్రెండ్ అయింది. ఇలాగే నిన్న జనగామలో మాట్లాడుతూ ఢిల్లీ బిజెపి కోటను బద్దలు కొడతానని కెసిఆర్ ప్రకటించారు. అంతేకాదు, ఢిల్లీనుంచి మోదీని అడ్రసు లేకుండా తరిమేస్తానన్నారు. మోదీ ఆయనకు బాగా కసిపెరుగుతూ ఉంది. ఇక మోదీని తెలంగాణ శత్రువుగా చూపి ఎన్నికలకు ఏదో ఒక సెంటిమెంట్ రగిలేంచేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నట్లు జనగామ సభ సందేశం.
ఇక బిజెపి కెసిఆర్ దేశానికి, రాజ్యాంగానికి శత్రువు అని చూపేందుకు క్యాంపెయిన్ మొదలు పెట్టింది.
ఈ మధ్య తెలంగాణలో బాగా హుశారెక్కింది. హూజూరాబాద్ ఎన్నికల్లో బిజెపి తరఫున ఈటెల రాజేందర్ గెల్చాకా కాషాయ పార్టీకి తెలంగాణ పొలిమేరల్లో పవర్ కనబడుతూ ఉన్నట్లు ఉంది. కెసిఆర్ ను అన్నిరకాల అన్ పాపులర్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంది.పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కెసిఆర్ వ్యతిరేక యాత్రలకు విపరీతంగా వస్తున్నారు. ఆయన రైతులను కలిశారు. నిరుద్యోగులతో మిలియన్ మార్చ్ అంటున్నారు. ఏకార్యక్రమం తీసుకున్నా, రూలింగ్ పార్టీకి తీసిపోని విధంగా జనం వస్తున్నారు. దీనితో కెసిఆర్ మీద దాడి తీవ్రతరం చేసింది. దీనికి తోడు బిజెపికి కెసిఆర్ మీద దాడిచేసేందుకు మంచిఅస్త్రాలు దొరికాయి. మొన్న ప్రధాని పర్యటననుకెసిఆర్ బహిష్కరించడాన్ని తీవ్రంగా విమర్శించింది. జ్వరం అనిచెప్పి ప్రధాని ముఖంచూడకుండా కెసిఆర్ తప్పించుకోవడాన్ని బిజెపి తీవ్రంగా విమర్శించింది. చివర ప్రధాని పర్యటన బహిష్కరణ అంటే దేశాన్ని అవమానపర్చడమే అని చెప్పింది.
ఇలాగే కెసిఆర్ రాజ్యంగ వ్యతిరేకి అని క్యాంపెయిన్ ను తీవ్రం చేసింది. ఆ మధ్య కెసిఆర్ ఎక్కడో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని తిరగరాయాలన్ని అన్నాడు. ఇది బిజెపికి ఒక ఆయుధమయింది. రాజ్యాంగాన్ని తిరగరాయాలన ప్రకనట ఒక అపవిత్ర ప్రకటన అన్న ట్లు బిజెపి దానిని రచ్చకీడ్చింది. భారత రాజ్యాంగమనేది డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ జాతికి ఇచ్చిన కానుక అని దాని మార్చాలనడం అంటే అంబేడ్కర్ ను అవమాన పర్చడమేనని బిజెపి వాదిస్తున్నది. ఈ విషయం మీద కెసిఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసింది.శనివారం నాడు కొత్తగూడెంలో ఇలాగే కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్గం చేసే కార్యక్రమం పెట్టింది. అది పెద్దగొడవకు దారి తీసింది.
పోతే, ప్రధాని మోదీని తరికొట్టాలని నిన్న జనగామలో చేసిన కెసిఆర్ ప్రకటన నేడి కొత్త గూడెం సంఘటనకు కారణం అని వేరే చెప్పాల్సిన పనిలేదు. కెసిఆర్ ప్రకటన మీద బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. “ప్రధాని మోదీని ఎందుకు తరిమికొట్టాలి? లాక్ డౌన్ సమయంలో ప్రజలను ఆదుకున్నందుకా? దేశానికి ఫ్రీ వ్యాక్సిన్ అందించినందుకా? 370 ఆర్టికల్, ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేసినందుకా? ఆత్మనిర్బర్ భారత్, మేక్ ఇన్ ఇండియాతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకా? ప్రపంచంలోనే గొప్ప ప్రధానిగా పేరు తెచ్చుకున్నందుకా?”అని ప్రశ్నించారు.