తెలంగాణా లో ఒకట్రెండు రోజుల్లో 3 కోట్ల డోసులు వాక్సినేషన్ పూర్తి కానుందని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుతెలిపారు. ఈ నేపథ్యంలలో ఆయన రెండో డోస్ ను లైట్ తీసుకోవద్దు అనిప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో 75 శాతం మందికి మొదటి డోస్ పూర్తి అయిందని, 39 శాతం రెండో డోస్ పూర్తయిందని ఆయన వెల్లడించారు.
50 లక్షల వాక్సిన్ నిల్వ తెలంగాణ లో ఉందని చెబుతూ పస్తుతం 0.4 శాతం మాత్రమే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని ఆయన చెప్పారు.
‘కోవిడ్ అదుపులో ఉంది . వాక్సిన్ వల్ల కరోనా నుంచి 99 శాతం రక్షణ ఉంటుంది. రెండో డోస్ తీసుకోవాల్సిన వాళ్ళు 36 లక్షల 35 వేల మంది ఉన్నారు. రెండో డోస్ ను లైట్ తీసుకోవద్దు. రష్యా, యూకే ల్లో కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. వాక్సిన్ తీసుకోని వాళ్లలో 60 శాతం మందికి వైరస్ సోకుతుంది,’ అని ఆయన హెచ్చరించారు.
ఒక్క డోస్ తీసుకున్న వాళ్లలో 30 శాతం మందికి కరోనా సోకుతుందని చెబుతూ ప్రతి ఒక్కరు రెండు డోసులు తీసుకోవాలని ఆన అన్నారు.
రాష్ట్రంలో దాదాపు 69 లక్షల మంది ఇంకా ఒక్క డోస్ కూడా తీసుకోలేదు అని ఆయన వెల్లడించారు.