ప్రపంచంలోని చక్రవర్తులలో ఔరంగజేబు అత్యంత ధనవంతుడు. 1700 నాటి మొగల్ సంపద గురించి విన్నాక బ్రిటిష్ వాళ్ల కళ్లు తిరిగిపోయాయి. యూరోప్ , చైనాల మొత్తం సంపద కలిపినా మొగల్ సంపదకు సాటికాదు. అప్పటి సంపద నేటి విలువ 21 ట్రిలియన్ డాలర్లతో సమానమని లెక్క కట్టారు. ఔరంగజేబు కాలానికి ప్రపంచంలో పారిశ్రామికంగా భారత్ యే నెంబర్ వన్. దీనితోనే మొగల్ (Mogul) అనే మాట ఇంగ్లీష్ డిక్సనరీలో చేరింది. ఈ మాటకు అర్థం ఆయా రంగాంలలో అగ్రశ్రేణినాయకుడని అర్థం. ఉదాహరకు రియల్ ఎస్టేట్ మొగల్ (Real estate mogul) అనే మాట.మొగల్ సామ్రాజ్యం ప్రపంచానికి ఎగుమతి చేయని సరుకుల్లేవు. అందులో అత్యంత విలువయినవి వజ్రాలు. తర్వాత సిల్కువస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు వస్తాయి. ఔరంగజేబు సంపద పరాకాష్టకు చేరుకోవడం వ్రజాల సేకరణతో మొదలయింది. దానికి కారణం గోల్కొండ. గోల్కొండతోనే స్వాదీనం కావడంతోనే ఔరంగ జేబు జన్మధన్యమయింది. ఎందుకంటే, ఆయన ఎంత ధనవంతుడయినా, ఒక కొరత ఉంది. అదే వజ్రాలు లేని కొరత. ఆ కొరత 1687 సెప్టెంబర్జతో తీరింది. ఆ రోజుల్లో ప్రపంచ వజ్రాల రాజధాని (Diamond Capital) గోల్కొండ యే. 1725 కంటే పాత వజ్రాలు ప్రపంచంలో ఎక్కడ, ఎవరి దగ్గిర ఉన్నా అవి గోల్కొండ వజ్రాజలే. ప్రపంచ నలుమూలలకు వజ్రాలు పంపిస్తున్న ఏకైక రాజ్యం గోల్కొండయే. ప్రపంచంలో వజ్రపుగనులున్న ఏకైక రాజ్యం కూడా గోల్కొండయే. వజ్రాల గనులే కాదు, వజ్రాలను సానబట్టే పరిశ్రమ కూడా ఇక్కడే రావడంతో చార్ మినార్ ఆరోజుల్లో ఇంటర్నేషన్ డైమండ్ మార్కెట్ అయింది. అందుకే నాలుగున్నర శతాబ్దాల కిందట గోల్కొండ గోబలైజ్ (Globalization of Golconda) అయింది అని ప్రముఖ జర్నలిస్టు డాక్టర్ సంజయ్ బారు అన్నారు. దీనితో గోల్కొండ సంపన్న దేశంగా నిగనిగలాడుతుూ ఉంది. బలమయిన కోట, వజ్రాల వ్యాపారం, సిల్క్ వస్త్రాల వ్యాపారం, ఓడరేవులతో గోల్కొండ రాజ్యం ఔరంగజేబు కు కంగగింపుగా మారింది. ఈ రాజ్యాన్నిస్వాదీనం చేసుకోవాలి, వ్రజాలను సొంతం చేసుకోవాలి. అనుకున్నది సాధించాడు. వజ్రాలు వచ్చి చేరడంతో ప్రంపంచంలోనే అంత్యంత సంపన్న చక్రవర్తి అయ్యాడు. అయితే, గోల్కొండను జయించడం అంతసులువుకాదు. ఔరంగజేబు స్వయంగా బాగనగర్ వచ్చి అక్కడ తిష్ట వేసి, సైనికులను ఉత్తేజ పరుస్తూ,లంచాలు ఇచ్చి ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, స్వయంగా కోట దాడులను పర్యవేక్షిస్తూ ఆరునెలలు గడిపాడు. ఈ ఫోటో అదే. ఈ ఫోటో 18 వ శతాబ్దంలో ఎవరో అనామక చిత్రకారుడు వేసిన పెయింటింగ్. ఇందులో ఔరంగజేబు గోల్కొండ నేపథ్యంలో సైనికుల మధ్య కూర్చుని ఉండటం కనిపిస్తుంది. ఈ కధేందో చూద్దాం.
గోల్కొండ వజ్రాలు
సాంస్కృతికంగా హైదరాబాద్ కు మారుపేరు చార్మినార్. 16వ శతాబ్దంలో భారతదేశంలో నిర్మాణమయినభారీ కట్టడం ఇదే అని చెబుతారు. చార్మిమినార్ చారిత్రక ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. చార్మినార్ తో హైదరాబాద్ చరిత్రలో ఒక కొత్త చాప్టర్ మొదలయింది, చార్ మినార్ ను కట్టించింది కుతుబ్ షాహి పాలకులు. కొందరేమో ఇది ప్రమే చిహ్నం అంటారు. కొందరేమో ఇదొక రచ్చబండ అంటారు.చార్మిమినార్ ఏంటని ఎపుడరైనా హైదరాబాద్ పాతబస్తీలో ఇరానీ చాయ్ తాగుతూ వాకబుచేయండి, ఎన్నికథలు వినబడతాయో తెలుస్తుంది.
గోల్కొండ రాజ్యం ప్రపంచంలోనే ధనవంతమయిన చిన్న రాజ్యంగా పేరుండేది. ప్రపంచంలో కాదనుకుంటే, కనీసం, భారతదేశంలో అత్యంత ధనిక రాజ్యమదే. గోల్కొండ రాజ్యం పెద్ద వాణిజ్యం కేంద్రం కూడా. దీనికి కారణమేమిటో తెలుసా? గుంటూరు జిల్లాలోని కొల్లూరు, కర్నూలు జిల్లా రామళ్లకోటతో పాటు అక్కడక్కడే ఉండే వజ్రాల గనులు, ఆంధ్ర ప్రాంతంలో నేసే అద్భతమయిన సిల్క్ ,నూలు వస్త్రాలే. ఈ ప్రాంతాలన్నీ అపుడు గోల్కొండ పాలనలోనే ఉండేవి. 18 వ శతాబ్దంలో బ్రెజీలియన్ డైమండ్స్ ను కనుక్కునే వరకు ప్రపంచానికి వజ్రాలను సరఫరా చేసింది గోల్కండయే. పశ్చిమదేశాలలో మొట్టమొదట డైమండ్లను ఉత్పత్తి చేసిన దేశం బ్రెజిలే. ఆ తర్వాతే వజ్రాల సీన్ ఆఫ్రికాకు మళ్లింది.
గోల్కొం రాజ్యంలోని 23 వజ్రాల గనుల్లో దాదాపు 30వేలమంది కూలీలు పని చేశే వారని రికార్డుల కెక్కింది. పక్కనే ఉన్న బీజాజపూర్ రాజ్యంలో మరొక 15 గనులుండేవట.
భారతదేశపు వజ్రాలు రెండు వేల సంవత్సరాలు ప్రపంచ వాణిజ్యాన్ని నడిపించాయి. అవన్నీ గోల్కండ వజ్రాలే. చార్మినార్ చుట్టూర అపుడు ‘బాగ్ నగర్’ అనే పట్టణం (ఇపుడు హైదరాబాద్) వెలసింది. అక్కడంతా నవాబు అస్థానం ఉన్నతాధికారులు, రాజవంశీకులు, మంత్రులు, సైనికాధికారులు మాత్రమే నివసించేవారు. పొద్దున పది గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు, అయిదు దాకా ఈ నగరం విదేశీ వజ్రాల వ్యాపారులతో, బ్రోకర్లతో నిండిపోయి ఉండేదని జో బటీస్ట టెవర్నీర్(Jean-Baptiste Tavernier) తన పుస్తకంలో రాశారు.
హైదరాబాద్ నగరం ఎలా ఏర్పడిందనుకుంటున్నారు? విపరీతమయిన సంపద వచ్చిపోగతూ ఉండటంతో గోల్కొండ జనాభా పెరిగిపోయింది. ఇరుకయిపోయింది. కలరా వంటి అంటువ్యాధులు రావడం మొదలయింది. అపుడు అక్కడి సంపన్నులంతా గోల్కొండ బయటవకు వచ్చి ఇపుడు హైదరాబాద్ పాత బస్తీ ఉన్న ప్రాంతంలో భారీ ఫార్మ్ హౌస్ లను కట్టుకున్నారు. మూసీ నది ఒడ్డున ఈ భారీ ఫామ్ హౌస్ లుండేవి. అందుకే హైదరాబాద్ ను అపుడు ‘బాగ్ నగర్’ అనేవారు. తొలినాళ్ల మ్యాపులలో బాగ్ నగరే అనే ఉంటుంది. ఇదే తర్వాత భాగ్యనగరం అయిందేమో. ఈ కొత్తనగరాన్ని అందంగా నిర్మించే బాధ్యతను అప్పటి పాలకుడు మహమ్మద్ కులీ కుతు షా మీర్ తన పేష్వా మోమిన్ ఆస్తబాదీ కుఅప్పగించాడు. ఆయన ఇరాన్ నుంచి వచ్చిన వాడు. (ఇరాన్ కు గోల్కొడ నవాబులుకు ఉన్న సంబంధం ఏంటో తెలుసు. ఇరాన్ షియా ముస్లింల పవిత్రభూమి. గోల్కొండ పాలకులు కూడా షియాలే. అంతేకాదు, వాళ్లు ఇరాన్ షా కు విధేయులు ఉండు వారు. అందుకే సున్నీలయిన మొగల్ చక్రవర్తులతో ఇష్టపడే వారు కాదు.)
ఇరాన్ నగర నిర్మాణాలతో ముఖ్యంగా అపుడపుడే నిర్మించిన ఇస్ఫాన్ అనేనగర నిర్మాణంతో అనుభవం ఉన్నవాడు. ఆయన అదే నమూనాలో దక్కన్ లో కూడా కొత్త ఇస్ఫాన్ ( Ishahn-i- Nau)నిర్మించే అవకాశం దొరికిందనుకున్నాడు. చార్ మినార్ కేంద్రంగా ఈ నగర నిర్మాణం మొదలయింది. ఇక్కడి నుంచి నాలుగు జాతీయ రహదారులు నాలుగు దిక్కులకు వెళతాయి. అంటే నగరం నాలుగు భాగాలుగా విడివడి కనిపిస్తుంది. ఇందులో ఈశాన్యం సంపన్నులు ఉండే ప్రాంతం. ఇక్కడ దాదాపు 14 వేల దుకాణాలు, విశ్రాంతి గృహాలు, స్నానశాలలు, పాఠశాలలు ఉండేవి. ఈ కొత్త నగరానికి హైదరాబాద్ అని ప్రవక్త మహమ్మద్ అల్లుడు అలీ పేరు మీద నామకరణం చేశారు. అలీ కి హైదర్ అని పేరుండేది. హైదర్అంటే సింహం. సరే ఇదొక కథ.
1687 సెప్టంబర్ లో మొగలు చక్రవర్తి ఔరంగజేబు సైన్యాలు గోల్కొండ రాజ్యాన్నివశపర్చుకోవడంతో గోల్కొండ రాజ్యం ఒక అధ్యాయం ముగిసింది. మరొక అధ్యాయం మొదలయింది. ఔరంగజేజు ఈ రాజ్యం రాజధానిని గోల్కొండ నుంచి ఔరంగాబాద్ కు మార్చారు. దీనితో హైదరాబాద్ నగర ప్రాముఖ్యం పడిపోయింది. చార్ మినార్ కు కూడా కష్టాలొచ్చాయి. పిడుగుపడి నైరుతి మినార్ బాగా దెబ్బతినింది. పరాయి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపింది. అపుడొక సంఘటన జరిగింది. హైదరాబాద్ లోని ఒక సంపన్న వజ్రాల వ్యాపారి చనిపోయాడు. ఆయనకు వారసులెవరూ లేరు. దీనితో ఆయన దూరంపు బంధువయిన దిల్ బహదూర్ ఖాన్ అనే మొగల్ సుబేదార్ కు ఆయన ఆస్తిసంక్రమించింది. ఈ ఆస్తి విలువ ఆరోజే రు.1,25,000. దిల్ బహదూర్ ఖాన్ పెద్ద మనసు చేసుకుని ఇందులో రు. 60 వేలు ఖర్చు చేసి మినార్ మరమ్మతు చేశారు. అంతేకాదు, మిగతా మొత్తాన్ని ఆయన వితరణ కార్యక్రమాల మీద ఖర్చు చేశారు.
తర్వాత ఎపుడో 1750లో గాని హైదరాబాద్ నగరానికి మంచిరోజులు రాలేదు. ఆ యేడాది సలాబద్ జంగ్ (1751-1762) లో ఫ్రెంచ్ ఈస్టిండియా కంపెనీ సహకారంతో నిజామ్ అయ్యారు. అసఫ్ జాహి పాలన మొదలయింది. ఆయన రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్ కు మార్చారు. మళ్లీ చార్ మినార్ కు మంచిరోజులు వచ్చాయి. హైదరాబాద్ నగరానికి మారుపేరు అయింది. చార్ మినార్ అన్ని చోట్ల ప్రత్యక్షమయింది. నాణాలమీద, రాజముద్రికల మీద, హైదరాబాద్ పోలీసుల బాడ్జి మీద కూడాచార్ మినార్ బొమ్మ ఉండేది.
గోల్కొండ పతనం (Seige of Golconda)
గోల్కొండ ఔరంగజేబుకు అంత సులభంగా లొంగిరాలేదు. అపుడుగోల్కొండ నవాబు అబుల్ హసన్ తానా షా. ఆయన ఔరంగజేబును ఖాతరుచేయలేదు. గోల్కొండ కోట్ శత్రుదుర్బేధ్యమయింది. యుద్దంలో జయించడం సాధ్యంకా లేదు. అపుడు మహమ్మద్ ఇబ్రహీం అనే జనరల్ కు లంచం, పదవి ఎర చూపి ఔరంగజేబు తనవైపు తిప్పుకున్నాడు. అపుడుగాని కోటలోకి ప్రవేశించడం చేతకాలేదు. ఎనిమిని నెలల యుద్ధంలో చేయలేనిపనిని రాజద్రోహం ఒక్క రోజులో చేయగలిగింది. మొగల్ సేనలు కోటలోకి ప్రవేశించడంతో 40 సంవత్సరాల ఔరంగజేబు కలనెలవేరిందని మాడిసన్, విస్కాన్ సిన్ యూని వర్శిటీకి చెందిన చరిత్రకారుడు జెఎప్ రిచర్డ్స్ రాశారు. కోటలో ప్రవేశించిన మొగలు సేనలు అబుల్ హసన్ బందీగా పట్టుకున్నాయి. ఆయనను దౌలతాబాద్ కు ఖైదీగా పింపించారు. దీనితో గోల్కొండ మొగల్ సామ్రాజ్యం లో దారుల్ జహాద్ (Dar-ul Jahad) అనే రాష్ట్రంగా మారింది. దీనికి గవర్నర్ గా ఫిరాయింపుదారు మహమ్మద్ ఇబ్రహీమ్ నే ఔరంగజేబు నియమించాడు. గోల్కొండు బలహీన పరిచేందుకు హైదరాబాద్ కర్నాటక భూభాగాన్ని విడదీసి ప్రత్యేక సామంతుని నియమించాడు.
అబుల్ హసన్ ఓడిపోయాక…
అబుల్ హసన్ ను లొంగిపొమ్మని చాలా సార్లు ఔరంగజేబు హెచ్చరించాడు. గోల్కొండ నవాబు దగ్గిర ఉన్న వజ్రాలు (నూరుల్ ఐన్ డైమండ్, , గ్రేట్ డైమండ్, కారా డైమండ్ , దర్యా ఇడైమండ్ ,దిహోప్ డైమండ్ , విటిల్ బ్యాక్ డైమండ్, రెజెంట్ డైమండ్) ఇచ్చి లొంగిపోయేందుకు ఔరంగజేబు పెట్టిన షరతు పెట్టాడు అబుల్ హసన్ మాట వినలేదు. యుద్దానికే సిద్ధమయ్యాడు. చివరకు ద్రోహుల వల్ల ఔరంగజేబులో చేతిలో బందీ అయ్యాడు. గుంటూరు, కర్నూలు తదితర కృష్ణా బేసిన లోని వ్రజాల గునుల నుంచి వచ్చిన అమూల్యమయిన వజ్రాలు చేతికందడంతో ఔరంగజేబు ఇంకా సంపన్నుడయి ప్రపంచంలోనే నంబర్ వన్ ధనవంతయ్యాడు. ఒక లెక్కప్రకారం ఔరంగజేబు సంపద (Wealth of Aurangzeb) 250 బిలియన్ డాలర్లు.
ఫోటో గురించి
Title: Emperor Aurangzeb at the Siege of Golconda, 1687.
Summary: This gouache painting was created by an unknown Indian artist sometime in the mid-to-late 18th century, but it depicts an earlier event: the siege of the city of Golconde in south-central India by the last great Mughal emperor, Aurangzeb (reigned 1658–1707). Golconde was famous for its fort, palaces, factories, and ingenious water-supply system, as well as the legendary wealth from the city’s diamond mine. Aurangzeb was Sunni, while the rulers of the Deccan were Shia who accepted the suzerainity of the shah of Persia and resisted Mughal expansionism. Under the direction of the emperor himself, the city was besieged for eight months. It fell in October 1687 as the result of a bribe. In the foreground of the painting, the aged emperor sits on a litter with attendants, supervising native cavalry and artillery as they attack the walled and fortified city in the background. A breach has been made in the sandstone walls which the Mughal troops are traversing. The painting is from the Anne S.K. Brown Military Collection at the Brown University Library.
Source: Library of Congress