కొత్తగా వస్తున్న కరోనా వైరస్ ఇదే…

కొత్త కరోనావైరస్ దేశంలో కనిపిస్తూ ఉంది.  దీని పేరు ఎవై 4.2 (AY.4.2). ఇది కర్నాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, జమ్ము కాశ్మీర్,  తెలంగాణలలో కనిపించింది. ఈ రాష్ట్రాలనుంచి మొత్తంగా 17 కేసులు గుర్తించారు.  జమ్ము-కాశ్మీర్ లో  మే 29నే ఈ వేరియంట్  ను గుర్తించారు. నిజానికి   ఐరోపా దేశాలలో ఇది బాగా విస్తరిస్తూ ఉంది. ఎవై 4.2 అనేది డెల్లావేరియంట్ వారసత్వం అయినందున  దానిని డెల్టా ప్లస్ అని కూడా పిలుస్తున్నారు. చైనా, రష్యా, యుకెలలో బాగా కోవిడ్ మళ్లీ వ్యాపిస్తున్నందుకు ఈ వేరియంటే కారణం.

ఇందులో ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఏడు కేసులను కనుగొన్నారు.  ఆగస్టు 11, సెప్టెంబర్ 9 మద్య హైదరాబాద్ లోని సిసిఎంబి(CCMB)వీటిని గుర్తించింది.  ఇక తెలంగాణకు సంబంధించి రెండు కేసులు కనిపించాయి.  సెప్టెంబర్4,సెప్టెంబర్ 11 మధ్య వీటిని  సిడిఎఫ్ డి (CDFD) గుర్తించింది.

కర్నాటకో జూలై 7-17 మధ్య రెండు కేసులు కనిపించాయి. వీటి సంఖ్య ఇపుడు ఏడు కు పెరిగింది. కేరళ లో 4 ఈ తరహా  వేరియంట్స్ ని  జూలై 16-21 మధ్య ఆ రాష్ట్రానికి చెందిన జినోమ్ సర్వైలాన్స్ ప్రోగ్రామ్ సమర్పించింది. ఈ వేరియంట్ మరణాలేవి రికార్డు కాలేదు. ఈ సోకివారిలో ఒకరిద్దరు మాత్రం ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం ఉందని కర్నాటక ఫామిలీ వెల్ఫే ర్ కమిషనర్ రణదీప్ విలేకరులో చెప్పారు.

డెల్టా వేరియంట్ కంటే 15 శాతం వేంగా వ్యాపించే ఈ వైరస్ కేసులు ఇంగ్లండులో  బాగానే పెరుగుతున్నాయి. ఇంగ్లండు కేసుల్లో డెల్టా ప్లస్ వాటా  ప్రస్తుతానికి 9 శాతమని  చెబుతున్నారు. డెల్టా వేరియంట్ కి మొత్తం  45 రకాల వారసులున్నాయి. ఇంతవరకు కనిపించిన కోవిడ్ వైరస్ లన్నింటి కంటే ఇది వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

తొందర్లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని గుర్తించి దీనికొకపెరుపెట్టే వీలుంది. ఈపేరుపెట్టే ముందు దీని హోదాని పరిశోధనలో ఉన్న వేరియంట్ (Variant Under Investigation)కు పెంచాలి.  మీడియా రిపోర్టుల ప్రకారం, ఎఐ 4.2  కి న్యూ (Nu) పేరు పెట్టవచ్చు.

ఇంగ్లండు హెల్త్ సెక్యూరిటీ ఏజన్నీదీనిని పరిశోధనలో ఉన్న వేరియంట్ (Variant Under Investigation) గా గురించింది. అంటే దీనితో ముప్పు ఉండే అవకాశం ఉందని అర్థం.  అయితే, ఇప్పటికి ఇది తీవ్రమయిన జబ్బును కలిగించడం లేదని బిబిసి న్యూస్ రాసింది. ఇంగ్లండులో ఇపుడు ప్రధాన కనిపించేంది డెల్టా వేరియంటే అయినా, డెల్టా ప్లస్ కేసులు బాగా పెరుగుతున్నాయని బిబిసి రాసింది.  స్పైక్ ప్రొటీన్ లను మార్చుకుని మనిషి కణాన్ని కుట్టేందుకు ఎత్తిన డెల్టావేరియంటే డెల్టాప్లస్. ఇదింకా పరిశోధన క్రమంలోన ఉండడంతో ప్రమాదకరమయినది (Variant of Concen) దీనిని ప్రకటించలేదు.

ఇలాంటి కేసులు కొన్ని అమెరికాలో కూడా కనిపించాయి. అలాగే డెన్మార్క్ లో కూడా కనిపించాయి, అవి వాటంతటవే తగ్గిపోయాయి అక్కడ. ఇంతవరకు ఉన్న సమాచారం ఈ డెల్టా ప్లస్ కు ఇపుడు అందుబాటులో ఉన్న వ్యాక్సినే సరిపోతుందని, కొత్తది అవసరపడక పోవచ్చు. అయితే, తప్పక వ్యాక్సిన్ వేయించుకోవాలని, అవసరమయితే మూడో డోస్ కూడా సిద్ధంకావాలని ఇంగ్లండు అధికారలు చెబుతున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *