నోయిడా-BHEL ప్రయోగం విజయవంతమమయితే, ఇపుడు వీధి దీపాలు స్థంభాలొచ్చినట్లు ప్రతి వీధిలో గాలిని శుద్ది చేసే టవర్లు ఏర్పాటవుతాయి…
నగరాలలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్నది. ఊపిరాడని పరిస్థితి వస్తున్నది. భారత రాజధాని న్యూఢిల్లీ, ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతంలో పొల్యూషన్ ఎంత పెరిగిపోయిందంటే, చివరకు లాడ్ డౌన్ విధించే పరిస్థితి వచ్చింది. వూర్లో గాలిని తక్షణం శద్ది చేసే ఏర్పాట్లేవో చేసుకొనకపోతే, తీవ్రపరిణామాలు ఎదురౌతాయనేందుకు సుప్రీంకోర్టు రూలింగే తార్కాణం.
శనివారం నాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ ఈ పొల్యూషన్ మీద ఆందోళన వ్యక్తం చేస్తూ వెంటనే సీరియస్ చర్యలుతీసుకోవాలని అవసరయితే రెండు రోజులు లాక్ డౌన్ విధించే విషయం కూడా ఆలోచించాలని సూచించారు. ఇక హైదరాబాద్ పొల్యూషన్ విషయానికి వస్తే, ఢిల్లీ లాగా పరిస్థితి దిగజారకపోయినా, ఇక్కడ కూడా కాలుష్యం పెరుగుతూనే ఉంది. రుతుపవనాలు తగ్గిన తర్వాత కాలుష్యం పెరుగుతూ ఉందని ఆ మధ్య టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నివారణ మండలి (Telangana Pollution Control Board)సమాచారం ప్రకారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) రుతుపవనాల సమయంలో 100 పాయింట్ల లోపే ఉండింది. అంది 125 కు పెరిగింది. ఇదంత పొల్యూషన్ కాదు.
ఇలా దేశంలోని అన్నిపట్టణాలలో కాలుష్యం బెడద పెరుగుతున్నందున బిహెచ్ ఇఎల్ (BHEL)పూర్తి దేశీయ పరిజ్ఞానంతో ఒక ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ టవర్ (Air Pollution Control Tower : APCT)ను రూపొందించింది.
ఈ టవర్ ను మొదటి సారి ప్రయోగాత్మకంగా బెల్ ఉత్తర ప్రదేశ్ లోని నోయిడా అధారిటీలో ఏర్పాటు చేసింది. ఈ టవర్ వల్ల ఒక చదరపు కి.మీ పరిధిలో వాతావరణం కాలుష్యం అదుపులోకి వస్తుంది. ఫలితంగా ఈ ప్రాంత వాసులకు మంచి గాలి పీల్చుకునే అవకాశం పెరుగుతుంది. ఈ టవర్ ఫలితాలను బట్టి ముందుముందు ఢిల్లీ రాజధాని ప్రాంతమంతా ఇలాంటి టవర్ లను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.