-ప్రజాస్వామ్య విధానంలో ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరిగే ఎన్నిలకును డబ్బు,మద్యం అనే స్థాయికి తీసుకువచ్చిండు. హుజురాబాద్ ఉప ఎన్నికలు కేసీఆర్,ఈట రాజేందర్ మద్యనే జరిగింది. హుజురాబాద్ లో ఈటల గెలుపే, అది బిజెపి గెలుపుకాదు
-టీపీపీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ ధ్యజం
ఎన్నిక లు అంటేనే మద్యం,డబ్బు అనే దిగాజారుడు స్థాయికి తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని టీపీపీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ ఆగ్రహం వ్య క్తం చేశారు. మంచితనానికి,మర్యాదకు ఓట్లు వేసే పరిస్థితి నుండి మనీ,మద్యం ఇస్తే తప్ప ఓట్లు వేయమనే స్థాయికి తెలంగాణ ప్రజలకు తీసుకోచ్చారని అది కేసీఆర్ కు చెల్లిందని ఆయన అరోపించారు.
తెలంగాణ ప్రజల పోరాటపటిమ,తెగింపు,ప్రశ్నించే తత్వన్నీ డబ్బు,మద్యంతో బానిసలుచేయాలకున్నా కేసీఆర్ కలలు కల్లలు చేస్తూ హుజురాబాద్ ప్రజలు చారిత్రమ్మక తీర్పునిచ్చారు. ఉద్యమ సమయంలో ఇచ్చిన హమీలు మరిచిపోవడం,ఫాం హౌజ్ పాలనకు విసిగి వేశారిని తెలంగాణ ప్రజలు ముఖ్యంగా హుజురాబాద్ ప్రజలు వారి యోక్క ఓటు అనే అయుధంతో అధికార పార్టీకి తగిన బుద్ది చేప్పారని అభిప్రాయపడ్డారు.
గతంలో కమాలాపూర్ నియోజక వర్గంలోనే అధికార తెలుగు దేశం పార్టీ అసమ్మతికి బీజం పడింది .మళ్లీ అదే కమాలాపూర్ ప్రజలుఈ అధికార టిఆర్ఎస్ పార్టీకి పతనానికి ఈ ఉప ఎన్నికలు నాంది పలకడం శుభపరిణామమన్నారు.ఇప్పటికైనా పాలకులు నేల విడిచిసాము చేయడం వదలి వాస్తవ పరిస్థితిలో జీవించి ఉద్యమ హమీలు. ఎన్నికల హమీలు నెరవేర్చి వారి చిత్తశుద్దిని నిరూపించుకోవాలని సుధాకర్ గౌడ్ డిమాండ్ చేశారు.