1. నవంబరు 10 తారీఖు జన్మ దినం కలిగిన తెలుగు భాషోధ్దారకుడు ఎవరు?
2. ప్రపంచంలోనే ఇంత అందమైన చక్కటి గుండ్రటి భాషను తెలుగు తప్ప దేనినీ చూడలేదు అని చెప్పిన విదేశీయుడు ఎవరు?
3. తెలుగు- ఇంగ్లీషు మరియు ఇంగ్లీషు- తెలుగు నిఘంటువులను (డిక్షనరీలను ) మొదటగా తయారు చేసినది ఎవరు?
4. వేమన పద్యాల పట్ల విశేషమైన ఆకర్షణకు గురయిన విదేశీ భాషా పండితుడు ఎవరు?
5. ప్రజల నాలుకల మీద మాత్రమే వున్న వేమన పద్యాలను ప్రజల నుండి సేకరించి పుస్తకంగా వేయించినది ఎవరు?
6. తాళపత్ర గ్రంధాలుగా శిధిలా వస్తలో వున్న కవిత్రయ భారతాన్ని, పోతన భాగవతాన్ని , భాస్కర మరియు మొల్ల రామాయణాలను , రాఘవ పాండవీయము, మను చరిత్ర, వసు చరిత్ర పల్నాటి వీర చరిత్ర , కళా పూర్ణోదయము , విజయ విలాసం తదితర అనేక తెలుగు కావ్యాలను కవులతో పరిష్కరింప చేసి ముద్రించిన తెలుగు భాషా ప్రేమికుడు ఎవరు?
7. జీర్ణావస్తలో వున్న వందలాది తాళపత్ర గ్రంథాలకు శుద్ద ప్రతులను తయారు చేయించటమే గాక , షుమారు 60 పైగా తెలుగు కావ్యాలను ముద్రింప చేసినది ఎవరు?
8. తెలుగు నేర్చుకునే పాశ్చాత్యుల కోసం సరళ తెలుగు వ్యాకరణం రూపొందించినది ఎవరు?
9. తన జీతంలో మూడు వంతులు తెలుగు భాష ఉధ్దరణకు ఖర్చు పెట్టిన త్యాగ శీలి ఎవరు?
10. గుంటూరు ప్రాంతంలో 1832- 34 కాలంలో వచ్చిన డొక్కల కరువు లో నిద్రాహారాలు మాని ప్రజల కోసం పనిచేసిన ఆంగ్ల కలక్టర్ ఎవరు?
11. తన ఆదాయాన్ని తెలుగు భాషకు, ప్రజా సేవకు వినియోగించిన ఫలితంగా అప్పుల పాలయిన ప్రభుత్వాధికారి ఎవరు?
12. లండన్ లోని “ఇండియా హౌస్ లైబ్రరీ “నుంచి 2106 భారతీయ భాషల గ్రంథాలను మద్రాసు లైబ్రరీకి తెప్పించినది ఎవరు?
13. వేమన శతకాన్ని ఆంగ్లంలోకి అనువదించినది ఎవరు?
14. నీటి పారుదల- వ్యవసాయానికి సర్ ఆర్ధర్ కాటన్ చేసిన సేవ లాగా తెలుగు భాషకు సేవ చేసిన ఆంగ్లేయుడు ఎవరు?
15. ప్రపంచంలోని తెలుగు విద్యా వేత్తలు, భాషా పండితులు, శాస్త్ర కారులు అందరి కంటే కూడా ఒకే వ్యక్తి ఎక్కువ చేశాడని భాషా- సాహిత్య పరిశోధకుడు “బంగోరే” అన్నది ఎవరి గురించి ?
16.ఈ మహాను భావుడు తెలుగు భాషఉధ్దరణ కోసమే పుట్టినట్లు వున్నాడు అని సాహితీ వేత్త కొమర్రాజు లక్ష్మణ రావు గారు ఎవరు గురించి అన్నారు?
17. తెలుగు భాషోధ్దారకులలో ఏ కాలంలో కూడా ఇతనిని పోలిన విద్వాంసులు, భాషా పండితులు మరి ఒకరు లేరని భాషా- సాహిత్య పరిశోధకులు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అన్నది ఎవరి గురించి?
18. తెలుగు భాషా సూరీడు అని “ జానిమద్ది హనుమత్ శాస్త్రి “ గారు రాసినది ఎవరి గురించి?
19. జానిమద్ది హనుమత్ శాస్త్రి గారు కడపలో రూపొందించిన ప్రఖ్యాత గ్రంధాలయానికి ఎవరి పేరు పెట్టారు?
20. అరబ్బీ, పార్శీ, ఉర్దూ పదాలతో అధికార ప్రభుత్వ అవసరాలకు “మిశ్ర భాషా నిఘంటువు” రూపొందించినది ఎవరు?
21. తెలుగు లిపిని సంస్కరించి ముద్రణకు అనుగుణంగా రూపొందించినది ఎవరు?
22. వేయేల నేటి విద్యార్ధులు చదువుకునే కావ్యాలను కాపాడి ముద్రించి మనకు అందించిన తెలుగు కావ్య ప్రేమికుడు ఎవరు?