శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక
శ్రీశైలంలో కొలువు దీరిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల ఉచిత స్పర్శ దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని శ్రీశైలం ఆలయ ఈవో ముఖ్య ప్రకటన జారీ చేశారు.
ఇక ముందు ఉచిత స్పర్శ దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే వస్తేనే గర్భగుడిలోకి అనుమతిస్తారు. ఇది తప్పనిసరి. ఆదునిక వస్త్రాలు అంటే టీషర్టులు జీన్స్ ప్యాంట్స్, స్లీవ్ లెస్ బ్లౌజులతోొ ఆలయానికి రావడం నిషేధం. సాంప్రదాయక దోతితో పురుషులు, చీరెతో స్త్రీలు రావాలసి వుంటుంది.
సామాన్య భక్తుల అభ్యర్థన మేరకు ఉచిత స్పర్శ దర్శనాలను రోజుకు రెండు సార్లు కల్పిస్తున్నారు.
మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 6:30 నుంచి 7:30 గంటల వరకు సాధారణ భక్తులకు ఉచితంగా స్పర్శ దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. శ్రీశైలంలో ఫిబ్రవరి 22 నుంచి మార్చి 3 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఇవొ తెలిపారు.