విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గన్నవరం ఎయిర్ పోర్ట్, దాని చుట్టు ప్రక్కల ప్రాంతాలలో నిషేధాజ్ఞలు విధించారు.
ఇక్కడి ప్రజలకు ఇబ్బందులు లేకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా, సజావుగా ట్రాఫిక్ నడపడానికి ఈ నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులు ఒక ప్రకటన విడుదల చేశారు. 55 రోజులు పాటు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి. ఈ రోజు నుంచి డిసెంబర్ 22 వరకు ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి. సిఆర్ పిసి సెక్షన్ 144 (2) కింద ఈ నిషేధాజ్ఞలు విధించారు.
నిషేధాజ్ఞలు అమలులో ఉన్న సమయంలో ఈ ప్రదేశం నుంచి 250 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకు మించి ఎక్కువ మందిజనం గుమికూడ రాదు. కర్రలు, ఇతర మారణాయుధాలు ధరించి తిరగరాదు. ఈ నిబంధనలుఉల్లంఘించిన వారి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు.