తెలంగాణకు

 

తెలంగాణ లో  నైరుతి రుతుపవనాల ఉపసంహరణ

 

ఉత్తర ఆంధ్రప్రదేశ్ – దక్షిణ ఒడిశా కోస్తా ప్రాంతాల పరిసర పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పరిసర పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్నది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిమి ఎత్తు వరకు కొనసాగుతూ ఎత్తు కి వెళ్ళే కొలదీ నైరుతి దిశ వైపుకి వంపు తిరిగి ఉన్నది.

తూర్పు-పశ్చిమ ద్రోణి మర్థబన్ గల్ఫ్ మరియు దానిని ఆనుకొని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతం నుండి తూర్పు-మధ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దాని పరిసర పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు విస్తరించి ఉన్నది.

రాగల 3 రోజులకు వాతావరణ సూచన:

ఈ రోజు తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో, రేపు కొన్ని చోట్ల ఎల్లుండి ఒకటీ లేదా రెండు చోట్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి.

వాతావరణ హెచ్చరికలు:

తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఈరోజు మరియు రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు ఆదిలాబాద్, కుమారంభీం-ఆసిఫాబాద్ మరియు నిర్మల్ జిల్లాలలో ఒకటి లేదా రెండు ప్రదేశాలలో, భారీ వర్షాలు కొన్ని జిల్లాలలో ఒకటి లేదా రెండు ప్రదేశాలలో వచ్చే అవకాశం ఉంది.

రేపు భారీ వర్షాలు కొన్ని జిల్లాలలో ఒకటి లేదా రెండు ప్రదేశాలలో వచ్చే అవకాశం ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు ప్రదేశాలలో చాలా జిల్లాలలో, రేపు ఒకటి లేదా రెండు ప్రదేశాలలో కొన్ని జిల్లాలలో కురిసే అవకాశం ఉంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *