రేపు దాదాసాహెబ్ అవార్డు అందుకోనున్న రజినీ

తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ రేపు దాదాసాహెబ్ పాల్కే అవార్డు అందుకోబోతున్నారు. దీని కోసం ఆయన ఈ రోజు కుటుంబసమేతంగా ఢిల్లీ వెళ్లారు. 2019 సంవత్సరానికి ఆయనను దాదాసాహెబ్ పాల్కే అవార్డుకు ఎంపిక చేశారు.ఈ అవార్డును అందుకుంటున్న 51 కళాకారుడు రజినీ కాంత్.  ఈ ఏడాది ఏప్రిల్ లో అప్పటి కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ ప్రకటించారు. అరవై దాటిని ఆగని చిత్రసీమ మహత్తర  పయనం రజినీది.  ఇటీవలి కాలంలో కూడా ఆయన  చిత్రాలు సంచలనం సృషిస్తున్నాయి. శివాజీ,ఇందిరన్, దర్బార్, బాషా వంటి చిత్రాల గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు.అలాగే రోబో గురించి కూడా. భారతీయ చిత్రరంగానికి నటుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా రజినీ కాంత్ సేవలు అమోఘమయివనని అవార్డు ప్రకటింస్తూ జవడేకర్ ప్రశంసించారు.

అవార్డు స్వీకరించేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్న విషయం అభిమానులకు తెలియకుండాదాచాలనుకున్నా, వీలు కాలేదు. పెద్ద ఎత్తున అభిమానులు డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ కు తరలి వచ్చారు. వారికి కనిపించకుండా ఆయన   గేట్ నెంబర్ వన్  నుంచి కాకుండా గేటు నెంబర్ 4  నుంచి వెళ్లాలనుకున్నా, వీలుపడలేదు. పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి పరిగెత్తి అభినందనలు తెలిపారు. నినాదాలిచ్చారు.

ఆశాభోంస్లే, శంకర్ మహదేవన్, నటులు మోహన్ లాల్, బిశ్వజిత్, నిర్మాతసుభాష్ ఘయ్ లున్న జ్యూరీ రజినీని ఈ అవార్డుకు ఎంపిక చేసింది.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *