ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకోవడం లోని మతలబు మీద కామెంట్
రాజధాని అంశంపై దగాకోరు ఆలోచనను శాసనసభకు తెలియజేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మూడు రాజధానుల ఆలోచనను విడనాడలేదన్న భావనతోనే వివరణ ఇచ్చారు. బిల్లును మాత్రం వెనక్కి తీసుకొని, సమగ్రంగా తయారుచేసి, మళ్ళీ శాసనసభ ముందుకు వస్తామని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా వెల్లడించారు.
శ్రీబాగ్ ఒడంబడికను పదేపదే ఉచ్చరించి జగన్మోహన్ రెడ్డి గారికి రెండు ప్రశ్నలు. 1. శ్రీబాగ్ ఒడంబడికలో విశాఖపట్నంలో రాజధాని పెట్టమని ఉన్నదా? 2. అభివృద్ధి చెందిన హైదరాబాదు మీదే కేంద్రీకరించడం మూలంగా నష్టం జరిగిందంటూనే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన విశాఖపట్నం రాజధాని మేలన్న పల్లవి ఎందుకు శాసనసభలో వినిపించారు?