భారీ అంచనాల మధ్య పుష్ప పార్ట్ 1 శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాకి డివైట్ టాక్ రావడం చిత్ర టీమ్ ని, బన్నీ అభిమానుల్నీ టెన్షన్ లో పడేసింది
. మూడు గంటల పాటు సాగిన సినిమా ఇది. సీన్లు లెంగ్తీగా ఉండడం, క్యారెక్టర్లు ఎక్కువైపోవడం ప్రధాన సమస్యగా మారిందని టాక్ వినిపించింది. మరో ప్రక్క సుకుమార్ సినిమాలకు ఉండే ఫ్యామిలీ ఆడియన్స్ కు కొన్ని సీన్స్ ఇబ్బందిగా మారాయి. వాటిలో కొన్ని తొలిగిస్తున్నట్లు సమాచారం. మొదటగా ఈ సినిమాలో వచ్చే టిఫెన్ సీన్ ని తీసేస్తున్నారని వినికిడి.
‘పుష్ప’ సినిమాలో హీరో, హీరోయిన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు కొంత డిఫెరెంట్ గా ఉన్నాయనే చెప్పొచ్చు. కొన్ని సీన్లు మంచి కామెడీ పండించాయి. అలాగే, కొన్ని ఇబ్బందికరంగా అనిపించాయి. అలా వాటిలో ఒకటి…
పుష్ప సినిమాలో వచ్చే ఈ ‘టిఫిన్’ సీన్ హీరో క్యారక్టరైజేషన్ వైపు నుంచి చూస్తే ఫెరఫెక్ట్ గానే అనిపిస్తుంది. యూత్ కు కూడా నచ్చింది. ఆ సీన్ ఏమిటంటే… హీరో తన మారుతి కార్లో కూర్చొని ఉంటాడు. అతనికి తన వీపు ఆనించి హీరోయిన్ కూర్చుంటుంది. హీరో ఆమె భుజం మీద నుంచి చెయ్యి వేస్తాడు. ఆమె ‘అక్కడి నుంచి’ చెయ్యి తీయమని చెప్తుంటుంది. అతను తియ్యడు. అతను ఎక్కడ చెయ్యి వేశాడో, ఏమి చేస్తున్నాడో అందరికీ అర్థం అయ్యేలా ఉంటుంది సీన్.
అయితే ఆ సీన్ ..ఇంకా ఎవరికైనా అర్థం కాదని డౌట్ వచ్చి, హీరోయిన్ కారులోనుంచి బయటికి వచ్చాక హీరోయిన్ ఫ్రెండ్ ఒక డైలాగ్ చెప్తుంది. హీరోయిన్ తల్లి హీరోని ఇంట్లోకి వచ్చి టిఫిన్ చేసి వెళ్ళమని అడిగిన వెంటన్ ఆ హీరోయిన్ ఫ్రెండ్ ఇప్పుడే ‘టిఫిన్’ చేశాడులే అంటుంది. అంటే కారులో ఏమి జరిగిందో అర్థం కానీ వాళ్ళకి కూడా తెలిసేలా ఆ డైలాగ్ తో చేసారు. అయితే ఆ సీన్ పై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆ సన్నివేశాన్ని ఇప్పుడు సినిమాలో నుంచి తొలిగించాలని నిర్ణయించారని సమాచారం