ప్రపంచలో కోవిడ్ సోకిని దేశమయిన కూక్ ఐలెండ్స్ సరిహద్దులను పర్యాటకులకు తెరుస్తూ ఉంది. జనవరి 14 నుంచి పర్యాటక రావచ్చు. అయితే,మొదట న్యూజిల్యాండ్ వారికి స్వాగతం అంటున్న పసిఫిక్ భూతల స్వర్గం
ప్రపంచంలో కోవిడ్ లేని దేశాలున్నాయా?
నమ్మునమ్మకపో, కొన్నిదేశాలు తమ భూభాగంలలో కరోనా కేసుల్లేవని ప్రకటించాయి. చాలా మందికి ఈ విషయంలో అనుమానాలు ఉన్నా, ఉత్తర కొరియా, తుర్క్ మెనిస్తాన్ లు మాత్రం అధికారికంగా కరోనా లేదని ప్రకటించాయి. ఇలాగే కొన్నిద్వీప దేశాలు కూడా కరోనా లేదని ప్రకటించాయి. తువాలు (Tuvalu), నౌరు (Nauru), కూక్ ఐలెండ్స్ ఇదే కోవలోకి వస్తాయి.
ప్రపంచంలో అత్యంత సుందర ప్రదేశాలలో ఒకటైన కూక్స్ ఐలెండ్స్ జనవరి 14 నుంచి విదేశీ పర్యాటకులను అనుమతించాలని నిర్ణయించింది. అయితే, మొదట ఈ అవకాశం కేవలం న్యూజిల్యాండ్ పౌరులకు మాత్రమే లభిస్తుంది. తర్వాత ఆస్ట్రేలియా దేశీయులను అనుమతిస్తారు. ఆపైన ఒమిక్రాన్ ప్రభావం ఏమీ లేకపోతే ఇతర దేశాల పర్యాటకులను అనుమతిస్తారు.
జనవరి 14 నుంచి రెండుడోస్ ల వాక్సీన్ తీసుకున్న న్యూజిల్యాండ్ పౌరులను అనుమతించాలని ఆదేశం నిర్ణయించిందది. న్యూజిల్యాండ్ లో 2 ఒమిక్రాన్ కనిపించినా తమ నిర్ణయం మారలేదని ఆబుల్లి దేశం ప్రధాని మార్క్ బ్రౌన్ ప్రకటించారు. జనవరి 13న తమ సరిహద్దులను న్యూజిల్యాండ్ పర్యాటకుల కోసం తెరుస్తున్నామని చెప్పారు.
Mark Brown, Prime Minister,(Cook Islands News)
ప్యాండెమిక్ మొదలయినప్పటి నుంచి ఇప్పటి దాకా కూక్ ఐల్యాండ్స్ లోకి కరోనా వైరస్ దూరలేక పోయింది. నిజానికి ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి పర్యాటకుల తాకిడి చాలా ఎక్కువ ఉన్నదేశం ఇది. అయినా సరే, ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తల వల్ల ఈ పొలినీషియన్ దేశంలోకి కరోనా ప్రవేశించలేక పోయింది.
అయితే, మొన్న డిసెంబర్ న్యూజిల్యాండ్ లోని ఆక్ ల్యాండ్ నుంచి ‘రారొతోంగ’ ద్వీపానికి వచ్చిన ఒక పదేళ్ల బాలుడికి కోవిడ్ లక్షణాలు కనిపించాయి. అంతే, దేశమంతా అల్లకల్లోలమయింది. ఆందోళన చెందింది. రెండు సార్లు పరీక్షించారు. కోవిడ్ పాజిటిల్ అని తెలింది. మళ్లీ పరీక్షిస్తే నెగటివ్ అని రుజువయింది. అతని రక్తంలో వైరస్ కనిపించలేదు. హమ్మయ్య అని వూపిరింపీల్చుకున్నారు. అతగాడు వీక్ పాజిటివ్ అయి ఉంటాడని,అందుకే పరీక్షల జరపుతున్నప్పటికే నెగటివ్ అయ్యారని కొందరు చెబుతారు. ఏమయితేనేం, ఇప్పటికే ‘మేం కోవిడ్ రహిత దేశమే’నని ప్రకటించుకున్నారు.
ఇంతకీ కూక్ ఐల్యాండ్స్ దేశం ఎక్కడుంది?
ఇదొక దేశం కాని దేశం. ఐక్య రాజ్యసమితిలో సభ్యత్వం లేని దేశం. అంతేకాదు, ఇది నదులులేని దేశం కూడా. కాకపోతే, అక్కడక్కడ చిన్న చిన్న కాలువలు కనిపిస్తాయి.
పరిశ్రల్లేవు, కాలుష్యం లేదు. ప్రశాంత వాతావరణం. పర్యాటకుల సందడి తప్ప మరొక అలికిడి లేని నిర్మల ప్రదేశం. మధ్య మధ్య ప్రపంచం నలుమూల నుంచి పర్యాటకులను తీసుకువచ్చే విమానాల శబ్దం.
Capital Avarua/ source: Facebook Cook Island Travel
భూతల స్వర్గంగా పేరున్న ఈ చిన్న దేశం న్యూజిల్యాండ్ కు, హవాయి దీవులకు మధ్యఉంటుంది. ఇది 15 దీవుల సమాహారం. ఈ దేశ విస్తీర్ణం పసిఫిక్ మహాసముద్రంలో 20 లక్షల చదరపు మైళ్లు. జనాభా 17,564(2020).
ఈ దీవుల్లో పెద్ద దీవి రారోతోంగ (Rarotonga). అత్యంత సుందరమయిన పర్వత శ్రేణలతో ఈ దీవి కళకళలాడుతూఉంటుంది. భూమ్మీద ప్రకృతి పచ్చబొట్టులాగా మెరిసిపోతూ ఉంటుంది.అవారువా (Avarua)నగరం ఈ దేశం రాజధాని. అది కూడా ఈ దీవిలోనే ఉంటుంది. ఈ దీవుల్లో అయితుతాకి (Aitutaki Island ) దీవిలో పెద్ద లాగూన్ ఉంటుంది. దాని చుట్టూర అందమయిన కోరల్ రీఫ్స్, చిన్న చిన్న ఇసుకదీవులుంటాయి. ఇది కనువిందుచేసే ప్రదేశం.
అనగనగా ఒక దీవి, దీవి మొత్తం ఒక పచ్చల హారం. అంచుల వెంబడి కొబ్బరి చెట్ల తోపుల, చూట్టూరు ఇసుకబీచ్ లు, కోరల్ రీఫ్స్, లొతులేని సముద్ర తీరం. ఇదంతా ఒక పెయింటింగ్ అనుకోండి. దీనికి ఫ్రేం నీలాకాశం. ఇలాంటి తైలవర్ణచిత్రం ఎక్కడయినాఉందంటే అది కూక్స్ ఐల్యాండ్. ఇక్కడి వాతావరణం చక్కటి సమశీతోష్ణ వాతావరణం. ఇక, దీవుల సముద్రంలో 130 రకాల కోరల్స్, 600 రకాల చేపలు, తాబేళ్లు, రీఫ్ షార్క్స్, వేల్స్, డాల్సిన్స్ ఉంటాయి. ఈ దీవులు స్నోర్కెలింగ్, స్కూబా డైవింగ్ చాలా ప్రసిద్ధి.
ఈ దీవులకు వచ్చే పర్యాటకులు రకరకాల సాహసకృత్యాల్లో పాల్గొన వచ్చు. సముద్రంలో కి వెళ్లవచ్చు. దీవుల్లోని పర్వత ప్రాంతాల్లోకి పాకూతూ పోవచ్చు. ఇక్కడి ‘మేయిర్ నూయ్ ట్రాపికల్ గార్డెన్స్’ మొత్తం దేశానికి ప్రత్యేక ఆకర్షణ.
ఇక్కడి ప్రజలు పొలినీషియన్ జాతివారు. పర్యాటకులే వీళ్ల ఆర్థిక వనరు కాబట్టి, ప్రజలు స్నేహశీల స్వభావం అతిధ్యం అలవరచ్చుకున్నారు. ఇక్కడికొచ్చే పర్యాటకులంతా ఈ ప్రాంతాన్ని ఎంత ప్రశంసిస్తారో, ఇక్కడి ప్రజలను కూడా అంతే మనస్ఫూర్తిగా ప్రశంసిస్తారు. ఇది సైన్యం లేని దేశం.
ఈ దేశం గొప్పదనం
ఈ దేశమంతా 30 డాక్టర్లు, 96 మంది నర్సులున్నారు. 100 పడకలతో రెండు ఆసుపత్రులున్నాయి. రెండు వెంటిలేటర్స్ ఉన్నాయి. వీళ్లంతా కోవిడ్ వైరస్ ప్రవేశించకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని విజయవంతమయ్యారు. దేశం సరిహద్దులు చాలా సురక్షితమయినవి, ఇక్కడ పర్యాటకం కూడా అంతే సురక్షితమయింది. ఈ దేశం రక్షణ విదేశీ వ్యవహారాలను న్యూజిల్యాండ్ చూస్తుంది.
ఇక్కడి ప్రజల తలసరి ఆదాయం 21,884 అమెరికన్ డాలర్లు. అయితే 51 దేశాలలో ఈ దేశం స్వతంత్రంగా దౌత్య సంబంధాలను ఏర్పరుచుకుంది. బ్రిటిష్ రాణియే ఈ దేశాధినేత. ఆమె తరఫున ఒక ప్రతినిధి ఇక్కడ ఉంటారు. పరిపాలన ప్రధాని నాయకత్వంలోని క్యాబినెట్ చూసుకుంటుంది. 1964 లో ఈదేశం రాజ్యాంగాన్ని తయారుచేసుకుని ఆమోదించింది. ఈదేశంలో కూక్ ఐలాండ్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ అనే రెండు రాజకీయ పార్టీలున్నాయి. విద్య ఉచితం.
10 విమానాశ్రయాలు
ఈ చిన్న దేశంలో 10 విమనాశ్రయాలున్నాయి. అందులో రారోతోంగ లో ఉన్నది అంతర్జాతీయ విమానాశ్రయాలు. ఇక్కడికి యేడాదికి లక్ష మంది దాకా పర్యాటకులు వస్తుంటారు. భారతదేశంలో నుంచి నేరుగా కుక్ ఐల్యాండ్స్ కు విమాన సర్వీసులున్నాయి.