ఆటోలో కూర్చున్నా షాక్ కొడుతుంది

ఆటోలో కూర్చున్నా షాక్ కొట్టే రోజులొస్తున్నాయి. ఆటో ప్రయాణం కూడా భారమయ్యే రోజులొచ్చాయి భారత్ లో. పెట్రలో డీజిల్ ధరలు రోజూ పెరుగుతూ ఉండటంతో   ఆటోల, టాక్సీల చార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయి.

ఆటోలు, క్యాబ్ లు  నగరాల నిత్యజీవితంలో భాగమైపోయాయి. ఆటో, క్యాబ్ ఎక్కకుండా కేవలం పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ ను నమ్ముకుని కార్యక్రమాలు చేపట్టలేం. సిటీ బస్సులు ఎక్కడమూ దిగడమూ హైదరాబాద్ లాంటినగరాలలో కష్టం. వృద్ధులు, రోగులు అసలు హైదరాబాద్ సిటీ బస్సులలో ప్రయాణించనే లేరు. హైదరాబాద్ సిటీ స్టాప్ లలో ఆగవు. ఒకరిద్దరు దిగేవాళ్లుంటేడ్రైవర్లు ఆపరు, కదులుతుండగానే దిగాలి. ఎక్కాలి.అందువల్ల వృద్ధులు, రోగులకు బస్సులు అనుకూలంగా లేవు. ఆఫీసులకు వెళ్లు వాళ్లుకూడా చాలా  మటుకు ఆటోలలో వెళ్తుంటారు.  ఇపుడు ఇంతవరకు ఆటో ప్రయాణం మధ్యతరగతి కుటంబాలకు అందుబాటులోనే ఉంటూ వచ్చింది. అయితే, దేశంలోని చాలా నగరాలలలో ఆటోల, క్యాబ్ చార్జీలను భారీగా పెంచుతున్నారు.

ఇపుడు తాజాగా  బెంగుళూరు ఆటో క్యాబ్ చార్జీలను పెంచాలనే ప్రతిపాదన వచ్చింది. దక్కన్ హెరాల్డ్ రిపోర్టు ప్రకారం ట్రాన్స్ పోర్టు డిపార్టు మెంటు 20 శాతం చార్జీల పెంపును ప్రతిపాదించింది. ఆటోయూనియన్ల వత్తిడితో ఈ 20 శాతానికి ప్రభుత్వం అంగీకరించింది. తొందర్లోనే ఇవి అమలులోకి వస్తాయి. అమలవుతూనే మినిమమ్ ఆటో చార్జీ  రు. 25నుంచి రు. 30కి పెరుగుతుంది,  అంటే కిలో మీటర్ కు ఇపుడు వసూలు చేస్తున్న  రు.13 ను రు. 16 కు పెంచుతారు.  గతంలో ఎపుడో 2013లో మాత్రమే ఆటొచార్జీలను  పెంచారు. అపుడు మినిమిమ్ ఫేర్  20 నుంచి రు.25కు పెంచారు. కిలోమీటర్ చార్జ్ రు. 11 నుంచి `13 కు పెంచారు. కాకపోతే, మినిమం ఫేర్ డిస్టెన్స్  1.8. కిమీ నుంచి 1.9 కి.మీ పెంచారు.ఇపుడు ధరలు గతంలో లాగా అపుడపుడు కాకుండా రోజూ పెరుగుతూ ఉండటంతో ఆటో చార్జీలను పెంచేందుకు అనుమతించాలని యూనియన్లు డిమాండ్ చేశాయి. కరోనాతో ఆర్థికంగా చితికిపోయిన సమయంలో  ఆటో చార్జీలు పెంచితే, ప్రయాణికులు ఆటోలు ఎక్కడం మానేస్తారేమోననే  ఆందోళనను కొన్నియూనియన్లు వ్యక్తం చేసినా,చార్జీలను పెంచాలనే నిర్ణయాన్నీ చివరకు అంతా సమర్థించారు.

ఇది ఇలా ఉంటే ముంబైలో మార్చి ఒకటో తేదీనే చార్జీలు పెంచారు.కాలీ పీలీ టాక్సీ ల చార్జీలను మంబై మెట్రోపాలిటన్ రీజియన్ లో  కిలో  మీటరుకు ఏకంగా రు.3 పెంచారు. ఇక ఆటో రిక్షాలకు సంబంధించి మినిమమ్ చార్జ  21 రుపాయలు చేశారు. తర్వాత కిలోమీటరకు పై. 14.20 (పైసలు) పెంచారు. టాక్సీల బేస్ ఫేర్ ను రు. 25 చేశారు. టాక్సీలు కి.మీ రు.22 వసూలు చేస్తాయి.  సిఎన్ జి ధరలు పెరగడంతో ఉత్తరప్రదేశ్ లక్నోలో కూడా ఆటో చార్జీలు పెంచారని ఇండియా టుడే రాసింది.ఇక్కడ ఏడేళ్ల తర్వాత ఆటో, టెంపో చార్జీలు పెరుగుతున్నాయి. గతంలో 2014 ఫిబ్రవరిలో మాత్రమే చార్జీలను పెంచారు. అపుడు సిఎన్ జి ధర  రు.48 ఉంటే ఇపుడు రు,68కి పెరిగింది.

దేశంలో 2014 తర్వాత తొలిసారిగా చాలా నగరాలలో ఆటో క్యాబ్ చార్జీలు పెరుగుతున్నాయి.  రోజూ పెట్రోలు ధరలు చార్జీలు పెరుగుతున్నాయి. దీనితో ఆటోలకు చార్జీలు పెంచడం తప్పని సరి అవుతుంది. అయితే, ఆటోలు దీనిని ఆసరా చేసుకుని  మీటర్ మీద సవారికి రాకుండా చేసి ఇంకా ఎక్కువ చార్జీలు వసూలు చేస్తారు. దీనిని ప్రభుత్వం ఎలాగూ నియంత్రించలేదు. ఆటోయూనియన్లు చార్జీలు పెంచడానికే తప్ప వాటిని క్రమశిక్షణలో పెట్టడానికి ముందుకురావు. అందువల్ల ఇక ముందు ఆటో ప్రయాణం కూడా సామాన్యుడికి భారం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *