ఆంధప్రదేశ్ లో 60 మంది హక్కుల ఉద్యమకారులు, న్యాయవాదులపై NIA (జాతీయ దర్యాప్తు సంస్థ) నోటీసులు ఇవ్వడం పట్ల గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో IFTU, AIKMS, POW, PDSU, అరుణోదయ అను ఐదు ప్రజా సంఘాల రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో పి. ప్రసాద్. (ఇఫ్టూ రాష్ట్ర అద్యక్షులు) అధ్యక్షతన నిరసన సభ జరిగింది.
ఈ సభలో ప్రధాన వక్తగా ప్రశాంత భూషణ్ (సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది) వీడియో కాన్ఫరెన్స్ లో సందేశం ఇచ్చారు.
జాతీయ దర్యాప్తు సంస్థ, ఉపా నిర్బంధ చట్టం రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమైనవనీ, వాటి రద్దుకై ఐక్య పోరాటాల్ని చేపట్టాలని కోరారు.
సభ ఈ క్రింది తీర్మానాలు ఆమోదించింది.
1-ఉపా కేసుల్ని, NIA నోటీసుల్ని వెంటనే రద్దు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 29వ తేదీన నిరసన దినాన్ని పాటించాలని ఈ సభ పిలుపుని ఇచ్చింది.
2- ఉపా చట్టంతో పాటు NIA చట్టాన్ని కూడా రద్దు చేయాలంటూ సభ తీర్మానించింది. ఈరోజు గురువారం రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన NIA సోదాల్ని కూడా సభ ఖండించింది.
3-అమరజీవి ఆర్కే జ్ఞాపకాలతో ఆయన జీవిత సహచరి శిరీష పుస్తకం ప్రచురించడం నేరంగా ఆవిష్కరణ చేయడం నేరంగా హైదరాబాద్ నవ్య, ప్రింటర్స్ పై దాడి చేసి సంధ్య (POW సీనియర్ నేత్రి), ఆమె భర్త రామకృష్ణ రెడ్డి లపై నమోదు చేసిన కేసును ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ సభ తీర్మానించింది.
4-రాజ్యాంగ వ్యవస్థకి పోటీగా సమాంతర ఫాసిస్టు రాజ్య వ్యవస్థను తెచ్చే నిర్బంధ ప్రక్రియలో భాగంగా మోడీ ప్రభుత్వం NIA, ఉపాల్ని తెచ్చిందనీ, దానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఐక్యవేదిక ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాలని ఈ సభ తీర్మానించింది.
సుమారు 125 మందు హాజరైన ఈ సభ నాలుగున్నర గంటల పాటు ఏకబిగిన సభ కొనసాగి విజయవంతం అయ్యుంది.
ఈ సభలో సుంకర రాజేంద్ర ప్రసాద్ (AP బార్ కౌన్సిల్ సభ్యులు, AILU అఖిల భారత ఉపాధ్యక్షులు) చలసాని అజయ కుమార్ (AP బార్ కౌన్సిల్ సభ్యులు, ILA అఖిల భారత అధ్యక్షులు) లు ప్రసంగిస్తూ NIA అప్రజాస్వామిక నిర్బంధం పై, అక్రమ నోటీసులపై బార్ కౌన్సిల్ తరపున తాము కృషి చేస్తామని ప్రకటించారు. చిలుకా చంద్రశేఖర్ (CLC ప్రధాన కార్యదర్శి); వి.హన్మంత రావు (OPDR రాష్ట్ర ప్రధాన కార్యదర్శి); నంబూరి శ్రీమన్నారాయణ (హైకోర్టు లాయర్, CLC రాష్ట్ర ఉపాధ్యక్షులు) సురేష్ కుమార్ (IAPL అఖిల భారత నేత), సి.భాస్కరరావు (OPDR ఆలిండియా చైర్మన్),
గుత్తా రోహిత్ (HRF రాష్ట్ర కార్యవర్గ సభ్యులు) మాట్లాడుతూ గత మీసా, నాసా, పోటా, టాడా వంటి నల్ల చట్టాల కంటే ఉపా చట్టం ప్రమాదకరం అన్నారు. గురువారం తన ఇంటిపై NIA దాడి, సోదా కి గురైన అరసవిల్లి క్రిష్ణ (విరసం రాష్ట్రఅధ్యక్షులు) మాట్లాడుతూ తన ఇంటి పై అమానవీయ దాడి వివరాల్ని వెల్లడించారు. ఈ సభలో AIKMS రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ప్రభాకర్, POW రాష్ట్ర ప్రధాన కార్యదర్శి M. లక్ష్మీ, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరళ్ల శ్రీనివాస్ ప్రసంగించారు.
ఈ సభలో ఇంకా ఇఫ్టూ నుండి కె. పొలారి, ఎం. వెంకటేశ్వర్లు, యూ. వెంకటేశ్వరరావు, AIKMS నుండి తాండ్ర ప్రకాష్, పి. వెంకటరత్నం, నాగరాజు, POW నుండి గంగా భవాని, రమణి, PDSU రాష్ట్ర సహాయ కార్యదర్శి వై. పద్మ రాష్ట్ర నాయకులు పద్మ, మహర్షి అరుణోదయ నుండి కాకర్ల అప్పారావు, వెంకటలక్ష్మి తదితరులు హాజరయ్యారు. దీనికి 10 జిల్లాల నుండి 125 మంది హాజరయ్యారు. ఇందులో సుమారు 25 మంది మహిళలు కూడా హాజరయ్యారు. సభలో పాల్గొనాల్సిన PDSU రాష్ట్ర నాయకులు రవిచంద్ర, రాంమోహన్, భాస్కర్, భూషణం తదితర్లు పోలిస్ అరెస్టు చేయడంతో హాజరు కాలేక పోయారు.