*నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం, చెన్నైకి ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయింది.
* ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా మధ్య చెన్నై సమీపంలో రేపు తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉంది.
రాబోయే 24 గంటల్లో నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
*పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
*దక్షిణకోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
*తీరం వెంబడి గంటకు 45-65 కిమీ వేగంతో గాలులు ఉస్తాయి.
*రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు
*లోతట్టుప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కె.కన్నబాబు, విపత్తుల శాఖ కమిషనర్ హెచ్చరించారు.
ముఖ్యమంత్రి సమీక్ష
భారీ వర్షాలు కురుస్తున్న నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. నష్టం పెద్దగా లేకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
అవసరమైన చోట్ల సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని, రిజయర్వాయర్లు, చెరువులు, నీటినరుల వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆహారం, మందులు సిద్ధంచేసుకోవాలని అన్నారు