రిజిస్ట్రార్ ఆఫీసుల్లో దళారుల నిషేధం

అమలవుతుందో లేదో కాని ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దళారులను, మధ్యవర్తులను,బ్రోకర్లను నిషేధించింది.పైకి ఇది చాలా మంచి నిర్ణయం.
దేశంలో బాగా అవితీనిమయమయిన రాష్ట్రాల జాబితాలో తెలుగు రాష్ట్రాలో టాప్ 5 లో ఉన్నాయి. ఇటుపక్క ప్రత్యేక తెలంగాణ వచ్చినా, నవ్యాంధ్ర అని  అటుపక్క వాళ్లు ముద్దుగా పిల్చకుంటున్నా రెండు రాష్ట్రాలలో ఉమ్మడి నాటికి ఇప్పటికి మారకుండా మారుమ్రోగుతున్నది అవినీతియే. 2018లో తెలంగాణాలో అవినీతిలో రెండో ర్యాంకులో ఉంటే ఆంధ్ర ప్రదేశ్ నాలుగో ర్యాంకులో ఉండింది. 2019 నాటికి పరిస్థితి కొంత మెరుగుపడింది. అవినీతిలో   తెలంగాణా అయిదో స్థానంలో దిగింది. ఆంధ్రప్రదేశ్ 13వ స్థానానికి చేరింది. ఈ సర్వేను ట్రాన్స్ఫ రెన్సీ ఇంటర్నేషనల్ (Transparency International) నిర్వహించింది.
డబ్బులు ఇవ్వకుండా ఏ పని జరుగదు ఈ రాష్ట్రాలు, బహుశా బయటకూడా ఇలాగే ఉంటుంది. టాప్ ర్యాంక్ మనదే కాబట్టి ఇతర రాష్ట్రాలలో ఇంత అవినీతి వుండదనే అర్థం. డబ్బులు ఇవ్వకపోతే, ఏదో ఒక లోపంతో కుల ధృవీకరణ సర్టిఫికేట్ కూడా రాదు. రెవిన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, మునిసిపాలిటి, విద్యుత్ పోలీసు శాఖలు అవినీతిలో అగ్రభాగాన ఉన్నాయి.
అవినీతి సొమ్ము కిందినుంచి పైదాకా పోతుంది. అందువల్ల అవినీతి నిర్మూలన అనేది సాధ్యం కాదు. అన్ని చోట్ల బ్రోకర్లు తయారయ్యారు. వాళ్లు ప్రతిపనికి ఒక రేట్ ఫిక్స్ చేశారు. ఆడబ్బు చెల్లిస్తే, మీ ప్రమేయం లేకుండా ఏ సర్టిఫికేట్ అయినా వస్తుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయం కారడవి. అక్కడ ఏది ఏమిటో, ఎవరో అలగా జనానికి తెలియదు. అందువల్ల డాక్యుమెంట్ రైటర్ మాత్రమే ఆ కారడవిలో అయిదు నిమిషాల్లో ఏ పనైనా చేయగలడు. అందువల్ల జిీవితలో ఎపుడో ఒక సారి రిజస్ట్రార్ ఆఫీస్ కు వెళ్లే ప్రజలకు డాక్యుమెంట్ రైటర్ ఒక్కడే మోక్ష ప్రదాత. ఆయన రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకుని, తన చార్జ్ తీసుకుని, ఆపైన ‘సార్ ’ కి అంటూ లంచం ఫిక్స్ చేస్తాడు. అదివ్వకపోతే, రూల్ ప్రకారం వెళ్తానంటాడు. రూల్ ప్రకారం వెళ్లు లక్ష లొసుగులుంటాయి. సార్ కి ఇచ్చేది చెల్లిస్తే రెండు రోజుల్లో నిశ్చింత గా డాాక్యుమెంట్ చేతికొస్తుంది. అవినీతిదేశాలలో చదువురాని వాళ్లకు, ప్రభుత్వం నియమాలగురించి తెలియని వారికి అవినీతి అనేది ‘దేవుడిచ్చిన వరం’.
అందుకే రిజస్ట్రార్ ఆఫీసులో అటు ఇటూ హడావిడిగా ఆనంతంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా తిరుగుతూ డాక్యుమెంట్ రైటర్లు కనిపిస్తారు. వాళ్లకి అన్ని డోర్లు తెరిచి ఆఫీసు సిబ్బంది సాయపడ్తూ ఉంటారు. ఇలాంటి చోట ఇపుడు దళారులను నిషేధిస్తున్నారు. దళారులెవరు? డాక్యమెంట్ రైటర్లే కదా? వాళ్లని నిషేధించగలరా?
 అయితే, నిషేధిస్తూ జీవొ ఇచ్చారు.
ఇక మీదట డాక్యుమెంట్ రైటర్లను, దళారులను, మధ్యవర్తులను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయల్లోకి అనుమతించవద్దని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ  చేసింది. స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖ ఈ ఉత్తర్వులను జారీ చేసింది. అలా అనుమతిస్తే సంబందిత సబ్ రిజిస్ట్రార్ పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా ఉత్తర్వులలో పేర్కొంది.
It has come to the notice of  Commissioner and Inspector General of Registration and Stamps, A, Vijayawada,  time and again that the ACB authorities mentioning the fact of seizing Unaccounted Money from the unauthorized document writers/Stamp Vendors/ Private Persons etc during ACB surprise checks conducted at sub-registrar offices.
అందువల్ల బ్రోకర్లను రానీయవద్దని సబ్ రిజిస్ట్రార్  లకు సూచనలివ్వాలని డిఐజిలకు, జిల్లా రిజిస్ట్రేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు..
“…  to instruct the Sub Registrars under their control not allow entry of unauthorized persons including brokers/ touts/ mediators and document writers into the offices  and also  if these instructions are not adhered to strictly, drastic actions will be taken against them.”
Document writers
Document Writers GO
అంతా వర్క్ ఫ్రమ్ హోం (WFH)నడుస్తున్న ఈ రోజుల్లో బ్రోకర్లు, మధ్యవర్తులు  రిజస్ట్రేషన్ కార్యాలయాలకు రావలసిన అవసరమేముంటుంది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *