సిపిఎం రాష్ట్ర 26వ మహాసభలు ఈనెల 27, 28, 29 తేదీలలో తాడేపల్లి పట్టణ పరిధిలోని సి ఎస్ ఆర్ కళ్యాణమండపంలో జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో సామాజిక సమస్యలపై రెండు నిమిషాలు షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహిస్తున్నారు. టి ఎస్ ఎఫ్ ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి వి ఎస్ ఎస్ రాజు మంగళగిరి సిపిఎం కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 19 తేదీన మంగళగిరి పట్టణంలోని మార్కండేయ కళ్యాణ మండపంలో మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇరవై సామాజిక సమస్యలపై ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండు నిమిషాల వ్యవధిలోనే సినిమా ఉండాలని తెలిపారు. అవినీతి, నిరుద్యోగం, మహిళలపై అత్యాచారాలు, కార్మిక, రైతాంగ సమస్యలపై ఇంకా ఇతర సామాజిక సమస్యలపై పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
30 షార్ట్ ఫిలిం లను 19 తేదీన మార్కండేయ కళ్యాణ మండపంలో ప్రదర్శించడం జరుగుతుంది తెలిపారు. న్యాయనిర్ణేతగా గుంటూరు జిల్లాకు చెందిన రామ్ భీమన వ్యవహరిస్తారని తెలిపారు.
పోటీల్లో పాల్గొన్న విజేతలైన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రథమ బహుమతి పదివేల రూపాయలు, రెండో బహుమతి ఏడు వేల రూపాయలు, మూడవ బహుమతి ఐదు వేల రూపాయలు, కన్సల్టేషన్ మూడు బహుమతులు 2500 రూపాయలు చొప్పున అందజేయడం జరుగుతుందని తెలిపారు.
అదే విధంగా ముఖ్యఅతిథిగా ప్రముఖ సినీ నటులు అజయ్ ఘోష్ పాల్గొంటారని తెలిపారు. సిపిఎం గుంటూరు తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ సమకాలిన సమస్యల పైన, పోరాటాలు, ఆందోళనలు చేసిన వాటిని షార్ట్ ఫిలిం ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సిపిఎం అనేక పోరాటాలు ప్రజల సమస్యల పరిష్కారానికై నిర్వహించిందని తెలిపారు. ఈ నెల 19న జరిగే పోటీల కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శి జె వి రాఘవులు మాట్లాడుతూ సినిమాల ప్రభావం ప్రజలపై పడుతుందని అన్నారు. ప్రజా సమస్యలపై సిపిఎం చేసిన పోరాటాలను ప్రజలకు అర్థమయ్యేలా షార్ట్ ఫిలిమ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమ్యూనిస్టు ఐక్యవేదిక నాయకులు రేకా కృష్ణార్జున రావు, ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కె వి ఎస్ సాయి ప్రసాద్ సాద్, ప్రముఖ న్యాయవాది కె వి ప్రసాద్, నిర్మల జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ వెంకట ప్రసాద్, ఉద్యమ కవి గోలి మధు, సందుపట్ల భూపతి, రాష్ట్ర నలుమూలల నుండి ఇ కళాకారులు పాల్గొంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి పి ప్రసాద్, సిపిఎం గుంటూరు తూర్పు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ ఎస్ చెంగయ్య, సిపిఎం పట్టణ కార్యదర్శి వై కమలాకర్, పట్టణ నాయకులు టి శ్రీరాములు, ఏం బాలాజీ తదితరులు పాల్గొన్నారు.