జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి కట్టుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్ ధర్నా చౌక్ కు తరలి వచ్చారు.
తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో, కేంద్ర ప్రభుత్వం తీరుకి నిరసనగా టిఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యేలు, తదితర ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం కేసిఆర్ ధర్నాకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మందీ మార్బలంతో పాల్గొన్నారు. ప్ల కార్డు ను పట్టుకొని ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నారు.
దేశానికి అన్నం పెట్టే రైతు శ్రేయస్సు కోసం అందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి మహా ధర్నాను విజయవంతం చేయాలని ఆయన కోరారు. మంత్రి వెంట ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులు, నాయకులు ఉన్నారు.