హిందూ చరిత్ర పునాదుల మీద ఇండోనేషియా కొత్త రాజధాని

ఇండోనేషియా కు కొత్త రాజధాని నిర్మించాలని జనవరి 18వ తేదీన పార్లమెంటు ప్రతిపాదించింది. ఇప్పటి రాజధాని జకార్తా,సముద్రంలోకి కుంచించుకుపోతూ ఉండటం, కాలుష్యం తీవ్రం కావడంతో కొత్త రాజధాని నిర్మించాలని బోర్నియోద్వీపంలో నిర్మించాలన్న బిల్లును పార్లమెంటు ఆమోదించింది.
ఇండోనేషియా పార్లమెంటు
ఇండోనేషియా పార్లమెంటు/ Wikimedia commons
ఈ కొత్త రాజధాని జకార్తాకు 2300 కి.మీ మైళ్ల దూరాన ఉన్న, కాలిమంతన్ రాష్ట్రంలో నిర్మిస్తారు. కొత్త రాజధాని పేరు ‘నూసాంతర’ అని పిలుస్తున్నారు. ఈ మాట ఎల వినపడుతుంది. సమాంతర,రూపాంతర, దేశాంత, ద్వీపాంతర… లాగ ఉంది కదూ. అవును, మీ అనుమానం నిజమే. అది హిందూ మాట. కాకపోతే, జావా భాషతో కలసిపోయింది. నిజాంగానే ఈ పేరు అక్కడ విస్తరించిన హిందూ సంస్కృతి సంప్రదాయాలనుంచే వచ్చింది.
Nusantara
రాజధాని ఇలా దూరంగ వెళ్లి పోతూ ఉంది/ Geography Realm
నూసాంతర అంటే అంటే ద్వీప సముదాయం అని అర్థం. నూస అంటే ద్వీపం. ఇది జావనీస్ మాట. దీనికి ‘అంతర’ అనే సంస్కృత మాట తోడయింది. దీనితో ఇది నూసాంతర అయింది. ఈ మాట పుట్టింది పదమూడో శతాబ్దంలో.
క్రీ.శ పదమూడో శతాబ్దంల ఒక సేనాని ఆగ్నేయాసియా దీవులను కలిపి ఒక విశాల రాజ్యం ఏర్పాటుచేయాలని కలకన్నాడు. తన కలల సామ్రాజ్యాన్ని ఆయన నూసాంతర (Nusantara) పిలిచాడు. ఆయన కలల్లో నూసాంతర అంటే జావా నుంచి సింగపూర్ దాకా ఒక వైపు,మరొక వైపు ఫిలిప్పీన్స్ దాకా ఉన్న దీవుల సమూహం. ఇంత విశాల జావా సామ్రాజ్యం ఏర్పాటుచేయాలని ఆ  సేనాని కలగన్నాడు. ఆయన హిందూ సేనాని. అప్పటి రాజ్యం హిందూ రాజ్యం.
Gaja Mada
Gaja Mada / Wikipedia
ఆ సేనాని పేరు గజ మద. గజ మద (క్రీ.శ 1290-1364)ని ఇప్పటి ఇండోనేషియాప్రజలు జాతీయ హీరో గా  పరిగణిస్తారు. గజ మదకు ఉన్న మరొక పేరు ‘జీర్ణోద్ధార’ . జీర్ణోద్ధార అంటే పునరుద్ధరించే వాడని అర్థం.
గజమద అంటే మత్త గజం. శత్రుసమూహాలు ఎదురైనపుడు మత్త గజంలాగా ప్రవర్తించే వాడని వివరణ. ఇవన్నీ సంస్కృత పదాలే.
 నాటి రాజస హిందూ రాజ్యానికి ఆయన ప్రధాని. బలాఢ్యుడు. జావా రాజ్యం మజాపహిత్ కు ఆయన మహాపతి, అంటే ప్రధాన మంత్రి. ఆయన కాలంలోనే విశాల జావా ఏర్పడింది.
గజమద కాలంలోనే రామాయణ, మహాభారతాలు తొలుబొమ్మలాటల ద్వారా బాగ ప్రచారంలోకి వచ్చి జావా సంస్కృతిలో ప్రవేశించాయి. ఆయన భీముడు, శివుడుల కలయికగా అక్కడి గాథలు వర్ణిస్తుంటాయి.
గజ మద ఎలా ప్రధాన మంత్రి అయ్యాడు?
దీనికి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒక కథనం ప్రకారం, జావా రాజ్యం పాలకుడు రాజా జయనగర (1309-28) కు రాజ్యంలో వస్తున్న తిరుగుబాట్లను అణిచివేయడంతో సహకరించాడని, దాని వల్ల రాజు ఆయనకు కొలువులో పదవి ఇచ్చాడు.
King Jayangara
King Jayangara/wikipedia
మరొక కథనం ప్రకారం ఆయన జయనగరను  ఆస్థాన వైద్యుడిచేత హత్య చేయించాడు. ఈ కథనం ప్రకారం  జయనగరకు సవతి చెల్లెళ్లతో విబేధాలొచ్చాయి. అపుడు గజమద చెల్లెళ్లకు సహకరించి జయనగరని రాజవైద్యుడి చేత చంపించాడు. జయనగర అసలు పేరు శ్రీ మహారాజ విరళనందగోపాల శ్రీ సుందర పాండ్య దేవాధీశ్వర. ఆయన మరొక పేరు శ్రీ సుందర పాండ్య దేవాధీశ్వర విక్రమోత్తుంగదేవ. ఆయన తండ్రి పేరు నరార్య సంగ్రామ విజయ. సంగ్రామవిజయుడే మజాపహిత్ రాజ్య స్థాపకుడు.
Gaja Mada
గజ మద అంటే భీముడు, శివుడు కలయిక అని నమ్ముతారు
జయనగర హత్య తర్వాత ఆయన సవతి సోదరి ‘త్రిభువన విజయతుంగా దేవీ’ రాణి అయ్యారు. ఆమెయే 1329లో గజమదను మహాపతి (ప్రధానమంత్రి)గా నియమించింది. అపుడే గజమద రాజ్యవిస్తరణ శపథం చేశాడు.
‘నూసాంతరను స్థాపించకపోతే, చుట్టుపక్కల రాజ్యాలను జయించకపోతే నేను పండ్లు తినను, ఉప్పుకారం మట్టను,’ అనేది ఆయన శపథం. ఈ శపథాన్ని ‘ఫలఫశపథం’ అని అంటారు.

“I will not taste any spice as long as I not unify Nusantara, I will not taste any spice. Before I conquer Gurun, Seram, Tanjungpura, Haru, Pahang, Dompo, Bali , Sunda, Palembang, Tumasik, I will never taste any spice.” (Source: newworldencyclopedia)

నగరక్రేత్రాగమ అనే పుస్తకంలో కూడా ‘నూసాంతర’ అనే మాట రికార్డయింది. 1275 కంటే ముందు ఈ ఆగ్రేయాసియా ద్వీపాలను ‘చక్రవాల మండల ద్వీపాంతర’ అని సింఘసారి రాజు కీర్తనగర ఘనంగా కీర్తించాడు.
మంగోలుల దాడులకు ప్రతిఘటించేందుకు ఆగ్నేయాసియా ద్వీపాలు ఏకం కావాలనేది ఆయన పిలుపు. అది గజ మద కాలంలో నిజమయింది.
ఇపుడు ఇండోనేషియా ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న కొత్త రాజధాని ‘నూసాంతర’ అక్కడి హిందూ చరిత్ర పునాదుల మీద నిలబడబోతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *