జనగామ : కార్తీక పౌర్ణమి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం శ్రీరాంనగర్ కాలనీ, మూలబావి, శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం సామూహిక శ్రీ సత్యనారాయణ వ్రతములు, సాయంకాలం సహస్ర దీపాలంకరణ, శ్రీ తులసీ ధాత్రి నారాయణ కళ్యాణమహోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. దేవాలయ ప్రథాన అర్చకులు, జ్యోతిష్య మహర్షి డా” మోహనకృష్ణ భార్గవ వైదిక నిర్వహణలో. శ్రీ వైష్ణవ మహాభాగవతోత్తములు, జ్యోతిష్య శిరోమణి ఉ.వే.ప డా” శేషభట్టర్ వేంకటరమణాచార్యులు ఈ పూజకార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజున సామూహిక వ్రతములు, తులసీ ధాత్రి నారాయణ కళ్యాణ నిర్వహించడం విశేషమైన, అనంత పుణ్యఫలాలను అందించే ఈ బృహత్కార్యాన్ని తలపెట్టిన ఆలయ కమిటీ వారికి, పూజలో పాల్గొన్న భక్తజనానికి అనేక మంగళాశానములు అందించి ఆశీర్వదించారు. ఆలయ నిర్వాహకులు గజ్జెల నర్సిరెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు అవుతూ, విశేష పూజాకార్యక్రమాలను విజయవంతం చేస్తున్న భక్తులకు ధాతలకు ధన్యవాదాలు తెలియజేసారు. ఈ పూజ కార్యక్రమాలలో ఆలయకమిటీ సభ్యులు కందాడి మల్లారెడ్డి, పాశం శ్రీశైలం, కొర్రెముల రాంప్రసాద్, యెలసారి కృష్ణమూర్తి, రాంబాబు, సత్యనారాయణ, హనుమారెడ్డి, నరేష్ రెడ్డి, దోర్నాల వేణు, గజ్జెల జనార్థన్, ఆలయ అర్చకులు కృష్ణకుమార్, పోచన్న, సంపత్ కుమార్, సాయితేజ, రాజశేఖర్ తదితరులు పలువురు దంపతులు పూజలో పాల్గొన్నారు.