ఆంధ్ర ప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం తోపాలు, జిల్లా కార్యాలయాల మీద , టీడీపీ నేతల ఇళ్ల మీద వైకాపా నేతలు జరుపుతున్న మూక దాడికి వ్యతిరేకంగా నేడు హైదరాబాద్ లో కూడా పలుచోట్ల తెదేపా కార్యకర్తలు గాంధీ విగ్రహాల వద్ద నిరసన ధర్నాలు చేశారు. ఆంధ్ర లో రాష్టపతి పాలన విధించాలని, డిజిపి ‘గద్దె దిగిపోవాలి,’ అని టిడిపి కార్యకర్తలు నినాదాలు చేశారు.
మరొక వైపు చంద్రబాబు దీక్ష
టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడు 36 గంటల పాటు నిరసన దీక్షకు పూనుకుంటున్నారు. ఇది ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు అని ఆయన వర్ణించారు.
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం, జిల్లా కార్యాలయాలు, టీడీపీ నేతల ఇళ్లపై వైకాపా నేతల జరుపుతున్న మూక దాడికి వ్యతిరేకంగా ఆయన నిరసన దీక్ష చేపట్టనున్నారు.
21-10-2021 గురువారం ఉదయం 8 గంటల నుంచి 22-10-2021 శుక్రవారం సాయంత్రం 8 గంటల వరకు 36 గంటల పాటు చంద్రబాబు కేంద్ర పార్టీ కార్యాలయం వద్ద నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టనున్నారు. మరిన్ని వివరాలు ఇక్కడ క్లిక్ చేయండి.