ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగుల 11వ PRC అమలు, DA బకాయిల చెల్లింపు, CPS రద్దు, కాంట్రాక్ట్ & గ్రామ సచివాలయ ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఉద్యోగుల లోన్లు, అడ్వాన్సుల చెల్లింపు షెడ్యూలు మరియు ఆర్టీసీ తదితర ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు ఇరు JAC లు “AP JAC మరియు AP JAC అమరావతి ఐక్య వేదిక” పక్షాన 07/12/2021 నుండి ఉద్యమ కార్యాచరణ ప్రారంభమై ఈ రోజు (09.12.2021) కు మూడవరోజు కు చేరుకుంది.
“AP JAC మరియు AP JAC అమరావతి ఐక్య వేదిక” నాయకులు బండి శ్రీనివాస రావు మరియు బొప్పరాజు వెంకటేశ్వర్లు
1. విజయవాడ నగరము, గాంధీనగర్ లోని తహశీల్దార్ కార్యాలయం వద్ద, 2. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ వద్ద, 3. PTD ఎంప్లాయిస్ యూనియన్ వారి ఆధ్వర్యంలో విజయవాడ నగరము లోని విధ్యాధరపురం ఆర్టీసీ డిపో వద్ద హాజరై ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు,వారి డిమాండ్లను ఉద్దేశించి మరియు ఉద్యమ కార్యాచరణకు దారితీసిన పరిస్థితుల గురించి మాట్లాడటం జరిగింది.
11వ PRC అమలు అనేది 71 డిమాండ్లలో ఒక అంశం మాత్రమేనని , అదే ఉద్యోగుల యొక్క ప్రధాన అంశం కాదని PRC అమలు జరిపినంత మాత్రాన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు అన్ని గట్టేక్కినట్లు కాదనీ. అలా అని సమస్యలు అన్ని రాత్రికి రాత్రి పరిష్కారం చూపమనడం లేదని. 27.10.2021 నాడు AP JAC మరియు AP JAC అమరావతి ఐక్య వేదిక తరుపున గౌరవ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గార్కి సమర్పించిన మెమొరాండం లోని 71 సమస్యలు / డిమాండ్లను ఖచ్చితముగా పరిష్కరించాలని వాటిని పరిష్కరించుటకు రాష్ట్రములో అతి పెద్ద జే.ఎ.సి లైన AP JAC & AP JAC అమరావతి ఐక్యవేదిక నాయకులతో చర్చించి… సమస్యల పరిష్కారానికి ఎంత సమయం పడుతుంది, ఇబ్బందులేమిటి చర్చించి నాయకులకు సరియైన హామీ ఇవ్వటం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమ నివారణకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ ఉద్యమము ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నుండి వచ్చినదే తప్ప నాయకులు పూనుకుని చేస్తున్న ఉద్యమం కాదనీ. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము మొండి వైఖరిని వీడనట్లైతే ఉద్యోగులు ఈ కార్యాచరణను తీవ్రస్థాయికి తీసుకువెళ్ళే అవకాశము ఉందని తెలియజేసారు.
KV శివా రెడ్డి, AP NGOs రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & Dy సెక్రెటరీ జనరల్, AP JAC.
AP NGO’s రాష్ట్ర ప్రధాన కార్యదర్శి K V శివారెడ్డి మాట్లాడుతూ ఈ రోజు ఈరెండు జేఏసీల ఐక్యవేదిక చేస్తున్న పోరాటానికి ఈ నాటినుండి మద్దతుగా ఉద్యమంలో పంచాయతీ సెక్రెటరీస్ అసోసియేషన్ అధ్యక్షుడు Y V D ప్రసాద్, జనరల్ సెక్రెటరీ G T Vరమణ విజయవాడ తాలూకా కార్యాలయం వద్ద జరిగిన ఉద్యమంలో పాల్గొని ప్రసంగిస్తూ భవిష్యత్తు లో జరిగే అన్ని కార్యక్రమాలలో మా సంఘ సభ్యులు పాల్గొంటారని తెలియచేశారు.
ఈ రోజు జరిగిన కార్యక్రమాలలో కృష్ణా జిల్లా jac అమరావతి ఛైర్మన్ డి ఈశ్వర్, తూర్పు కృష్ణా JAC ఛైర్మన్ ఉల్లి కృష్ణా, పశ్చిమ కృష్ణా Jac చైర్మన్ ఏ విద్యాసాగర్,ఇక్బాల్ సి టి Jac కన్వీనర్ పి సూర్యనారాయణ రెడ్డి apngos association రాష్ట్ర కార్యదర్సులు తదితరులు పాల్గొన్నారు.
ఈ రోజు జరిగిన జిల్లాలలో చేపట్టిన కార్యక్రమాలు:
అనంతపురములో జిల్లాలో: ప్రభుత్వ ఆసుపత్రి, RTC డిపో నందు ఉద్యోగులతో కలసి నల్ల బ్లాడ్జెస్ ను ధరించి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు, కాంట్రాక్ట్, పొరుగు సేవల ఉద్యోగుల నాయమైన హక్కుల సాధన కొరకు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమము లో R. N. దివాకర్ రావు, చైర్మన్ APJAC అమరావతి, Y. అతావుల్లా, చైర్మన్ , APJAC, B. చంద్రశేఖర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ, APJAC, రవి కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్, APNGOs, అనంతపురము శాఖ.
కడప జిల్లాలో
విజయనగరం జిల్లాలో…
తూర్పుగోదావరి జిల్లాలో…
గుంటూరు జిల్లాలో
నెల్లూరు జిల్లాలో
కర్నూలు జిల్లాలో
పశ్చిమగోదావరి జిల్లాలో
ప్రకాశం జిల్లాలో