రాజేందర్ గెలిచే అవకాశమే లేదు : హరీష్ రావు

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలిచే అవకాశమే లేదు, ఆయనకు ఓటేయ వద్దు అని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు.
గెల్చి రాజేందర్ చేసేదేమీ లేదని కూడా హరీష్ అన్నారు.
పిసిసి నాయకులు కౌశిక్,కశ్యప్ రెడ్డిల కలిసి వేల మంది కార్యకర్తలు కాంగ్రెసును వీడి టిఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆ పార్టీ జమ్మికుంట పట్టణ శాఖ అధ్యక్షుడు కె.వెంకన్న, డిసిసి అధికార ప్రతినిధి సలీంల నాయకత్వంలో చాలామంది కార్యకర్తలు, గులాబీ కండువాలు కప్పుకున్నారు
ఈ సందర్భంగా ఆబాదీ జమ్మికుంటలోని కాటన్ మిల్లులో జరిగిన కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడారు.
“రాజేందర్ గెలిస్తే ఆయనకు మాత్రమే లాభం.గెల్లు శ్రీనివాస్ గెగెలిస్తే హూజూరాబాద్ మరింత అభివృద్ధి అవుతది. రాజేందర్ గెలిచే అవకాశమే లేదు.
పెట్రోల్ ,డీజిల్, వంట గ్యాస్ ధరలతో పాటు నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగినయ్..రాజేందర్ ప్రజల గురించి మాత్రం మాట్లాడుతలే. .ఈటల నీకు ఢిల్లీలో పలుకుబడి ఉందిగా వంట గ్యాస్ ధర తగ్గించు
గ్యాస్ బండ ప్రజలకు గుదిబండగా మారింది,” అని చురక వేసాడు.
హరీష్ ఇంకా ఏమన్నారంటే…
గెల్లును గెలిపిస్తే నేను, ఈశ్వరన్న దగ్గర ఉండి హూజూరాబాద్ ను గొప్పగా అభివృద్ధి చేస్తం. నిన్న కాంగ్రెస్ నేత మానిక్ ఠాకూర్ వచ్చి బిజెపిని కాదు టిఆర్ఎస్ ను తిట్టిపోయిండు.. కాంగ్రెసు, బిజెపిలు ఒకటైనయ్ చీకట్లో షేక్ హ్యాండ్ ఇచ్చుకుండ్రు.
అభివృద్ధి మరింత ముందుకు సాగాలంటే గెల్లు శ్రీను భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించండి . తెలంగాణలో కరెంట్ కట్ లేదు. నాణ్యమైన కరెంట్ ఇస్తోంది.
తెలంగాణ బొగ్గును ఇతర రాష్ట్రాలకు తరలించే కుట్ర చేస్తోంది బీజేపీ ప్రభుత్వం.
దళిత బంద్ మీద బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఎన్నికల కమిషన్ కు లేఖ రాస్తే, 30 వ తేదీ వరకు దళిత బంద్ ఆపమని ఎన్నికల కమిషన్ ఆదేశించింది.
పది రోజులు ధళితబందు ఆపే శునకానందం పొందుతున్నారు ‌.మళ్లీ బీజేపీ వాళ్లే దొంగ దొంగ అని జనంలో పడి అరుస్తున్నరు‌ పది‌రోజులు ఆపుతారేమో. తర్వాత సీఎం కేసీఆర్ గారే ఉంటరు. దళిత బందు ఇస్తరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *