ఉత్తర ప్రదేశం ప్రభుత్వం ఒక కొత్త నియమం తీసుకువచ్చింది. ప్రభుత్వోద్యోగాలలో ఉన్న ప్రతి ఒక్కరు ‘నేను కట్నం తీసుకోలేదు’ అని ప్రభుత్వానికి అఫిడవిట్ సమర్పించాలి. ఈ మేరకు అక్టోబర్ 12న ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది.
2004 ఏప్రిల్ 30 తర్వాత వివాహం చేసుకున్న ఉద్యోగులంతా కట్నం తీసుకోలేదు (No Dowry Taken) అఫిడవిట్ ని తమ శాఖాధిపతులకు సమర్పించాల్సి ఉంటుంది. అక్టోబర్ 18 లోపు ఈ అఫిడవిట్ సమర్పించాలి. అలా సమర్పించని వారి మీద చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం శాఖాధిపతులనుఆదేశించింది.
ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఉత్వర్వులుజారీ చేయడం దేశంలో ఇదే మొదటిసారి. 1961, కట్న నిషేధ చట్టం ప్రకారం ప్రభుత్వోగాలలో చేరుతున్నపుడు తాముకట్నం తీసుకోమని హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఇపుడు 2004 ఏప్రిల్ 30 తర్వాత పెళ్లి చేసుకున్నవాళ్లంతా కట్నం తీసుకోలేదని అఫిడవిట్ ఇవ్వాలని నియమం పెట్టారు.
ఈనియమం అమలుజరుగుతున్న తీరు మీద మహిళా సంక్షేమ శాక ప్రభుత్వం ఒక స్టేటస్ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుంది. ఉత్తర ప్రదేశ్ లో 1999 లో కట్న నిరోధ నియమాలు విడుదలయ్యాయి. ఈ నియమాలను 2004 మార్చి 31న సవరించారు. ఇందులోని రూల్ 5 ప్రకారం ప్రతి వ్యక్తి ఉద్యోగంలో చేరేటపడు ‘నేను కట్నం తీసుకోలేదు,’ అని అఫిడవిట్ సమర్పించడం తప్పనిసరి చేసింది.ఈ సర్టిఫికేట్ లను వెంటనే సేకరించాలని అక్టోబర్ 12న ఉత్తర్వులు జారీ చేశారు.
“ You are, therefore, requested to necessarily obtain an affidavit from all the government servants posted in offices under you by October 18, with the affidavit stating that they received no dowry in their marriage. Please, ensure that action against employees who do not give an affidavit to this effect,” అని శాఖాధిపతులను ఆదేశించారు.
దేశంలో కట్నం తీసుకోవడం చట్ట వ్యతిరేకం. చట్టాన్ని ఉల్లంఘిస్తే అయిదేళ్ల వరకు జైలు శిక్ష, రు. 15 వేలు లేక కట్నం విలవతో సమానమయిన మొత్తం జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది.