నేడు ఇందిరా పార్క్ దగ్గిర జరిగిన మహా ధర్నాలో ముఖ్యమంత్రి కెసీర్ పాల్గొన్నారు.
యాసంగి వరి సాగు, వరి ధాన్యం సేకరణ వంటి తెలంగాణ రైతుల సమస్యల మీద కేంద్ర వైఖరి స్పష్టం చేయాలని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ఈ ధర్నా జరిగింది. ధర్నాలో ప్రసంగిస్తూ ఉద్యమాన్ని అవసమరయితే జాతీయ స్థాయికి తీసుకువెళతామని ముఖ్యమంత్రి చెప్పారు. కేంద్రానికి నవంబర్ 18 తర్వాత రెండు రోజులు గడువు ఇస్తామని, కేంద్రం నుంచి స్పందనరాకపోతే, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన చెప్పారు.
అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందంతో కలిసి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారికి వినతి పత్రం అందజేశారు.రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంత్రులు హరీష్ రావు , మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్ గార్లు తదితరులు పాల్గొన్నారు.