సాంఘిక సంక్షేమ పాఠశాలల పనితీరు బాగా మెరుగుపడటంతో రాష్ట్రంలో పేద, బలహీన వర్గాలకోసం అదే తీరులో డిగ్రీ స్థాయిలో గురుకుల కాలేజీలు ప్రారంభించాలని ప్రభుత్వానికి లేఖ
(అండ్ర మాల్యాద్రి)
ఆంధ్రప్రదేశ్ లో సాంఘీక & గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు 1984 లో ఏర్పడి తరువాత కాలంలో ఇంటర్మీడియెట్ జూనియర్ కళాశాలలుగా అభివృద్ధి చెందినాయి. ఈ మధ్య కాలంలో బలహీన వర్గాల సాంఘీక సంక్షేమశాఖ ద్వారా ఏర్పాటు చేశారు . సాంఘీక & గిరిజన & బలహీన సంక్షేమ గురుకుల విద్యాలయాలలో ఎంతో మంది పేద SC, ST, BC లకు చెందిన పేద విద్యార్థిని విద్యార్థులు క్రమశిక్షణ, అన్ని వసతులతో కూడిన విద్యను అభ్యసిస్తున్నారు. చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. మంచి ఫలితాలను కూడా ఇస్తున్నాయి. SC, ST , BC విద్యార్థిని విద్యార్థులల్లో విద్య పరంగా చాలా మార్పు వస్తుంది.
పూర్తి స్థాయిలో విద్య పరంగా నిలదొక్కుకోవడానికి ఆర్ధిక స్థోమత లేక ఇంటర్మీడియట్ తో చాలా మంది చదువులు ఆపేస్తున్నారు. SC,ST,BC విద్యార్థిని విద్యార్థులు విద్యాపరంగా, ఆర్ధిక పరంగా , సామాజిక పరంగా అభివృద్ధి చెందాలంటే ప్రస్తుతం నడుస్తున్న సాంఘీక & గిరిజన & బలహీన వర్గాల సంక్షేమ జూనియర్ కళాశాలతో పాటుగా ” సాంఘీక & గిరిజన & బలహీన సంక్షేమ వర్గాల గురుకుల డిగ్రీ కళాశాలలు ” ప్రభుత్వ ఆధ్యర్యంలో స్థాపించ వలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.
ఆర్ధిక స్థోమత లేక, ప్రయివేటు కార్పోరేట్ కళాశాలల్లో ఫీజులు కట్టి చదువ లేక మధ్యలోనే చదువులు ఆగిపోతున్నాయి. చదువులు మధ్యలో ఆగిపోవుట వలన తక్కువ చదువులతో ఉద్యోగాలు రాక , లేక కార్మికులుగా ఉంటున్నారు . వారికి వచ్చే కూలీ కుటుంబ పోషణకు ఏమాత్రం కూడ సరిపోవు. మరి ఆడపిల్లలకు దిక్కుతోచని పరిస్థితులలో బాల్య వివాహాలతో బంధీలుగా మారుతున్నారు. తొందరగా వివాహాలు జరుగుట వలన వారి ఆరోగ్యం కూడ దెబ్బతిని వారి జీవితాలు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో SC , ST , BC విద్యార్థిని, విద్యార్థులకు ఆధునిక డిజిటల్ పోటీ ప్రపంచంలో గౌరవం దక్కాలంటే ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ఉద్యోగం, ఉపాధి అవకాశాలు దొరకాలన్న నాణ్యమైన ప్రమాణాలతో ఉన్నత విద్య (డిగ్రీ) ను పూర్తి చేయడమే ఏకైక మార్గం.
కావున తమరు పెద్ద మనుసుతో SC,ST ,BC పేద విద్యార్థిని, విద్యార్థుల విద్య, ఉజ్వల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని వీరందరి సంక్షేమం కోసం తమరు సాంఘీక & గిరిజన & బలహీన వర్గాల సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల ఆవశ్యకతను మంజూరు విషయాన్ని ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్ళి ” సాంఘీక సంక్షేమ & గిరిజన & బలహీన వర్గాల గురుకుల డిగ్రీ కళాశాలను “ తమరు మంజూరు చేయించవలసినదిగా కోరుతున్నాము.
(ప్రధాన కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాసిన లేఖ)
(అండ్ర మాల్యాద్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘ (KVPS),Cell : 9490300366)